divyavani
-
Telangana: కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
-
తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. ఈ విజయం పట్ల ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్యవాణి స్పందించారు. ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఇండియా వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. -
కోవర్టులు కంట్రోల్లో ఉండకపోతే ఇక నేను ఊరుకోను: దివ్యవాణి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై దివ్యవాణి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని అన్నారు. ఈ మేరకు దివ్యవాణి మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. టీడీ జనార్దన్ కోవర్టులు కంట్రోల్లో ఉండకపోతే ఇక నేను ఊరుకోను. అనిత, గ్రీష్మ నాపై మాట్లాడేముందు ఆలోచించుకోండి. అనవసరంగా మాట్లాడటం తగదు. పట్టాభి విమర్శలు చేసే ముందు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో. వల్లభనేని వంశీ గతంలో ఎందుకు బాధ పడ్డారో నాకు ఇప్పుడు తెలుస్తోంది. టీడీపీలో కొందరు మహిళలను ట్రోల్ చెయ్యడమే పనిగా ఉన్నారని' దివ్యవాణి మండిపడ్డారు. చదవండి: (కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్‌లను అభినందించిన సీఎం జగన్) -
టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు
-
Divyavani: టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: టీడీపీ నుంచి బయటకొచ్చాక పనికిమాలిన చెత్త వెధవలు నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అహర్నిశలు పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు లేకనే బయటకు వచ్చేశానన్నారు. ఈ మేరకు దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీకోసం నిజాయితీగా పనిచేసిన నాకు అన్యాయం చేశారు. టీడీ జనార్దన్ కోవర్టులతో తప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీకి ఏ పరిస్థితి వచ్చిందో ఏపీలో అదే పరిస్థితి వస్తుంది. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టే అందరి ఆధారాలు బయటపెడుతున్నాని' దివ్యవాణి అన్నారు. చదవండి: (CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) -
నాకు నష్టం కలిగించే పనిలో టీడీపీ ఉంది: దివ్యవాణి
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీపై మాజీ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే దారుణంగా చూస్తారని చెప్పిన ఆమె.. అన్యాయాన్ని వివరించినందుకు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. టీడీపీ తీరుపై ఆ పార్టీ మాజీ నేత దివ్యవాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకి నష్టం కలిగించేలా టీడీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోందని ఆమె అన్నారు. టీడీపీలో మహిళలకు జరిగే అన్యాయాన్ని వివరించా. నా ఆవేదనను వివరిస్తే.. నాకు నష్టం కలిగించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే టీడీపీలో దారుణంగా చూస్తారు. టీడీపీలో కింది వాళ్ల వ్యవహారాలన్నీ బయటపెడతా. గ్రీష్మ(టీడీపీ నేత కావలి గ్రీష్మ) ఎవరు నాపై మాట్లాడటానికి, గ్రీష్మలా నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయినా చంద్రబాబు కోసం కష్టపడి పని చేశాను. అయినా ఇవాళ నాపై కుట్రలు చేస్తున్నారు అంటూ దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. -
నేను చెప్పే నిజాలు వేసే ధైర్యం ఏబీఎన్, టీవీ5 కి ఉందా?
-
ఏబీఎన్, టీవీ5లకు నేను చెప్పే నిజాలు చూపించే ధైర్యముందా: దివ్యవాణి
నటి దివ్యవాణి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దివ్యవాణి టీడీపీలో జరుగుతున్న విషయాలపై మరోసారి స్పందించారు. దివ్యవాణి మంగళవారం మాట్లాడుతూ.. ‘‘టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయటపెడతాను. ఇప్పటికీ ఎంతో మంది మహిళలు టీడీపీలో ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ విశ్లేషకుల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీలో నాకు పని చేసే స్వేచ్ఛ లేదు. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. నేను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్, టీవీ5కి ఉందా..?. టీడీపీలో ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడతారు’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్ -
అప్పుడేమో నేనే ఫైర్ బ్రాండ్: దివ్యవాణి
-
టీడీపీలో మహిళలకు గౌరవం లేదు
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడతూర్పు): ‘నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. అచ్చెన్నాయుడి మాదిరిగా పార్టీ లేదు బొక్కా లేదు అనలేదు. సాధినేని యామినిలా విమర్శలు చేయలేదు. నారీభేరీకి డబ్బులు తీసుకుని మేకప్ వేసుకుని కూర్చోలేదు. ఇప్పుడు నన్ను తప్పుబడుతున్న వాళ్లు అచ్చెన్నని ఏం శిక్షించారు. టీడీ జనార్దన్‌ను ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బందులు పెట్టారు. ఏడాది కాలంగా నన్ను అవమానించి నరకం చూపించారు. గౌరవం లేనిచోట ఉండలేను. అందుకే టీడీపీకి రాజీనామా చేసి ఆ లేఖను పార్టీకి పంపుతున్నా..’ అని సినీనటి దివ్యవాణి చెప్పారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం గురువారం విజయవాడలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీలో కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని చాలామంది చెప్పినా వినలేదని, వారు చెప్పినట్టే పార్టీలో తనకు అన్యాయం జరిగిందని కన్నీరు పెట్టుకున్నారు. ఏడాది కాలంగా తనకు ప్రాధాన్యత లేకపోవడానికి దారితీసిన కారణాలను వివరించిన దివ్యవాణి టీడీపీ నేతల తీరుపై సంచలన కామెంట్లు చేశారు. దివ్యవాణి ఇంకా ఏమన్నారంటే.. పార్టీ కోసం బాలకృష్ణకంటే నేనే ఎక్కువ పనిచేశా మత మార్పిళ్లపై చంద్రబాబు చేసిన కామెంట్ల వల్ల క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాను. నిజం మాట్లాడినందుకు నన్ను టార్గెట్ చేశారు. చంద్రబాబు సతీమణిని విమర్శిస్తే ఆయనకంటే ముందు నేనే కౌంటర్ ఇచ్చాను. ఈ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ పార్టీలో జరుగుతున్నవి చెబితే టీడీపీ నేతలే నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నన్ను విసుక్కున్నా నేనేం బాధపడలేదు. చంద్రబాబు చుట్టూ దొంగలున్నారు. వాళ్లంతా చంద్రబాబుతో మాట్లాడనివ్వలేదు. చంద్రబాబు పీఏ రాజగోపాల్ చాలాసార్లు అవమానించాడు. పార్టీలో ఏం జరుగుతున్నదీ లోకేశ్‌కు చెబితే ఆయన టీడీ జనార్దన్‌కు చెప్పమన్నారు. చంద్రబాబుకు కళ్లు, ముక్కు, చెవులు అంతా తానై వ్యవహరించే జనార్దన్ నన్ను చాలాసార్లు అవమానించాడు. జనార్దన్‌ను ప్రశ్నించినందుకు నరకం చూపించారు. పార్టీకోసం బాలకృష్ణ కంటే నేనే ఎక్కువగా పనిచేశాను. బాలకృష్ణ ఏనాడైనా అమరావతిలో బిడ్డల దగ్గరకు వచ్చారా? కరోనా టైమ్‌లో నేను నా కుటుంబాన్ని వదిలి అమరావతికి వచ్చి పార్టీకోసం పనిచేశాను. మహానాడులో ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం తీర్మానం చేయలేదు. అన్ని జిల్లాల్లో ఏం జరిగిందో కూడా తెలుసుకోలేదు. మహానాడులో గ్రీష్మ అలా మగాళ్ల దగ్గర తొడగొట్టడం మంచి పద్ధతి కాదు. అనితకు డబ్బులిచ్చి మేకప్ వేయించి నారీభేరీ నిర్వహించారు. ప్రెస్‌మీట్ పెట్టడానికి నలుగురి దగ్గరకి తిప్పేవారు. నన్ను కుక్కపిల్లలా ఆడుకున్నారు. నేను ఇచ్చిన సమాచారంతో వేరే వారితో ప్రెస్‌మీట్ పెట్టించారు. నాలాగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. టీడీపీలో ఆడవాళ్లకు అవకాశాలు రావాలంటే ఆ నలుగురి చుట్టూ తిరగాలి. ఆ నలుగురికి ఏం కావాలంటే అది చేస్తేనే పదవులు. అందుకే టీడీపీ నుంచి జయసుధ, జయప్రద బాధతో వెళ్లిపోయారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని నన్నపనేని రాజకుమారి నాకు స్వయంగా ఫోన్‌చేసి ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించాను. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. నాకు ఇలాంటిరోజు వస్తుందని భావించలేదు. నా బాధను మీడియాతో పంచుకోవడమే నేను చేసిన తప్పా? కొందరు ఇడియట్స్ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా అన్నారు.. పిచ్చిదానిలా టీడీపీలో చేరతావా? వైఎస్సార్సీపీలో అయితే బాగుంటుంది. వైఎస్సార్సీపీలో నమ్మినవారికి ద్రోహం జరగదని ఎంతోమంది శ్రేయోభిలాషులు చెప్పినా వినకుండా టీడీపీలో చేరాను. మూడున్నరేళ్లుగా టీడీపీకి సేవలు చేశాను. టీడీపీలో ఉన్నందుకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా పోయాయి. నా నోటికాడ భోజనం పోయింది. అది కూడా నేను ఎవరికీ చెప్పుకోలేదు. నా సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పార్టీకోసం పనిచేశాను. చంద్రబాబు కోసం మోదీపైన విమర్శలు చేశాను. చదవండి: చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా?: దివ్యవాణి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బతకాలంటే ధైర్యంగా బయటకు రావాలి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బతకాలంటే తనలాంటి వారు ధైర్యంగా బయటకు వచ్చి టీడీపీలో జరుగుతున్నది ఏమిటో నిజాలు చెప్పాలి. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొడుక్కి ఎన్టీఆర్ పేరు పెట్టారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్సీపీలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌పై అభిమానంతో మాట్లాడుతుంటారు. అటువంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో పాములు పుట్ట పెట్టాయి. వాటిని పిల్లల దశలోనే చంపకపోతే అందర్నీ కాటేస్తాయనే ఆవేదనతో గుండె పగిలి ఈ నిర్ణయం తీసుకున్నా.. అని దివ్యవాణి చెప్పారు. తాను ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేనని ఆమె పేర్కొన్నారు. -
ఇలాంటి ఒక రోజు వస్తుందని.. ఎప్పుడూ భావించలేదు: దివ్యవాణి
-
చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా?: దివ్యవాణి
సాక్షి, విజయవాడ: టీడీపీ మాజీ నాయకురాలు దివ్యవాణి.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివ్యవాణి విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా దివ్యవాణి మాట్లాడుతూ.. టీడీపీలో గతేడాదిగా నాకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. కొందరు మహిళా నేతలు నాకు ఫోన్ చేసి తిట్టారు. కొందరు బుద్ధిలేని వారు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందింది అందుకే రాజీనామా చేయట్లేదని అంటున్నారు. నేను ఎవరికీ ఎప్పుడూ భజన చేయలేదు.. చేయను. పార్టీలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా సమస్యను లోకేశ్ దృష్టికి తీసుకెళితే.. జనార్ధన్‌కు చెప్పమన్నారు. కొందరు ఇడియట్స్ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..? ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలి. నేను చెప్పాల్సిన పాయింట్లు వేరే వాళ్లతో చెప్పించారు. మీటింగుల్లో ఎవరితో మాట్లాడించాలో ముందు అనుకుని మాట్లాడిస్తారు. టీడీ జనార్దన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా..? పార్టీలో నా స్థానం ఏంటో తెలియని పరిస్థితి ఉంది’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇది కూడా చదవండి: ‘చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు’ -
టీడీపీ నన్ను మోసం చేసింది: దివ్య వాణి
-
నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసలు స్వరూపాన్ని బయటపెడుతూ.. ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు నటి దివ్యవాణి. టీడీపీలో జరిగిన అవమానాలను ఏకరువు పెట్టిన ఆమె.. పార్టీ కోసం ఎంతో చేసినా తీవ్రంగా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విటర్లో రాజీనామా ప్రకటన చేశారామె. కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు దివ్యవాణి. ‘‘నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటారేమో. ఒక అర్టిస్టుగా పార్టీ కోసం వస్తే అన్ని రకాలుగా అణిచివేశారు. ఒక కళాకారుడు(స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ..) పెట్టిన పార్టీలో కళాకారులకు చోటు లేదు. మురళీమోహన్‌కు వ్యాపారాలు వేరే ఉన్నాయి కాబట్టి కొనసాగుతున్నారు. అధికారం లేని అధికార ప్రతినిధిగా నన్ను మిగిల్చారు. మూడేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే.. కనీసం గుర్తింపు కూడా లేకపోయిందని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిస్టుగా ఉన్న తాను టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఫైర్ బ్రాండ్‌గా ఎంతో సమయం వెచ్చించానని అయినా.. పార్టీ అధిష్టానం తనను మహానాడు వేదికగా అవమానించి పంపించిందని దివ్యవాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ లైన్ అంటే ఏంటో తెలుసుకుని ఎంతో కష్టపడ్డానని, అయినా కనీస న్యాయం ఏనాడు చేయలేదన్నారు దివ్యవాణి. ఒక కళాకారుడు స్థాపించిన పార్టీలో ఇప్పుడు కనీసం మాట్లాడే అవకాశం లేకుండా చేశారన్నారు దివ్యవాణి. @JaiTDPలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నాను.. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏 — DivyaVani (@DivyaVaniTDP) May 31, 2022 -
దివ్యవాణికి అలీ కౌంటర్..!
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణికి కౌంటర్ వేశారు. ప్యాకేజీ తీసుకుని తాను వైఎస్సార్సీపీలో చేరినట్టు వ్యాఖ్యానించిన దివ్యవాణిపై ఆయన మండిపడ్డారు. ‘ప్యాకేజీ తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మీరు చూశారా.. లేక సెల్ఫీ తీశారా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘టీడీపీలో చేరినందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్తారా’ అని ఎద్దేవా చేశారు. కాగా, పెళ్లిపుస్తకం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్యవాణి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. -
దివ్యవాణి క్రైస్తవ టీవీ చానల్ ప్రారంభం
హైదరాబాద్: దివ్యవాణి క్యా థలిక్ క్రైస్తవ చానల్ బుధవారం ప్రారంభమైంది. బుధవారం సికింద్రాబాద్ సెయిం ట్ మేరీస్ స్కూ ల్ ఆవరణలో చానల్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాటికన్ ప్రతినిధి ఆర్చ్ బిషప్ సాల్వతోరే ఫెన్నాఖియో ముఖ్య అతిథిగా హాజరై చానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాథలిక్‌ల ఆధ్వర్యంలో తొలిసారిగా తెలుగులో టీవీ చానల్ ప్రారంభించడం గర్వించదగ్గ విషయమన్నారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దివ్యవాణి చానల్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్టణం ఆర్చ్ బిషప్ మల్లవరకు ప్రకాశ్, టీవీ చానల్ సీఈవో ఫాదర్ ఉడుముల బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.