TV5 team
-
ఆ 5 కోట్లు ఎవరెవరు పంచుకుంటారంటే..!
-
టీవీ5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వీడియో విడుదల చేశారు. మీడియా ముసుగులో తమని ఇబ్బందలకు గురిచేస్తున్నారని తన సతీమణితో పాటు ఆరోపించారు. రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ టీవీ5 మూర్తి, టీమ్ తమను డిమాండ్ చేసిందని తెలిపారు. అందుకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ ఆడియోను కూడా పంచుకున్నారు. అంత డబ్బు ఇవ్వలేము, ఈ మాటలే మా మరణ వాగ్మూలం అంటూ.. టీవీ5 మూర్తి, ఆయన టీమ్ గురించి వేణుస్వామి,వీణా శ్రీవాణి సంచలన కామెంట్లు చేశారు.నేను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు: వేణుస్వామి'టీవీ5 జర్నలిస్ట్ మూర్తి ఒకప్పుడు మహాటివీలో పనిచేసేవారు. అప్పుడు నాపై దాడి చేసేందుకు ఆయన ప్రయత్నించాడు. నన్ను నాశనం చేయడానికి ఆ సమయంలోనే చాలా ప్రయత్నాలు చేశాడు. మూర్తి డిమాండ్ చేసిన డబ్బు నేను ఇవ్వలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఇప్పుడు డబ్బు కోసం మూర్తి, ఆయన టీమ్ నన్ను ఇబ్బంది పెడుతుంది. ఒక పథకం ప్రకారం టీవీ5లో నా గురించి డిబెట్లు ఏర్పాటు చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. ఎంతోమంది కష్టాలను తొలగించిన నాకు చివరకు ఆత్మహత్య చేసుకునే స్థితికి మూర్తి వల్ల వెళ్లడం జరిగింది. వారు పెడుతున్న టార్చర్ భరించలేకున్నాను.' అంటూ వేణుస్వామి తెలిపారు. ఆపై మూర్తి అనుచరుడు జర్నిలిస్ట్ (అమర్) ఫోన్ కాల్ను తన ఇన్స్టాలో ఆయన షేర్ చేశారు. అందులో వారు రూ. 5 కోట్లు అడుగుతున్నట్లు చర్చ జరిగింది. ఇలా వచ్చే డబ్బును ఎవరెవరు..? పంచుకుంటారో కూడా చెప్పుకొచ్చారు. ఛానల్ అధినేత బీఆర్ నాయుడు నుంచి ఆ సంస్థలో కీలక స్థానల్లో పనిచేస్తున్న ఉద్యోగల వరకు ఎలా పంపకాలు జరుగుతాయో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు.మమ్మల్ని వాళ్లు తప్పకుండా చంపేస్తారు: వీణా శ్రీవాణివేణుస్వామి సతీమణి వీణా శ్రీవాణి కూడా టీవీ5 సంస్థతో పాటు జర్నలిస్ట్ మూర్తి గురించి ఇలా చెప్పుకొచ్చారు. మమ్మల్ని రూ. 5 కోట్లు అడుగుతున్నారు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం. నా బంగారంతో నా కూతురు బంగారం అమ్మినా అంత డబ్బు రాదు. ఇచ్చే వరకు మమ్మల్ని వదిలేలా లేరు. దీంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాం. కానీ, మేము అలా చేస్తే దానిని కూడా వాళ్లు తప్పుగానే క్రియేట్ చేస్తారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్పచారాన్ని తట్టుకోలేక చనిపోయారని మళ్లీ వాల్లే వార్తలు ఇస్తారు. మా చావు అలా వృధా ఉండకూడదనే ఇలా మీ ముందుకు వచ్చాం. వాళ్ల అసలు రూపం ఎంటో ఈ ప్రపంచానికి తెలపాలని నిర్ణయించుకున్నాం. ఈ వీడియో బయటకు వచ్చాక మాకు ఎలాగూ ప్రమాదం పొంచి ఉంటుంది. తప్పకుండా మమ్మల్ని వారు చంపేస్తారు. ఈలోపు వాళ్లు (టీవీ5 మూర్తి, టీమ్) ఎలాంటి వారో ఇలా ముందే ఈ ప్రపంచానికి తెలుపుతున్నాం. వారు అడిగే రూ. 5 కోట్లు ఇవ్వలేక చనిపోతే దానికి బాధ్యలు ఎవరు..? టీవీ5 మీడియా సంస్థలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న రాంబాబు, ప్రేమ ఇద్దరికీ కూడా వాటాలు ఉన్నాయని తెలిసి నేను షాక్ అయ్యాను. మేము అంత డబ్బు ఇవ్వలేం. దీనిని మరణ వాగ్మూలంగా తీసుకుంటారని ఆశిస్తూన్నాం. ఈ ఒక్క ఆడియోనే కాదు .. మా వద్ద ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరికొన్ని రోజులు మమ్మల్ని బతకనిస్తే వాళ్ల గురించి మరికొన్ని వీడియోలు ఈ ప్రపంచానికి చూపిస్తాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నిలిస్టులు సపోర్ట్ చేస్తారో..? బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేస్తాయో..? చదువుకున్న వారు సపోర్ట్ చేస్తారో..? పోలీసులు,లాయర్లు సపోర్ట్ చేస్తారో..? మీ ఇష్టం. మాకు ఎవరైన అండగా నిలబడుతారని ఆశిస్తున్నాం. మా మాటలను సుమోటాగా తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఒక జ్యోతిష్యం చెప్పుకునే మాలాంటి వారినే రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటే... మిగిలిన వారి వద్ద ఎంత మొత్తంలో తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఇలా ఇబ్బంది పెట్టి ఎంతమందిని చంపేస్తున్నారు..? మేము చనిపోయినా పర్వాలేదు.. ఈ వీడియో తర్వాత మేము బతికి ఉంటే మరోక వీడియో కూడా బయట పెడుతాం. లేదంటే ఇదే మా చివరి వీడియో కావచ్చు.' అని వేణుస్వామి తన ఆవేదన వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
ఇవిరా మీ బ్రతుకులు ... ఏకిపారేసిన విజయ్ సాయి రెడ్డి
-
నన్ను చంపేందుకు బీఆర్ నాయుడు ప్లాన్ చేస్తున్నాడు: పోసాని
సాక్షి, హైదరాబాద్: ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో బీఆర్నాయుడు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. చంపించడం అనేది బీఆర్ నాయుడికి చాలా చిన్న పని అని అన్నారు. కాగా, పోసాని కృష్ణమురళి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే అంతు చూస్తామని నన్ను బెదిరించారు. బీఆర్ నాయుడికి దివంగత నేత వైఎస్సార్ భిక్ష పెట్టారు. మీడియా ముసుగులో బీఆర్ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. ఆడవాళ్లపై టీవీ-5లో నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు లేరా? వారితో ఇలానే మాట్లాడుతారా?. ఇప్పటికైనా బీఆర్ నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాంబశివరావు భాష ఏంటి? ప్రశ్నించినందుకు నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు. ఇవ్వాలా? లేదా రేపో నన్న చంపొచ్చు. బీఆర్ నాయుడు టీవీ5 పెట్టినప్పుడు ఓ వ్యక్తి దగ్గర రూ.30కోట్లు అప్పుగా తీసుకుని ఇప్పటికీ ఇవ్వలేదు. మార్వాడీ వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకుని చెదిరింపులకు పాల్పడ్డారు. మీడియాను అడ్రస్ చేయాలంటేనే నాకు భయమేస్తోంది. సినీ పరిశ్రమలో ఉన్న మహిళలను అవమానించినందుకు సాంబశివరావు ఇంట్లో తనను అడగరా?. తెలంగాణ ఆడబిడ్డలను తిట్టడానికే బీఆర్ నాయుడు.. సాంబశివరావును టీవీ-5లో పెట్టుకున్నాడు. సాంబశివరావు వాడుతున్న భాషను ఏ ఛానెల్ అయినా వాడుతుందా?. సాంబశివరావు వెనుక చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఉన్నారు. నన్ను ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడినా నేను మాట్లాడటం ఆపను. సీఎం జగన్ గురించి ప్రజలకు తెలుసు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో నాతో వస్తే చూపిస్తాను. స్కూల్స్, ఉద్యోగులను, ఆసుపత్రులకు వెళ్లి చూపిస్తాను. నవరత్నాల పేరుతో సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమం ప్రజలందరికీ తెలుసు. సీఎం జగన్ను తిట్టడానికి ప్రతిపక్షాలకు కారణాలు లేవు. కుల, మతాలతో సంబంధం లేకుండా సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారు. కమ్మ, కాపు అనే తేడా లేకుండా పేదలకు సంక్షేమం అందిస్తున్నారు. ఏపీలో ఇప్పుడున్న నాయకుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే మంచి పాలన అందిస్తున్నారన్నది నా అభిపాయ్రం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు ముట్టిన 118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివి: విజయసాయిరెడ్డి -
చంద్రబాబు, రామోజీపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. టీడీపీ హయంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడికి మాత్రమే లబ్ధి జరుతుందన్నారు. కాగా, కొడాలి నాని ఆదివారం గుడివాడలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారికి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం వద్ధని కేసులే వేసిన ఘనత చంద్రబాబుది. రామోజీరావు, లోకేష్, పవన్ కల్యాణ్ తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివించారు. పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. టీడీపీ అధికారంలోకి వస్తే రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడికి మాత్రమే లబ్ధి జరుగుతుంది. వీళ్లు రాష్ట్రంలో పైరవీలు చేసే దిశగా ముందుకెళ్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నవరత్నాల్లో భాగంగా నేడు రూ.2,750 పెన్షన్ అందిస్తున్నం అని స్పష్టం చేశారు. -
నేను చెప్పే నిజాలు వేసే ధైర్యం ఏబీఎన్, టీవీ5 కి ఉందా?
-
ఏబీఎన్, టీవీ5లకు నేను చెప్పే నిజాలు చూపించే ధైర్యముందా: దివ్యవాణి
నటి దివ్యవాణి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దివ్యవాణి టీడీపీలో జరుగుతున్న విషయాలపై మరోసారి స్పందించారు. దివ్యవాణి మంగళవారం మాట్లాడుతూ.. ‘‘టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయటపెడతాను. ఇప్పటికీ ఎంతో మంది మహిళలు టీడీపీలో ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ విశ్లేషకుల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. టీడీపీలో నాకు పని చేసే స్వేచ్ఛ లేదు. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. నేను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్, టీవీ5కి ఉందా..?. టీడీపీలో ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడతారు’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్ -
తప్పుడు కథనాలు రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది: కొడాలి నాని
-
మీడియా క్రికెట్ విజేత టీవీ5
సాక్షి, హైదరాబాద్: క్రియేటివ్ ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా క్రికెట్ లీగ్లో టీవీ5 జట్టు విజేతగా నిలిచింది. బీఎంఆర్ గ్రౌండ్స్లో గురువారం .. ఏబీఎన్ జట్టుతో జరిగిన ఫైనల్లో టీవీ5 జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీవీ5 జట్టు 19.1 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. నరేంద్ర 45 పరులతో రాణించగా, ఏబీఎన్ బౌలర్ ఆదిత్య (5/26) ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఏబీఎన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వామి (47) రాణించాడు. టీవీ5 బ్యాట్స్మన్ నరేంద్రకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.