సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు స్వరూపాన్ని బయటపెడుతూ.. ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు నటి దివ్యవాణి. టీడీపీలో జరిగిన అవమానాలను ఏకరువు పెట్టిన ఆమె.. పార్టీ కోసం ఎంతో చేసినా తీవ్రంగా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్‌లో రాజీనామా ప్రకటన చేశారామె.
కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు దివ్యవాణి. ‘‘నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటారేమో. ఒక అర్టిస్టుగా పార్టీ కోసం వస్తే అన్ని రకాలుగా అణిచివేశారు. ఒక కళాకారుడు(స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ..) పెట్టిన పార్టీలో కళాకారులకు చోటు లేదు. మురళీమోహన్‌కు వ్యాపారాలు వేరే ఉన్నాయి కాబట్టి కొనసాగుతున్నారు. అధికారం లేని అధికార ప్రతినిధిగా నన్ను మిగిల్చారు.
మూడేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే.. కనీసం గుర్తింపు కూడా లేకపోయిందని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిస్టుగా ఉన్న తాను టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఫైర్ బ్రాండ్‌గా ఎంతో సమయం వెచ్చించానని అయినా.. పార్టీ అధిష్టానం తనను మహానాడు వేదికగా అవమానించి పంపించిందని దివ్యవాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్టీ లైన్ అంటే ఏంటో తెలుసుకుని ఎంతో కష్టపడ్డానని, అయినా కనీస న్యాయం ఏనాడు చేయలేదన్నారు దివ్యవాణి. ఒక కళాకారుడు స్థాపించిన పార్టీలో ఇప్పుడు కనీసం మాట్లాడే అవకాశం లేకుండా చేశారన్నారు దివ్యవాణి.
@JaiTDPలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నాను..
— DivyaVani (@DivyaVaniTDP) May 31, 2022
ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏
Comments
Please login to add a commentAdd a comment