
సాక్షి, గుంటూరు/విజయవాడ: చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5నాయుడు.. నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. 'సీఎం జగన్ ప్రభుత్వంపై ఉదయం నుంచి రాత్రి వరకు దుష్ప్రచారం చేయడమే వీరి పని. సీఎం జగన్‌ను దించాలని ఆ నలుగురు కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవచ్చని వీరి ఆలోచన. ఈ ముఠాకి రామోజీరావు గురువు. ఈ 420లకి ఎవరూ భయపడరు. దుష్టచతుష్టయాన్ని పాతాళంలో పాతిపెట్టేందుకు సిద్ధంగా ఉండాలి.
చదవండి: (ఆర్ యూ డెఫ్ ఇయర్.. ఆర్ యూ బ్లైండ్?.. ఎల్లో మీడియాపై తమ్మినేని ఫైర్)
ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే విమర్శలు చేస్తున్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా?. ఆరోపణలు చేస్తున్న వారి పిల్లలు ఏ మీడియంలో చదివారు?. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పెన్షన్లు పెంచుతూ పోతున్నారు. పేద పిల్లల కోసం తండ్రి స్థాయిలో సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా?. 95 శాతం హామీలను అమలుచేసిన వ్యక్తి సీఎం జగన్. సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
చదవండి: (జగన్ అంటే తగ్గేదేలే.. సోనియాకే భయపడలే.. దుష్టచతుష్టయానికి భయపడతారా?)
దేశంలో చంద్రబాబు లాంటి చవట దద్దమ్మ ఎవరూ లేరు. పుట్టిపెరిగిన చంద్రగిరిలో చంద్రబాబు ఎప్పుడైనా గెలిచాడా?. దుష్టచతుష్టయం పర్మినెంట్‌గా పిచ్చాసుపత్రుల్లో చేరబోతున్నారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడు. గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తే.. తల్లి పాత్ర పోతుందా?. తల్లిని మించిన హోదా ఉంటుందా?. లోకేష్ ఫారెన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా వెళ్లారు?. ఓట్లకోసం భార్యను బజారుకీడ్చిన 420 చంద్రబాబు. 2024 చంద్రబాబుకు రాజకీయ సమాధే' అని మాజీ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment