
సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. టీడీపీ హయంలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడికి మాత్రమే లబ్ధి జరుతుందన్నారు.
కాగా, కొడాలి నాని ఆదివారం గుడివాడలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారికి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం వద్ధని కేసులే వేసిన ఘనత చంద్రబాబుది. రామోజీరావు, లోకేష్, పవన్ కల్యాణ్ తమ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చదివించారు. పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. టీడీపీ అధికారంలోకి వస్తే రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడికి మాత్రమే లబ్ధి జరుగుతుంది. వీళ్లు రాష్ట్రంలో పైరవీలు చేసే దిశగా ముందుకెళ్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నవరత్నాల్లో భాగంగా నేడు రూ.2,750 పెన్షన్ అందిస్తున్నం అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment