ఆ శాపంతోనే టీడీపీకి 23 సీట్లు: కొడాలి నాని | Ministers Kodali Nani And Perni Nani Firs On Chandrababu | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?

Published Thu, Dec 17 2020 7:07 PM | Last Updated on Thu, Dec 17 2020 9:10 PM

Ministers Kodali Nani And Perni Nani Firs On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరుపై మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, చంద్రబాబుది ఫేక్‌ జాతీయ పార్టీ అని, ఆయన ఫేక్‌ జాతీయ అధ్యక్షుడని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి ఎన్టీఆర్ కాళ్ల దగ్గర చేరి ఆయనకే వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు. (చదవండి: రేపు అర్ధరాత్రి వరకు వెబ్‌ఆప్షన్లకు గడువు..)

‘‘అమరావతి పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి రైతులను మోసం చేశారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి దుర్గమ్మకు ఎప్పుడైనా పట్టువస్త్రాలు సమర్పించారా?. చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై క్షుద్రపూజలు చేయించారు. దుర్గమ్మ శాపంతోనే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారు. దుర్గమ్మ చల్లగా చూసింది కాబట్టే.. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యారు. మంగళగిరిలో లోకేష్‌ను ఓడించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో బాబును ఓడిస్తారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. హెరిటేజ్‌ కోసం సహకార వ్యవస్థను నాశనం చేశారు. హెరిటేజ్‌కు అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?. చంద్రబాబు పందికొక్కులా గ్రామీణ పేద మహిళల డబ్బులు దోచేశారని’’  మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. (చదవండి: టీడీపీ హయాంలోనే.. గుళ్లు కూల్చేశారు)

చంద్రబాబుకు తగిన శాస్తి జరుగుతుంది: పేర్ని నాని
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. దేవుళ్లతో నాటకాలు ఆడితే తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఎవరైనా భూదేవితో నాటకాలు ఆడితే మట్టిగొట్టుకు పోతారని దుయ్యబట్టారు. తాము పేదలకు సాయం చేస్తుంటే.. అడ్డుకునేవారు రైతులెలా అవుతారని పేర్ని నాని ప్రశ్నించారు. పేదలకు ‘సాయం చేస్తుంటే అడ్డుపడుతోంది చంద్రబాబు చౌదరే. చంద్రబాబుపై ఉన్న అన్ని స్టేలు ఎత్తివేసే రోజు త్వరలోనే వస్తుందని’’ మంత్రి పేర్ని నాని అన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement