అవకాశమిస్తే సేవకునిగా పనిచేస్తా... | Give Me Chance Work As Servant-Putta Madhu | Sakshi
Sakshi News home page

అవకాశమిస్తే సేవకునిగా పనిచేస్తా...

Published Fri, Nov 23 2018 1:50 PM | Last Updated on Fri, Nov 23 2018 1:51 PM

 Give Me Chance Work As Servant-Putta Madhu - Sakshi

వాకర్స్‌ను ఓటు అభ్యర్థిస్తున్న పుట్టమధు  

రామగిరి(మంథని) : ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో మరో అవకాశం ఇస్తే ప్రజా సంక్షేమానికి సేవకుడిలా పనిచేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. సెంటినరీకాలనీ రాణి రుద్రమాదేవి స్టేడియంలో గురువారం తెల్లవారు జామున వాకర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. మండలాధ్యక్షుడు పూదరి సత్యనారాయణ, ఎంపీటీసీ ఆశాకుమారి, నాయకులు పాల్గొన్నారు.  

టీఆర్‌ఎస్‌లో చేరికలు 
రామగిరి: టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. ఇనగంటి రామారావు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ ఓపీపీ1 సీహెచ్‌పీలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 50 మంది పుట్టమధు సమక్షంలో గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మండలాధ్యక్షుడు పూదరి సత్యనారాయణ, కిషన్‌రెడ్డి, ఎంపీటీసీ ఆశాకుమారి నాయకులు పాల్గొన్నారు.  

టీఆర్‌ఎస్‌ ఇంటింటీ ప్రచారం 
కమాన్‌పూర్‌: మండలంలోని పెంచికల్‌పేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధును గెలిపించాలని కోరుతూ గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పుట్ట మధు కోడలు కుషాలీ ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి తన మామ పుట్ట మధును గెలిపించాలని కోరారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, ఇనగంటి భాస్కర్‌రావు, రామారావు, గడుప కృష్ణమూర్తి, కూర విజయ, తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement