
నటి దివ్యవాణి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దివ్యవాణి టీడీపీలో జరుగుతున్న విషయాలపై మరోసారి స్పందించారు.
దివ్యవాణి మంగళవారం మాట్లాడుతూ.. ‘‘టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త‍్వరలో బయటపెడతాను. ఇప్పటికీ ఎంతో మంది మహిళలు టీడీపీలో ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ విశ్లేషకుల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీలో నాకు పని చేసే స్వేచ్ఛ లేదు. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. నేను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్, టీవీ5కి ఉందా..?. టీడీపీలో ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడతారు’’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment