దివ్యవాణికి అలీ కౌంటర్‌..! | YSR Congress Party Leader Ali SetairsOn Actor Divyavani | Sakshi
Sakshi News home page

దివ్యవాణికి అలీ కౌంటర్‌..!

Published Tue, Apr 2 2019 3:46 PM | Last Updated on Tue, Apr 2 2019 4:06 PM

YSR Congress Party Leader Ali SetairsOn Actor Divyavani - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేటప్పుడు మీరు చూశారా.. లేక సెల్ఫీ తీశారా

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అలీ సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణికి కౌంటర్‌ వేశారు. ప్యాకేజీ తీసుకుని తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్టు వ్యాఖ్యానించిన దివ్యవాణిపై ఆయన మండిపడ్డారు. ‘ప్యాకేజీ తీసుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేటప్పుడు మీరు చూశారా.. లేక సెల్ఫీ తీశారా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘టీడీపీలో చేరినందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్తారా’ అని ఎద్దేవా చేశారు. కాగా, పెళ్లిపుస్తకం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్యవాణి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement