ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు
మంథని: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆదేశాల మేరకు జెడ్పీటీసీ సభ్యడు గోనె శ్రీనివాస్‌రావు ఆద్వర్యంలో మండలంలోని తాడిచర్ల గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో పుట్ట మధు నియోజకవర్గ పరధిలోని ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కాబట్టి ఎన్నికల్లో మళ్ళీ టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధును భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.
మండలంలోని పెదతూండ్ల ఎస్సీ కాలనీకి చెందిన యూత్, మహిళ సభ్యులు ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట మధు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాజోద్ధిన్, యూత్ అధ్యక్షుడు బాలాజీ, నాయకులు శీలం లక్ష్మయ్య, మెతుకు సమ్మయ్య, అనిపెద్ది రాంబాబు, తిరుపతిరావు, బొంతల రాజు, మల్లేష్, రఘుపతి, ఇనుముల సతీష్, సారయ్య, రాజు, సదానందం, సురేష్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.
కాటారం: మండలంలోని జాదారావుపేటలో ఆదివారం టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత నాలుగున్నరెళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను, టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో గూర్చి గ్రామస్థులకు వివరించారు. గతంలో ఈ ప్రాంతాన్ని ఏకదాటిగా పాలించిన కాంగ్రెస్ నాయకులు ప్రజల కష్టాలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన బిడ్డగా పుట్ట మధు ఎమ్మెల్యేగా 2014లో గెలిచాక స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మొసలి కన్నీరు, మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ తుల్సెగారి శంకరయ్య, నాయకులు నరివెద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించాలి..
మహదేవపూర్:మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బగూడెం, టస్సర్‌కాలనీ, ఇస్లాంపుర కాలనీల్లో ఆదివారం ఇంటింటా ప్రచారం చేస్తూ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి పుట్ట మధును భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్దించారు. ఈ పచ్రార కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి బాపు, కాటారం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు అలీంఖాన్, సమ్మిరెడ్డి, డివిజన్ సమస్వయ కమిటీ సభ్యులు బాలా జీరావు, పెండ్యాల మనోహర్, కార్యకర్తలు శ్రీహ రి, ప్రకాశ్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
గెలుపు ఖాయం..
మహదేవపూర్: మంథనిలో పుట్ట మధు గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు బెల్లంకొండ నర్సింగరావు అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన మండల కేంద్రంలోని పూర్వపు స్నేహితులు, సన్నిహితులతో కలసి ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధు పట్ల ప్రజాధరణ పెరిగిందని, మండలంలో 60శాతం ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బహూమానంగా ఇవ్వాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీపతి బాపు, నాయకులు దాబాడే బాలాజీరావు, శ్రీనివాసరావు, మోహన్‌రెడ్డి, ప్రకాశ్, ప్రభాకర్, సంజీవరెడ్డి, ప్రవీణ్, రమణయ్య, పద్మ, రవీందర్, సమ్మయ్యలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment