టీవీ5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు | Venu Swamy And Veena Srivani Sensational Comments On TV5 Journalist Murthy, More Details About This Issue | Sakshi
Sakshi News home page

టీవీ5 మూర్తి డిమాండ్‌ తీర్చలేం.. చావు ఒక్కటే దిక్కు: వేణుస్వామి దంపతులు

Published Mon, Aug 19 2024 7:26 PM | Last Updated on Mon, Aug 19 2024 7:51 PM

Venu Swamy And Veena Srivani Comments On TV5 Journalist Murthy

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వీడియో విడుదల చేశారు. మీడియా ముసుగులో తమని ఇబ్బందలకు గురిచేస్తున్నారని తన సతీమణితో పాటు ఆరోపించారు. రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ టీవీ5 మూర్తి, టీమ్‌ తమను డిమాండ్‌ చేసిందని తెలిపారు. అందుకు సంబంధించిన ఒక ఫోన్‌ కాల్‌ ఆడియోను కూడా పంచుకున్నారు. అంత డబ్బు ఇవ్వలేము, ఈ మాటలే మా మరణ వాగ్మూలం అంటూ.. టీవీ5 మూర్తి, ఆయన టీమ్‌ గురించి వేణుస్వామి,వీణా శ్రీవాణి సంచలన కామెంట్లు చేశారు.

నేను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు: వేణుస్వామి
'టీవీ5 జర్నలిస్ట్‌ మూర్తి ఒకప్పుడు మహాటివీలో పనిచేసేవారు. అప్పుడు నాపై దాడి చేసేందుకు ఆయన ప్రయత్నించాడు. నన్ను నాశనం చేయడానికి ఆ సమయంలోనే చాలా ప్రయత్నాలు చేశాడు. మూర్తి డిమాండ్‌ చేసిన డబ్బు నేను ఇవ్వలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఇప్పుడు డబ్బు కోసం మూర్తి, ఆయన టీమ్‌ నన్ను ఇబ్బంది పెడుతుంది. ఒక పథకం ప్రకారం టీవీ5లో నా గురించి డిబెట్లు ఏర్పాటు చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. 

ఎంతోమంది కష్టాలను తొలగించిన నాకు చివరకు ఆత్మహత్య చేసుకునే స్థితికి మూర్తి వల్ల వెళ్లడం జరిగింది. వారు పెడుతున్న టార్చర్‌ భరించలేకున్నాను.' అంటూ వేణుస్వామి తెలిపారు. ఆపై మూర్తి అనుచరుడు  జర్నిలిస్ట్‌ (అమర్‌) ఫోన్‌ కాల్‌ను తన ఇన్‌స్టాలో ఆయన షేర్‌ చేశారు. అందులో వారు రూ. 5 కోట్లు అడుగుతున్నట్లు చర్చ జరిగింది. ఇలా వచ్చే డబ్బును ఎవరెవరు..? పంచుకుంటారో కూడా చెప్పుకొచ్చారు. ఛానల్‌ అధినేత బీఆర్‌ నాయుడు నుంచి ఆ సంస్థలో కీలక స్థానల్లో పనిచేస్తున్న ఉద్యోగల వరకు ఎలా పంపకాలు జరుగుతాయో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు.

మమ్మల్ని వాళ్లు తప్పకుండా చంపేస్తారు: వీణా శ్రీవాణి
వేణుస్వామి సతీమణి వీణా శ్రీవాణి కూడా టీవీ5 సంస్థతో పాటు జర్నలిస్ట్‌ మూర్తి గురించి ఇలా చెప్పుకొచ్చారు. మమ్మల్ని రూ. 5 కోట్లు అడుగుతున్నారు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం. నా బంగారంతో నా కూతురు బంగారం అమ్మినా అంత డబ్బు రాదు. ఇచ్చే వరకు మమ్మల్ని వదిలేలా లేరు. దీంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాం. కానీ, మేము అలా చేస్తే దానిని కూడా వాళ్లు తప్పుగానే క్రియేట్‌ చేస్తారు. సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్పచారాన్ని తట్టుకోలేక చనిపోయారని మళ్లీ వాల్లే వార్తలు ఇస్తారు. మా చావు అలా వృధా ఉండకూడదనే ఇలా మీ ముందుకు వచ్చాం. వాళ్ల అసలు రూపం ఎంటో ఈ ప్రపంచానికి తెలపాలని నిర్ణయించుకున్నాం. 

ఈ వీడియో బయటకు వచ్చాక మాకు ఎలాగూ ప్రమాదం పొంచి ఉంటుంది. తప్పకుండా మమ్మల్ని వారు చంపేస్తారు. ఈలోపు వాళ్లు (టీవీ5 మూర్తి, టీమ్‌) ఎలాంటి వారో ఇలా ముందే ఈ ప్రపంచానికి తెలుపుతున్నాం. వారు అడిగే రూ. 5 కోట్లు ఇవ్వలేక చనిపోతే దానికి బాధ్యలు ఎవరు..? టీవీ5 మీడియా సంస్థలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న రాంబాబు, ప్రేమ ఇద్దరికీ కూడా వాటాలు ఉన్నాయని తెలిసి నేను షాక్ అయ్యాను. మేము అంత డబ్బు ఇవ్వలేం. దీనిని మరణ వాగ్మూలంగా తీసుకుంటారని ఆశిస్తూన్నాం. ఈ ఒక్క ఆడియోనే కాదు .. మా వద్ద ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరికొన్ని రోజులు మమ్మల్ని బతకనిస్తే వాళ్ల గురించి మరికొన్ని వీడియోలు ఈ ప్రపంచానికి చూపిస్తాం. 

ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నిలిస్టులు సపోర్ట్‌ చేస్తారో..? బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్‌ చేస్తాయో..? చదువుకున్న వారు సపోర్ట్‌ చేస్తారో..? పోలీసులు,లాయర్లు సపోర్ట్‌ చేస్తారో..? మీ ఇష్టం. మాకు ఎవరైన అండగా నిలబడుతారని ఆశిస్తున్నాం. మా మాటలను సుమోటాగా తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఒక జ్యోతిష్యం చెప్పుకునే మాలాంటి వారినే రూ. 5 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారంటే... మిగిలిన వారి వద్ద ఎంత మొత్తంలో తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఇలా ఇబ్బంది పెట్టి ఎంతమందిని చంపేస్తున్నారు..? మేము చనిపోయినా పర్వాలేదు.. ఈ వీడియో తర్వాత మేము బతికి ఉంటే మరోక వీడియో కూడా బయట పెడుతాం. లేదంటే ఇదే మా చివరి వీడియో కావచ్చు.' అని వేణుస్వామి తన ఆవేదన వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement