రామగిరి: మాట్లాడుతున్న పుట్ట మధు
ముత్తారం: 4సంవత్సరాల్లో టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చూసే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల కిష్టయ్య, వీరేందర్‌తోపాటు 20 మంది కాంగ్రెస్ నాయకులు ఆదివారం మధు సమక్షంలో కండువా కప్పుకున్నారు. ముత్తారం గ్రామానికి చెందిన శ్రీరామా యూత్ సభ్యులు 20 మంది టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో మధు సమక్షంలో చేరారు. ఎంపీపీ అత్తె చంద్రమౌళి, మండల అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నూనె కూమార్, చెల్కల అశోక్, నాయకులు భాను, తిత్తుల శ్రీనివాస్, దాసరి చంద్రమౌళి, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.
ఆశీర్వదించండి...
రామగిరి: 4సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి చేశానని, మరోసారి ఓటేసి ఆశీర్వదిస్తే అభివృద్ధిలో నియోజకవర్గ రూపురేఖలే మార్చేసేలా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు. మస్త్యాల, సింగిరెడ్డిపల్లి గ్రామాల్లో మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. వివేక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో గొప్పవన్నారు. ఎంపీటీసీలు ఎలువాక ఓదెలు, బాకం రాజేశం, మాజీ సర్పంచ్ సుంకరి మాధవిమహేశ్, మండల అధ్యక్షుడు పూదరి సత్యనారాయణగౌడ్, అధికార ప్రతినిధి కొంరయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment