
టీ-టీడీపీకి మరో షాక్
కరీంనగర్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర నళిని బుధవారం పార్టీకి రాజీనామా చేశారు.
ఆమె రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. 30 ఏళ్ళుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని నళిని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రమాదకరంగా మారిందని.... ఆదరణలేని పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నానని ఆమె అన్నారు. తన భవిష్యత్తు ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానని నళిని చెప్పారు.