సాక్షి, పెద్దపల్లి: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. లాయర్ల హత్య జరగడానికి ముందు పుట్టా మధు రూ. 2 కోట్లు డ్రా చేసిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య కేసు ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ జైల్లో ఉండగా గుంజపడుగులో నిందితుడి ఇంటి నిర్మాణం శరవేగంగా సాగడంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.
అదేవిధంగా పుట్టా మధు అనుచరులు సత్యనారాయణ, సతీష్ పోలీసుల అదుపులో ఉన్నారు. గతంలో న్యాయవాద దంపతులు పుట్టా మధు దంపతులపై కోర్టులో కేసులు వేసిన విషయం తెలిసిందే. న్యాయవాది దంపతుల హత్య కేసులో పుట్టా శైలజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక నాలుగు రాష్ట్రాల్లో 4 వాహనాలను మారుస్తూ పట్టా మధు 6 ఫోన్లు మార్చినట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి: Putta Madhu: అత్యంత పకడ్బందీగా అజ్ఞాతం
చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు
Comments
Please login to add a commentAdd a comment