
సాక్షి, కృష్ణా : చంద్రబాబు నిర్మాతగా రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు దర్శకత్వంలో రోజూ మనకు మహాద్భుతమైన సినిమాను చూపిస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. దళితులకు ద్రోహం జరుగుతుందని టీవీ చానెల్స్ డిబేట్‌లు పెడుతున్నాయన్నారు. ఎందకు పనికిరాని కొంతమంది టీడీపీ నేతలు టీవీల ముందుకు వచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. నిజానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారు. (చదవండి : పల్లకి మోసే పనులు మాకు.. పల్లకిలో కూర్చునేది మీరు)
అంతేగాక చంద్రబాబు ఈ దాడులపై దుష్ర్పచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లాని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కోర్టుల్లో కేసులు వేసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. త్వరలోనే మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ.60వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నాని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment