Kodali Nani Comments On Chandrababu Talking About Local Body Election Results - Sakshi
Sakshi News home page

'చెత్త డిబేట్లు.. సొల్లు కబుర్లతో శునకానందం'

Published Fri, Feb 19 2021 5:47 PM | Last Updated on Fri, Feb 19 2021 8:43 PM

Kodali Nani Fires On Chandrababu About Local Body Election Results - Sakshi

సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో టీడీపీ అండ్‌ కోకు బట్టలు ఊడిపోయాయని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. 'పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు అఖండమైన తీర్పు ఇచ్చారు. ప్రాంతాలు.. పార్టీలు.. వర్గాలు.. కులాలు చూడకుండా సీఎం వైఎస్ జగన్ సంక్షేమాన్ని అందించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో మమ్మల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. జనసేన, టీడీపీ లోపాయికారీ ఒప్పందం వల్ల వారికి ఫలితం లేకుండా పోయింది.

స్థానిక  ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారు. అన్ని చోట్ల అభ్యర్థులే లేకుండా 4 శాతం గెలిచామనటం హాస్యాస్పదం. కులగజ్జి ఉన్నవాళ్లు తప్ప చంద్రబాబుని ఎవరూ నమ్మడం లేదు. ప్రజా చీత్కారాన్ని తట్టుకోలేక బాబు దద్దమ్మలా మాట్లాడుతున్నారు. చెత్త డిబేట్లు, సొల్లుకబుర్లుతో కొంతమంది శునకానందం పొందుతున్నారు. ఎవరెన్ని పాట్లు పడ్డా మరో ముప్పై ఏళ్ళు వైఎస్‌ జగనే సీఎంగా ఉంటారు' అని కొడాలి నాని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement