క్రియేటివ్ ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా క్రికెట్ లీగ్‌లో టీవీ5 జట్టు విజేతగా నిలిచింది. బీఎంఆర్ గ్రౌండ్స్‌లో గురువారం .. ఏబీఎన్ జట్టుతో జరిగిన ఫైనల్లో టీవీ5 జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సాక్షి, హైదరాబాద్: క్రియేటివ్ ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా క్రికెట్ లీగ్‌లో టీవీ5 జట్టు విజేతగా నిలిచింది. బీఎంఆర్ గ్రౌండ్స్‌లో గురువారం .. ఏబీఎన్ జట్టుతో జరిగిన ఫైనల్లో టీవీ5 జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీవీ5 జట్టు 19.1 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. నరేంద్ర 45 పరులతో రాణించగా, ఏబీఎన్ బౌలర్ ఆదిత్య (5/26) ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఏబీఎన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వామి (47) రాణించాడు. టీవీ5 బ్యాట్స్‌మన్ నరేంద్రకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.