Vemuri Radhakrishna
-
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: 'ఆంధ్రజ్యోతి'కి ఉత్తమ జర్నలిస్ట్ సాంప్రదాయాలు పాటించమని, మా స్పందన కూడా ప్రసారం చెయ్యాలని చెప్పా.. నువ్వు అసలు చిత్తశుద్ధి కలిగిన వృత్తిపరమైన పాత్రికేయుడివేనా? అంటూ ఎక్స్ వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.‘‘నన్ను 2012లో సీబిఐ అరెస్ట్ చేసినప్పుడు మా ఇల్లు, ఆఫీస్ రైడ్ చేసి ఫైల్స్, అన్నిపత్రాలు స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపారు. 12 నెలలు, కాంగ్రెస్-టీడీపీ కుట్రలో భాగంగా, జైల్లో గడిపాను. "ఆదాయానికి మించి ఆస్తులు" అభియోగాలు లేవు. నా పైన పెట్టిన సెక్షన్లు కుట్ర, ప్రేరేపణ, ఖాతా లెక్కల ఫడ్జింగ్ మాత్రమే. నీలాగ మోసగాడినో, దోపిడీదారునో, బ్లాక్ మైలర్ నో, వీలర్ డీలర్ నో కాదు. గుర్తుంచుకో!’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు...నీలాగా మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర, ఖనిజాల సిండికేట్ బ్రోకర్ల దగ్గర ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వారికీ ఇవ్వాలని నెల నెలా కోట్లకు కోట్లు నేను తీసుకోలేదు. ఇప్పుడు 2024లో విజయసాయి రెడ్డి అనే నేను నువ్వు చెప్పే భూదందాలు, భూముల ఆక్రమణలు పై సిబిఐ, ఈడీ విచారణకు సిద్ధం. నువ్వు సిద్ధమేనా వేమూరి రాధాకృష్ణా? ఇద్దరం కలసి జాయింట్‌గా కేంద్రవిచారణా సంస్థలకు విచారణకు పిటిషన్ పెట్టుకుందాం! సిద్ధమా!. సాధారణ విలేకరిగా ఇంత సంపద పోగేసుకున్నావ్, సీఏ చదివిన ఆడిటర్‌గా ప్రాక్టీసుతో ఈ స్థాయికి నేను వచ్చాను. ఎవరెలా సంపాదించారో తెలుగు ప్రాంతాల బయట నాతో చర్చకు సిద్ధమా? రాధాకృష్ణా’’ అంటూ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.1/2 ఈరోజు ఆంధ్రజ్యోతి బ్రేక్ ఫాస్ట్ న్యూస్ లో వేమూరి రాధాకృష్ణ ఉవాచ: "గుడిని మింగేది సుబ్బారెడ్డి, లింగాన్ని మింగేది సాయిరెడ్డి. భూమిని మింగిన రాక్షసులు"పలుసార్లు మీ 'ఆంధ్రజ్యోతి' కి ఉత్తమ జర్నలిస్ట్ సాంప్రదాయాలు పాటించమని, మా స్పందన/జవాబు కూడా ప్రసారం చెయ్యాలని చెప్పాను.…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2024 ‘‘22 ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికను సాధారణ విలేకరివి అయినా రాధాకృష్ణ.. ఆంధ్రజ్యోతి స్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎల్ ఎన్ ప్రసాద్ వారసుల నుంచి సొంతం చేసుకుని 2002 అక్టోబర్‌లో మొదలెట్టి కొద్ది సంవత్సరాల్లోనే దాదాపు 20 ఎడిషన్లు పెట్టేస్థాయికి ఎదిగింది. నూజివీడు సీడ్స్ యజమాని మండవ ప్రభాకర రావు, విజై ఎలెక్ట్రికల్స్ నాటి యజమాని దాసరి జై రమేష్ వంటి పారిశ్రామికవేత్తలకు వాటాలు ఉన్నట్టు చెప్పి మరెందరో రహస్య పెట్టుబడిదారులను మోసం చేసి నువ్వు ఈ పత్రికను వేలాది కోట్ల రూపాయల సంపదగా దాన్ని మార్చుకున్న తీరు తెలుగునేలనే అపూర్వం. అనితర సాధ్యం’’ అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఇదీ చదవండి: కూటమికి కళ్లు నెత్తికెక్కాయి.. ఏపీ బీజేపీలో తిరుగుబాటు స్వరం -
జగన్ హయాంలోనే బుడమేరు ఆధునికీకరణ పనులు
సాక్షి, అమరావతి: వరద నియంత్రణతోపాటు సహాయక చర్యల్లోనూ ఘోరంగా విఫలమైన సీఎం చంద్రబాబు.. ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేందుకు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తున్నారు. బుడమేరు డైవర్షన్ చానల్ (బీడీసీ) ఆధునికీకరణ పనులను 2014–19 మధ్య వేగవంతం చేస్తే.. వాటిని రద్దు చేయడం వల్లే ఇప్పుడు గండ్లు పడ్డాయంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ ఉన్నచోట మినహా బీడీసీ మట్టి తవ్వకం పనులను 2024 మార్చి నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. యాక్టివ్ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేస్తూ 2021 జనవరి 6న జారీ చేసిన ఉత్తర్వులపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించి.. ఆ ఉత్తర్వులు అమలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. రాధాకృష్ణ అడ్డుపడకపోయి ఉంటే 2024 మార్చి నాటికే బీడీసీ ఆధునికీకరణ పనులు మొత్తం పూర్తయ్యేవని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ హయాంలోనే పనులకు శ్రీకారం కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం జమ్ములవోలు దుర్గం కొండల్లో పుట్టే బుడమేరు 130 కి.మీ. దూరం ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. బుడమేరుకు గరిష్టంగా 24,500 క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. విజయవాడకు ముంపు ముప్పును తప్పించేందుకు వెలగలేరు వద్ద రెగ్యులేటర్‌ను నిరి్మంచి.. అక్కడి నుంచి 7,500 క్యూసెక్కులను కృష్ణా నదిలో కలిపేలా 11.9 కి.మీ. పొడవున బీడీసీని 1957లో తవ్వారు. వెలగలేరు రెగ్యులేటర్‌కు 11 గేట్లను ఏర్పాటుచేసి.. దిగువకు 17,500 క్యూసెక్కులు వదిలేలా బుడమేరును అభివృద్ధి చేశారు.1990లో బీడీసీ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచుతూ పనులు చేపట్టారు. వెలగలేరు రెగ్యులేటర్ ఎగువన పోలవరం కుడి కాలువ ద్వారా 11,255 క్యూసెక్కులను కలపాలని 2005లో నిర్ణయం తీసుకున్న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులు (బుడమేరు 24,500, పోలవరం కుడి కాలువ 11,255, ఎన్టీటీపీఎస్ 1,800 క్యూసెక్కులు) పెంచే పనులను 2008లో రూ.241.45 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనుల కారణంగా బీడీసీపై 10.375 కి.మీ. వద్ద ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్‌ను తొలగించాలి. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు 2009 ఆగస్టు 29న ఆ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని ప్రభుత్వం రద్దు చేసింది. వేగంగా లైనింగ్ పనులు బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో భాగంగా ఐదో రీచ్‌లో అంటే 10.3 నుంచి 11.9 కి.మీ. వరకూ చేపట్టిన పనుల్లో రాధాకృష్ణకు చెందిన పవర్ ప్లాంట్ ఉన్న 10.3 కి.మీ. నుంచి 10.475 కి.మీ. వరకూ మినహా మిగతా పనులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే బీడీసీకి రూ.206.79 కోట్లతో లైనింగ్ పనులను కూడా చేపట్టింది. రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌ను తొలగించి.. బీడీసీ ఆధునికీకరణ పనులు పూర్తి చేసేందుకు 2021 జనవరి 6న ప్రభుత్వం నోటీసులు ఇచి్చంది.కానీ.. వాటిపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల (స్టే) చేయాలని హైకోర్టు ఆదేశించడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. బీడీసీ లైనింగ్ పనుల్లో చేసిన పనులకు 2019 మే నాటికి రూ.23.89 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇది వాస్తవం. రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం 2014–19 మధ్య బీడీసీ ఆధునికీకరణ పనులను ఆపేసిన చంద్రబాబు.. ఇప్పుడు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్ఫచారం చేస్తుండటం గమనార్హం. రాధాకృష్ణ కోసం ఆధునికీకరణకు చంద్రబాబు మోకాలడ్డు మహానేత వైఎస్ మరణానంతరం సీఎ కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని తెలుగు–కాంగ్రెస్ ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఎన్వోసీని 2014 జనవరి 25న పునరుద్ధరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన టీడీపీ ప్రభుత్వం బీడీసీ ఆధునికీకరణ పనులను ఆపేసింది. 2019లో అధికారంలోకి వచి్చన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచే పనుల్లో.. ఐదు రీచ్‌లలో 0–2.5 కి.మీ., 2.5 నుంచి 6 కి.మీ., 6.5 నుంచి 8.3 కి.మీ. వరకూ పూర్తి చేసింది. నాలుగో రీచ్‌లో 8.3 నుంచి 10.3 కి.మీ. గానూ ఎన్టీటీపీఎస్ అధికారులు అభ్యంతరం చెప్పిన 8.3 నుంచి 9.375 కి.మీ. మినహా మిగతా పనులు పూర్తి చేసింది. -
మీరు మాత్రం వందల కోట్లు దోచుకోవచ్చా?
తెలుగుదేశం పార్టీ బాకాగా గుర్తింపు పొందిన మీడియాలో ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అయితే నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో నిత్యం సంబంధాలు నెరపుతుంటారు. టీడీపీ ప్రభుత్వం ఏపీలో ఉన్నప్పుడు రాధాకృష్ణే పలు మద్యవర్తిత్వాలు, ఆర్దిక లావాదేవీలు చేసి బాగా లాభపడ్డ వ్యక్తి అన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయల మేర ఆయన తన సంస్థలకు కట్టబెట్టుకున్నారని అప్పట్లో కొందరు ప్రముఖులు నేరుగానే విమర్శలు గుప్పించేవారు. అలాంటి వ్యక్తి ఏమైనా చెబితే అదంతా చంద్రబాబు మనసులో మాటగాను, టీడీపీ భావనగాను అంతా భావిస్తారు. తాజాగా ఆయన రాసిన ఒక వ్యాసంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై చాలా ఆందోళన చెందారు. ప్రజలకు ఇలా పప్పు , బెల్లాలు మాదిరి పంచిపెట్టి వారిని సోమరులుగా మార్చుతారా అని ఆయన ప్రశ్నించారు. ✍️ఇది చదుతుంటే ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడే చంద్రబాబే గుర్తుకు వస్తారు. ఎంతకాదన్నా ఆయన సొంత మనిషిగానో, మరో రకంగానో ఈయన పేరు పడ్డారు కాబట్టి అలా రాసి ఉండవచ్చు. తెలంగాణ ఎన్నికల ఖర్చు, అక్కడి హామీల గురించి రాస్తూ కూడా ఈయన ఏపీని, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ద్వేషించడం మానుకోలేదు. ఈయన వ్యాసంలోని ఒక భాగం ఇలా ఉంది'ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన హామీల అమలుకు ఏటా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఒక అంచనా. ✍️కళ్లు చెదిరే అభివృద్ధి చేశామని చెప్పుకొనే పాలకులు ఈ విధంగా ప్రజలకు తాయిలాలు పంచుకుంటూ పోవడం సమర్థనీయమా? ఇలా అయితే ఈ హామీలకు అంతెక్కడ? కేసీఆర్ కోరుకుంటున్నట్టు ప్రజలు ఎలా గెలుస్తారు? రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించే హక్కు రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారు? ఎవరో ముఖ్యమంత్రి పీఠం మీద కుర్చోవడానికి ఇలా అలవికాని హామీలు ఇచ్చుకుంటూ పోవచ్చునా? ఈ ధోరణికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం లేదా? ఈ విషయంలో రాజ్యాంగబద్ధ సంస్థలు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేవు. స్వీయ నియంత్రణ పాటించాల్సిన రాజకీయ నాయకులు ఆ పని చేయరు. మరి ఎలా? మౌలిక సదుపాయాల కల్పనకు డబ్బు లేకపోయినా సంక్షేమం పేరిట ప్రజా ధనాన్ని పప్పూ బెల్లాల్లా పంచడం వల్ల ప్రజల్లో సోమరితనం పెరిగిపోతుండటం నిజం కాదా? "అని రాశారు.ఇది చదివితే ఏమనిపిస్తుంది. ✍️చంద్రబాబు నాయుడు తన మనసులో మాట పుస్తకంలో రాసిన విషయాల మాదిరే అనిపిస్తుంది కదా! పేద ప్రజలకు సాయం చేయడం వారిని సోమరిపోతుల్లా మార్చడమే అని అంటున్న ఈయన మాత్రం ప్రభుత్వాల నుంచి వందల కోట్లు సంపాదింవచ్చు. అది ప్రజల అభివృద్ది. అది మౌలిక వసతుల అభివృద్ది అని అనుకోవాలి. తన మీడియా వ్యాపారం కోసం ఈయన రాజకీయ నేతల నుంచి కోట్లకు కోట్లు వసూలు చేయవచ్చు. అప్పుడు ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందన్న సందేహం ఈయనకు రాదు. ప్రచార ప్రకటనల పేరుతో , నేతల పుట్టిన రోజు అనో, మరొకటనో వారిని పీడించి డబ్బులు గుంజవచ్చు. అక్కడితో ఆగకుండా ఆంధ్రజ్యోతి వార్షికోత్సవం పేరుతో ఎందరి నుంచి ప్రకటనల రూపంలో డబ్బు దండుకుంటున్నారు!ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది!చేసేది ..ఈ పనులు.. చెప్పేవి మాత్రం నీతులు. ప్రజలపైన, రాష్ట్రం పైన ప్రేమ ఉన్నట్లు నీతి శతకాలు వల్లె వేయడం. పోనీ ఇన్ని కబుర్లు చెప్పే ఈయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో రైతుల, డ్వాక్రా మహిళల లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని బోగస్ హామీ ఇచ్చినప్పుడు, అబ్బో ఆయన కాబట్టి రుణమాఫీ చేసేస్తారు.. అని ఆయన పత్రిక ప్రచారం చేసిందా?లేదా? అప్పుడేమైనా చంద్రబాబు హామీని నమ్మవద్దని రాసి ఉంటే ఫర్వాలేదనుకోవచ్చు.టీడీపీ ప్రతినెల రెండువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మానిఫెస్టోలో రాసినప్పుడు అదెలా సాధ్యమని ప్రశ్నించారా?సుమారు 400 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినప్పుడు ఈయనకు కమ్మగా ఉంది కదా! ✍️ఆ మానిఫెస్టోని వెబ్ సైట్ నుంచి మాయం చేసేశారు కదా! అప్పుడు నోరెత్తలేదే! చిత్తశుద్ది ఉంటే వాటిని కూడా ప్రశ్నించాలి కదా! ఈయన అసలు ద్వేషం తెలంగాణ పార్టీల మీద.. ఆ నేతల మీద కాదు. ఎందుకంటే ఆ పార్టీల నేతలతో ఆయన ఏదో రకంగా ఒప్పందం అయి ఉంటారు. బాగానే గిట్టుబాటుఅయి ఉంటుంది.అందుకే మొదట కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా ,టిఆర్ఎస్ పై దూకుడుగా వెళ్లిన ఈ మీడియా ఆ తర్వాత ఎందుకు పంధా మార్చుకుందో అర్ధం చేసుకోలేమా! ఆయన వెంటనే ఆవు కధ మాదిరి ఏపీ ప్రభుత్వంపై పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై నిత్యం వెదజల్లె విషాన్ని మరోసారి చిమ్మి తన వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఇదే వ్యాసంలో ఏమంటారో చూడండి...'పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. బటన్లు నొక్కుతున్నామని చెప్పుకొంటున్న పాలకులు అభివృద్ధిని, మౌలిక వసతులను గాలికి వదిలేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను చూశాక తెలంగాణ పరిస్థితి కూడా దిగజారబోతోందన్న గుబులు పట్టుకుంది."ఇది పచ్చి అబద్దం. తెలంగాణలో సైతం పలు సంక్షేమ స్కీములు ఉన్నాయి. ✍️దళిత కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని, బిసి బంధు, మరో బంధు పేరుతో లక్ష రూపాయల చొప్పున డబ్బు ఇప్పటికే ఇస్తున్నారు కదా!అవి కరెక్టా?కాదా?రైతు బంధు పేరుతో ఇచ్చే డబ్బులను సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?ఇంకో సంగతేమిటంటే ఈయన కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆరు గ్యారంటీలను ఎందుకు వివరంగా విశ్లేషించలేదు?కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణలో మరింత కష్టం అని తెలియదా! మనసులో కాంగ్రెస్ గెలవాలి... రేవంత్ రెడ్డి సి.ఎమ్. అయితే ప్రభుత్వంలో చక్రం తిప్పాలన్న కోరిక కాకుండా మరొకటి ఉందా? మరి ఏపీలో నిజంగా మౌలిక వసతులపై దృష్టి పెట్టలేదా? వేలాది గ్రామాలలో స్కూళ్లను బాగు చేయడం , ఆస్పత్రులను బాగు చేయడం, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ,వార్డు సచివాలయాల భవనాలు నిర్మించడం ఇవేవి మౌలిక వసతులు కావా? పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, నాలుగు ఓడరేవుల నిర్మాణం, తొమ్మిది ఫిషింగ్ హార్బనిర్మాణం వంటివి ఎన్నడైనా చంద్రబాబు టైమ్‌లో జరిగాయా? ✍️మరి అప్పుడు జరగకపోయినా చాలా జరిగిపోయినట్లు, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా, అసలేమీ చేయనట్లు పచ్చి అబద్దాలు రాస్తూ ప్రజలను మోసం చేయాలన్న తలంపు తెలుస్తూనే ఉంది. ఇది పక్కన బెడదాం. జగన్ బటన్ నొక్కుతున్నారని రోధిస్తున్నారు కదా! మరి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరంలో మహానాడు పెట్టి మినీ మానిఫెస్టోని ప్రకటించి, అందులో జగన్ ఇస్తున్నవాటికి ఐదు రెట్ల సంక్షేమ స్కీములు అమలు చేస్తామని,బటన్ నొక్కుతామని చెప్పినప్పుడు ఇదే రాధాకృష్ణ తన పత్రికలో ఏమి రాశాడో తెలుసా! జగన్ ప్రభుత్వంపైకి చంద్రబాబు శరాలు సిద్దం..ఇక ప్రభుత్వం పని అవుట్ అన్న చందంగా వాటిని పోల్చి తెగపొగిడారు కదా! రాధాకృష్ణ ఎంతకాదన్నా చంద్రబాబుకు ఏజెంటే కాబట్టి , ఆయనలాగే వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చా! జగన్ తాను చెప్పిన నవరత్నాల అమలుకు ఏడాదికి నలభైఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంటే గుండెలు బాదుకుంటున్న ఆంధ్రజ్యోతి, దీనితో పాటు ఉన్న మరో మీడియా ఈనాడులకు, చంద్రబాబు, పవన్‌లు ఇస్తున్న హామీల ప్రకారం ఏడాదికి లక్షన్నర కోట్లకు పైగానే ఆయా వెల్ఫేర్ స్కీములకు ఖర్చు చేయాలన్న విషయం తెలియదా! ✍️ఏనాడైనా అంత డబ్బు ఎక్కడనుంచి వస్తుందని రాధాకృష్ణ నిలదీశారా?అలా చేయకపోగా ..ఆహా మా చంద్రబాబు కాబట్టి అలా ప్రకటించారు అని చంకలు గుద్దుకున్నారు. నిజంగా రాధాకృష్ణకు ఏమాత్రం కొద్దిపాటి విలువలు ఉన్నా, చంద్రబాబు ప్రకటించిన మినీ మానిఫెస్టోని విమర్శిస్తూ వ్యాసం రాయాలి కదా? కర్నాటకలో కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పినవాటిని కొన్నిటిని, జగన్ అమలు చేస్తున్న కొన్నిటిని కాపీ కొట్టి మరింత ఎక్కువగా అమలు చేస్తామని కదా టీడీపీ మినీ మానిఫెస్టో ఇచ్చింది.దానికి బాబు గ్యారంటీ అంటూ ఒక సర్టిఫికెట్. 2014లో రైతుల రుణమాఫీ హామీ ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా జరిపి చేతులెత్తేసినప్పుడు ఆ గ్యారంటీ ఏమైంది?ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో ఇష్టారీతిన హామీలు ఇచ్చేశారని రాధాకృష్ణ చెప్పకనే చెప్పేశారు. ✍️టీడీపీ మినీ మానిఫెస్టోని నమ్మవద్దని ఆయనకు తెలియకుండానే ఒక వాస్తవం చెప్పేశారనుకోవాలి. లేదంటే 2014లో మాదిరి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేయవచ్చులే అని అయినా అనుకుని ఉండాలి. ఒకవేళ జగన్ తాను చెప్పిన విధంగా హామీలను నెరవేర్చకుంటే ఇదే రాధాకృష్ణ ఎంత ఘోరంగా రాసి ఉండేవారు! ఆ అవకాశం లేదు కనుక ఇప్పుడు ఈ రాగం ఎత్తుకున్నారు. పోనీ అందులో ఏమైనా చిత్తశుద్ది ఉందా అంటే అదేమి లేదు. మళ్లీ చంద్రబాబు చేసే అబద్దపు హామీలన్నిటిని భుజాన వేసుకుని తిరుగుతుంటారు. రాధాకృష్ణ, రామోజీవంటి వారిని ఆంధ్ర ప్రజలు నమ్ముతారా?నమ్మి మోసపోతారా? అంటే అలా జరగదనే 2019 ఎన్నికల అనుభవం చెబుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు
సాక్షి, విజయవాడ: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు అవినీతిని ప్రొత్సహించి.. ఈనాడు టీడీపీని పతనం అంచున నిలబెట్టడంలో రాధాకృష్ణ పాత్రను లేఖలో ప్రస్తావిస్తూ.. చురకలతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారామె. చంద్రబాబు, ఆయనకి భుజంగా ఉంటూ రాధాకృష్ణ, రామోజీరావులు.. ఈ ముగ్గురు తెలుగు దేశం పార్టీకి నేటి దుస్థితిని కలగజేశారని లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీలాంటి(రాధాకృష్ణను ఉద్దేశించి..) వాళ్లు ఉంటారని తెలియకనే ఎన్టీఆర్ ఆనాడు టీడీపీని స్థాపించారు. నాడు 201 స్థానాల్లో నెగ్గి ప్రభంజనం సృష్టించిన పార్టీ.. 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయ్యింది. అందుకు కారణం మీతో పాటు చంద్రబాబు, రామోజీరావులే’’ అని లేఖలో పేర్కొన్నారామె. నార్ల వెంకటేశ్వరరావు లాంటి గొప్ప జర్నలిస్టు స్థాపించిన ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఒక చిత్తుకాగితంగా, చెత్త బుట్టగా మార్చావంటూ రాధాకృష్ణపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎవరో కష్టపడి సాధించుకున్నది తెలివిగా ఎత్తుకుపోవడంలో మీ గురుశిష్యులు ఇద్దరూ సిద్ధ హస్తులే అంటూ.. చంద్రబాబుకి, రాధాకృష్ణకి చురకలంటించారామె. తనను టీడీపీలో దుష్టశక్తిగా, సైతాన్గా, రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించిన ఆనాటి యెల్లో మీడియా.. ఆ ఆరోపణల్ని ఇప్పటివరకు రుజువు చేయలేకపోయిందని అన్నారామె. అల్లుడు కదాని అప్పజెబితే ఇల్లంతా ఏదో చేసాడట! నారా లోకేష్‌ను అడ్డదారిలో తీసుకొచ్చి మంత్రిని చేస్తే.. అవినీతి రెండింతలు పెరిగిందని లక్ష్మీ పార్వతి లేఖలో పేర్కొన్నారు. అప్పటిదాకా ఒక చేత్తోనే సంపాదించిన చంద్రబాబు.. కొడుకు చేతుల్ని కలుపుకొని లక్షల కోట్లకు ఎగబాకాడని ఆరోపించారామె. అయినా.. అలాంటి కుటుంబాన్ని జాకీలు పెట్టి లేపడానికి ఆంధ్రజ్యోతి ఉంది కదా అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. ఎంత గొప్ప విజనరీనో? చంద్రబాబు విజన్‌కు ఆకాశానికి ఎత్తే రాధాకృష్ణకు లేఖలో చురకలంటించారామె. వెన్నుపోటు, అడ్డగోలు అవినీతి సంపాదన, కేసులు బయటకు రాకుండా మేనేజ్ చేయడంలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ(చంద్రబాబు) గొప్ప విజన్ సాధించారని అన్నారామె. ‘‘ప్రస్తుతం తెలుగుదేశం పరువు ఏ మురుగు గుంటలో పడి దొర్లుతుందో చూడండి. అవినీతి చక్రవర్తి మీ విజనరీ నాయకుడు పై కేసులు మీద కేసులు వస్తుంటే.. జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెట్టాడు. కొడుకు నారా లోకేష్ జైలు దారిలో ఉన్నాడు. హెరిటేజ్ లెక్కలు చెప్పలేక భువనేశ్వరి రోడ్లమీద తిరుగుతున్నది. ఎంత గొప్ప విజనరీ’’ అని లేఖలో లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. టీడీపీకి సమాధి కట్టి కోట్లు సంపాదించారు పేదల పార్టీగా ఉన్న టీడీపీని.. పెద్దల పార్టీగా మార్చడానికి చంద్రబాబు, రాధాకృష్ణ చాలా కష్టపడ్డారంటూ విమర్శలు గుప్పించారామె. ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో.. తెలంగాణలో ఇప్పుడు అదే కాంగ్రెస్ కాళ్ల దగ్గర టీడీపీని పెట్టాడని.. ఏపీలోనూ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి తాకట్టు పెట్టే యత్నం జరుగుతోందని.. గంగా నదిలాంటి టీడీపీని మురుగు కాలువగా మార్చి అబద్దాల పునాదుల మీద నడిపిస్తున్నారని మండిపడ్డారామె. తెలుగు దేశం ఖ్యాతిని సమాధి చేసి.. ఆ రాళ్లతో కోట్లు సంపాదించుకున్నారంటూ రాధాకృష్ణ, చంద్రబాబులపై ఆమె లేఖ ద్వారా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. -
ఆధారాలున్నాయా?.. ఏబీఎన్ రాధాకృష్ణపై సోము వీర్రాజు ఫైర్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలపై తప్పుడు రాతల విషయంలో ఏబీఎన్ రాధాకృష్ణపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ లేఖలో ‘విద్వేషపూరిత కథనాలతో బీజేపీ ప్రతిష్టకు భంగం కలిస్తారా?. అవినీతిపై ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురిస్తారా?. బీజేపీ నేతలు అవినీతికి పాల్పడినట్టు మీ దగ్గర ఆధారాలున్నాయా?. మీ రచనలు ‘ఎల్లో జర్నలిజం’గా కనిపిస్తున్నాయి. వారంలోగా ఆధారాలు చూపాలి. లేకుంటే క్షమాపణలు చెప్పాలి. వారంలో స్పందన లేకుంటే చట్టపరమైన చర్యలకు దిగుతాము’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు బినామీ: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు బినామీ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని ధ్వజమెత్తారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తప్పుడు వీడియోలు ప్రసారం చేశారని, రాజకీయ లబ్ధి కోసమే జరిగిందన్నారు. ఆ వీడియో ఇప్పుడు ఫేక్ అని తేలిందన్నారు. చంద్రబాబుతో కలిసి రాధాకృష్ణ ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. చదవండి: అందుకే వారికి కడుపు మంట: సీఎం జగన్ బీసీలకు చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తన గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేసిన రాధాకృష్ణ నా సవాల్ స్వీకరించలేదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణకు దమ్ముంటే ఇప్పటికైనా తన సవాల్ స్వీకరించాలని నారాయణస్వామి అన్నారు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్
సాక్షి, చిత్తూరు: ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తనపై తప్పడు వార్తలు రాయించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో తనకు మద్యం షాప్‌ల బినామీలు ఉన్నట్లు ఆరోపణలను ఆయన ఖండించారు. రాధాకృష్ణకు దమ్ముంటే తన బినామీలు ఎవరో బయటపెట్టాలని నారాయణస్వామి సవాల్ విసిరారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? ‘‘రాధాకృష్ణ నీచపు బుద్ధి మానుకోవాలి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనంపై పరువునష్టం దావా వేస్తా. ఈ-వేలం ద్వారా బార్లకు లైసెన్స్‌లు పొందుతున్నారు. నిబంధనలు ప్రకారం వేలం జరుగుతుంటే రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నారు. ఆంధ్రజ్యోతి నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ నారాయణస్వామి విసిరారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో షెల్ కంపెనీల ముసుగులో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) నిధులు కొల్లగొట్టిన కేసులో అరెస్టుల పర్వానికి తెరలేచింది. రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్ వారంట్ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. సోదాలు నిర్వహిస్తుండగా రాధాకృష్ణ హల్చల్ సీఐడీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపు కేసు విచారణలో భాగంగా సీఐడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ కె.లక్ష్మీ నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా వేమూరి రాధాకృష్ణ అక్కడకు చేరుకుని హల్చల్ చేయడం వివాదాస్పదమైంది. ఆయన తన అనుచరులతో బయట సీఐడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఐడీ సోదాల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయడం ఆపాలని, బయట అనుచరులను అదుపు చేయాలని సీఐడీ అధికారులు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. దాంతో సీఐడీ అధికారులు తీవ్ర ఒత్తిడి మధ్యే పంచనామా పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ పంచనామాలోని అంశాలను త్వరగా న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉన్నందున సీఐడీ అధికారులు వెంటనే విజయవాడకు తిరిగి వచ్చేశారు. అనంతరం వేమూరి రాధాకృష్ణ తమ విధులకు ఆటంకం కలిగించిన విషయంపై విజయవాడలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో 353, 341, 186, 120(బి) సెక్షన్ల ద్వారా ఆయనపై జీరో ఎఫ్ఐఆర్ కింద ఆదివారం కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు. చదవండి: దోపిడీలో స్కిల్.. బాబు గ్యాంగ్ హల్'షెల్' -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వెంకటకృష్ణలపై చర్యలు తీసుకోండి
నరసరావుపేట: తాము ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అపకీర్తిపాలు చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రేరేపిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఏబీఎన్ న్యూస్ చానల్ రిపోర్టర్ వెంకటకృష్ణలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ కౌన్సిలర్ నెలటూరి మురళి, ఎస్సీ నాయకుడు తలారి నాని రూరల్ పోలీసులను కోరారు. ఈ మేరకు సోమవారం రాత్రి వారిద్దరూ ఎస్ఐ టి.లక్ష్మినారాయణరెడ్డికి .ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి ఎంతో ప్రజారంజకంగా పాలన చేస్తున్నారన్నారు. ఆయన అన్ని మతాలు, కులాలు, ఆచారాలు, అభిప్రాయాలను గౌరవిస్తూ అందరికీ ప్రాధాన్యతనిస్తూ పాలన చేస్తున్నారన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ న్యూస్ చానల్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా క్రిస్టియానిటీని అభివృద్ధి చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. గత జూన్ 27న ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్‌లో ఆర్కే కొత్త పలుకులు పేరుతో జీసెస్‌తో మాట్లాడానని సీఎం అన్నట్లు, తాను దైవదూతనని అధికారులతో చెప్పినట్లుగా ఎలాంటి ఆధారాలు లేకుండా రాశారన్నారు. మతాలను కించపరుస్తూ విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తున్న రాధాకృష్ణ, వెంకటకృష్ణలపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. -
లోకేశ్ భవిష్యత్‌పై బెంగ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుమారుడు లోకేశ్ గురించి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళనగా మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో శనివారం రాధాకృష్ణను కలిసిన రేవంత్‌రెడ్డి పిచ్చాపాటి మాటల్లో లోకేశ్ ప్రస్తావన తీసుకురాగా.. తాను లోకేశ్ కోసం ఎంతో తిరిగానని రాధాకృష్ణ బదులిచ్చారు. దీంతో అతన్ని క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పమని రేవంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. తెలంగాణలో మీడియా అంతా కేసీఆర్ కంట్రోల్లో ఉందని.. ఏపీ మీడియాలో మాత్రం ఏబీఎన్, టీవీ–5 చానల్స్ ద్వారా లోకేశ్‌కు బాగా ప్రచారం కల్పిస్తున్నామని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనకదుర్గ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన
సాక్షి, కృష్ణా: విజయవాడ నగరంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద క్రిస్టియన్, దళిత సంఘాలు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పలు కథనాలను ఇచ్చిన ఏబీఎన్ ఛానెల్ ఛైర్మెన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. తప్పుడు కథనాలకు బాధ్యతవహిస్తూ.. క్షమాపణ చెప్పాలని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాధాకృష్ణ తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని కార్యాలయ సిబ్బందిని ఆందోళనకారులు హెచ్చరించారు. చంద్రబాబుతో చేతులు కలిపిన రాధాకృష్ణ దళితులను, క్రైస్తవులను అవమాన పరుస్తున్నాడని రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనీల్ ఆరోపించారు. మూడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేసి ఆంధ్రజ్యోతి కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభింపచేస్తామని ఆయన హెచ్చరించారు. -
‘ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచే విధంగా కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్ చానెల్‌పై క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. శనివారం రాత్రి ఛానెల్లో ప్రసారమైన ‘కిరాక్’ కార్యక్రమంలో యాంకర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నాయకులు ఆదివారం సాయంత్రం ఫిలింనగర్‌లోని చానెల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చానెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ రొంపిలోకి క్రైస్తవులను లాగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. క్రైస్తవులకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చానెల్ ప్రతినిధులకు లేఖ అందజేశారు. వివిధ సంఘాల నాయకులు శామ్యూల్ గౌరిపాగ, మలాకి, సాల్మన్‌రాజ్, సుందర్రాజు, కెన్నడి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
‘అందుకే మిమ్మల్ని బూతు కిట్టూ అంటున్నారు’
హైదరాబాద్/తాడికొండ: అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన ఆడియో టేపులను ఇష్టారీతిగా ప్రసారం చేస్తూ దళితులను, ఇతర వర్గాల మహిళలను కించపరిచేలా ఏబీఎన్ చానెల్ అధినేత రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్మీ’ అని చంద్రబాబు రూ.5 కోట్ల విషయంలో అడ్డంగా దొరికినప్పుడు దాన్ని ప్రసారం చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి చానెల్లో వాటా ఉండటమే దీనికి కారణమన్నారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రసారానికి ముందు తమ వివరణ అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణను బూతు కిట్టూ అంటుంటే ఎందుకంటున్నారో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు బాగా అర్థమవుతోందన్నారు. మీ చంద్రబాబేమో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్నారని, టీడీపీ నేతలేమో దళితులు శుభ్రంగా ఉండరు.. చదువుకోరు అని కించపరిచారని గుర్తుచేశారు. బూతు ప్రసారాలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు రాధాకృష్ణకు బూతుకిట్టు అనే బిరుదు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇవే ఆడియోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి మీ తల్లినో, చెల్లినో, అక్కనో వెబ్సైట్లో పెడితే మీరు బాధపడరా అని రాధాకృష్ణను ప్రశ్నించారు. ‘ఏదైనా ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోండి. నాకు వైఎస్ జగన్ రాజకీయ భిక్ష పెట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతుంది’ అని శ్రీదేవి తీవ్రంగా మండిపడ్డారు. -
నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా
ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల స్కాంలో తన ప్రమేయం ఉందని పరోక్షంగా తనను ఉద్దేశించి ఆంధ్రజ్యోతిలో అబద్ధపు రాతలు రాశారని, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. అలా నిరూపించలేని పక్షంలో ఆంధ్రజ్యోతి దినపత్రికను మూసివేస్తారా అని ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రూ.117 కోట్లు చెక్కేశారని అబద్దపు కథనాన్ని ప్రచురించారన్నారు. తనపేరు ప్రస్తావించకపోయినా జిల్లాలో పది మంది ఎమ్మెల్యేల తరఫున తాను మాట్లాడుతున్నానని చెప్పారు. కాగా, తమ పార్టీ కార్యాలయంలో పనిచేసే చెన్నకేశవరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చారని తేలడంతో వెంటనే విధుల నుంచి తొలగించానని చెప్పారు. భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ఇందులో కీలకపాత్ర పోషించాడని వివరించారు. అలాగే ట్రస్టు పేరుతో డ్రా చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నకిలీ బాగోతాన్ని గుర్తించిందన్నారు.ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరినా తనకు అభ్యంతరం లేదని రాచమల్లు తెలిపారు. -
'చంద్రబాబు నిర్మాతగా రోజుకో సినిమా చూపిస్తున్నారు'
సాక్షి, కృష్ణా : చంద్రబాబు నిర్మాతగా రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు దర్శకత్వంలో రోజూ మనకు మహాద్భుతమైన సినిమాను చూపిస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. దళితులకు ద్రోహం జరుగుతుందని టీవీ చానెల్స్ డిబేట్లు పెడుతున్నాయన్నారు. ఎందకు పనికిరాని కొంతమంది టీడీపీ నేతలు టీవీల ముందుకు వచ్చి విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. నిజానికి టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయిస్తున్నారు. (చదవండి : పల్లకి మోసే పనులు మాకు.. పల్లకిలో కూర్చునేది మీరు) అంతేగాక చంద్రబాబు ఈ దాడులపై దుష్ర్పచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లాని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కోర్టుల్లో కేసులు వేసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. త్వరలోనే మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ.60వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నాని వెల్లడించారు. -
నాగుపాము విషం తాగి బతికావా?: ఎమ్మెల్యే
సాక్షి, తాడేపల్లి: ఐఏఎస్‌లపై వచ్చిన హనీ ట్రాప్ కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణ బతుకంతా కుట్రలేనని విమర్శించారు. అమ్మ పాలు తాగుతూ బతికావా? నాగు పాము విషం తాగి బతికావా? అని ప్రశ్నించారు. విషసర్పంలా వెంటాడుతున్న ఆయన ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిరపర్చలేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా మద్దతు ఉందని తెలిపారు. కాగా "హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ" పేరుతో కలెక్టర్లపై ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు కథనం ప్రచురితమైంది. దీనిపై ఆగ్రహంతో పాటు ఆవేదనకు గురైన జిల్లా కలెక్టర్లందరూ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. తాజాగా వీరికి జోగి రమేష్ మద్దతు తెలిపారు. (తప్పుడు కథనంపై కలెక్టర్ల లీగల్ నోటీసు) ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "బ్రోకర్ వ్యవస్థకు ఆద్యుడు ఎవరు? అంటే.. నారా చంద్రబాబు నాయుడు అని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు. ఒకప్పుడు సైకిల్‌పై తిరిగే రాధాకృష్ణ ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈయన వ్యవస్థపై, బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్ముతున్నారు. ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వైస్రాయ్ హోటల్ హానీ ట్రాప్ చేయలేదా? రాధాకృష్ణ ఒక బ్రోకర్.. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కరోనా కష్టకాలంలోనూ జిల్లా కలెక్టర్లు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి 24 గంటలు కష్టపడుతున్నారు. అలాంటి వారిపై మీరు విషం చిమ్ముతున్నారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, శిఖండిల్లా అడ్డు పడుతున్నారు. 25 ఏళ్ళ పాటు వైస్సార్ సీపీ అధికారంలో ఉంటుంది, రాధాకృష్ణ నీ కోరలు పీకుతాం. ఈరోజు ఐఏఎస్ అధికారులు, సివిల్ సర్వెంట్స్‌పై వెనకుండి విషపు రాతలు రాయిస్తున్న రాధాకృష్ణ, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి. సివిల్ సర్వెంట్లకు మేము అండగా ఉంటాము" అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. (గుండెల నిండా జనం అజెండా) -
బీజేపీపై మీ ప్రేమ బాబును రక్షించేందుకే..
సాక్షి, అమరావతి : గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, ఆయన కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇప్పుడు బీజేపీపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. అందుకే ఏపీలో బీజేపీ ఎదగడం లేదంటూ తెగ ఫీలవుతూ విశ్లేషణలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ బీజేపీపై ప్రేమతో కాదని, పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబును, టీడీపీని రక్షించే ప్రయత్నమని చిన్న పిల్లలకూ ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాధాకృష్ణకు ఓ బహిరంగ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. లేఖలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావునుద్దేశించి మీరు రాసిన విశ్లేషణలో చంద్రబాబును జీవీఎల్ విమర్శించడం మా పార్టీకే మంచిది కాదని తెలిపారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయకత్వమే కట్టడి చేయాలని సెలవిచ్చారు. ► మీరు టీడీపీకి సలహాదారుడిగా, అనుకూలంగా పనిచేస్తారని ప్రజల్లో వినికిడి. మరి ఇంత బహిరంగంగా, నిర్లజ్జగా పత్రికను అడ్డంపెట్టుకుని మా పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేంటి? ► మీ రాజకీయ సలహాలు చంద్రబాబుకే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకు పరిమితమవడంలో మీ పాత్ర ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే టీడీపీకి సలహాలిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుంచి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. ► మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో మా పార్టీ జాతీయ నాయకత్వానికి మీరు సెలవిచ్చారు. ఈ విశ్లేషణలో అసలు మతలబేంటో త్వరలోనే వారికి వివరిస్తాను. -
ఆ కథనం.. ఓ నేరపూరిత కుట్ర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కె.శ్రీనివాసరెడ్డి శనివారం ఆమోద బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెడ్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావులకు లీగల్ నోటీసు పంపారు. నేరపూరిత కుట్ర.. ‘ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకే దురుద్దేశపూర్వకంగా ‘న్యాయ దేవతపై నిఘా’ పేరుతో కథనం ప్రచురించారు. ఈ కథనం వెనుక నేరపూరిత కుట్ర ఉంది. ఈ దురుద్దేశపూర్వక కథనం పరువు నష్టం కిందకు వస్తుంది. ఈ కథనంలో రాసిన వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు ఏవీ కూడా ఆంధ్రజ్యోతి ఆరోపించిన చర్యలకు పాల్పడలేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయాలన్న ముందస్తు కుట్రతోనే ఈ కథనాన్ని రచించారు. ప్రభుత్వం ఏకంగా న్యాయవ్యవస్థపై నిఘా వేసినట్లు తెలిస్తోంది.. అన్న వ్యాఖ్యం మీ దుష్ట ఆలోచనలకు నిదర్శనం. దీనిని బట్టి చూస్తే ఈ కథనం వెనుక ఎంతో లోతైన కుట్ర ఉందని అర్థమవుతోంది. రాష్ట్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే... మీరు మీ కథనంలో రాసిన ప్రతీ అంశాన్ని కూడా ప్రభుత్వం నిస్సందేహంగా తోసిపుచ్చుతోంది. మీ ఎజెండా ప్రకారం క్రియాశీలకంగా నడుచుకునే వ్యక్తులతో కలిసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్రలో భాగంగా ఈ కథనాన్ని ప్రచురించారు. ఈ కథనాన్ని ప్రచురిస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని తెలిసే మీరు ఈ పనిచేశారు. వాస్తవాల ఆధారంగా కథనాలు ప్రచురించాల్సింది పోయి, సంబంధం లేని వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని లాగి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై నేరారోపణలు చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి... రాజకీయ ఎజెండా ఉన్న వ్యక్తులు, శక్తులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో పలుచన చేయాలన్న ఉద్దేశంతో ఈ అసత్య కథనాన్ని వండివార్చారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థల, సంస్థల స్వతంత్రతను, స్వయం ప్రతిపత్తిని కాపాడే బాధ్యతను ఈ ప్రభుత్వం సక్రమంగా నెరవేరుస్తోంది. ప్రభుత్వ కొన్ని నిర్ణయాలపై న్యాయస్థానం ఇచ్చిన కొన్ని తీర్పులను కావాల్సిన విధంగా ఎంపిక చేసుకుని, వాటి ఆధారంగా ప్రభుత్వంపై నిందారోపణలు చేశారు. కొందరు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం నిఘా పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ఎజెండాలో భాగంగానే ఈ కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంపై వెంటనే బేషరతు క్షమాపణలు చెప్పాలి. లేనిపక్షంలో ప్రభుత్వం తీసుకునే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి.’ అని శ్రీనివాసరెడ్డి తన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు నోటీసులు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పూరిత వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలకు శనివారం నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె శ్రీనివాస్‌కు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. అసత్య వార్తలతో కథనాలు ప్రచురిస్తే సహించేది లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా, ఆంద్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కుట్రపూరితంగా అగాధం పెంచేందుకు కొన్ని రాజకీయ శక్తుల ముసుగులో ఒక వర్గం మీడియా పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏబీఎస్, టీపీ-5లో అవాస్తవ కధనాలను ప్రసారం చేశారని, దీనిపై ఆ రెండు సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ మూర్తులపై నిఘా అంటూ ప్రచురించిన వార్త ఒక పక్కా ప్రణాళికతో నేరపూరితంగా జరిగిన కుట్రలో భాగమేనని ప్రభుత్వం భావిస్తోంది. (ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్ సీరియస్) -
‘ఏబీఎన్’పై వెంటనే చర్యలు తీసుకోండి
సాక్షి, తాడిపత్రి: ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా పార్టీ పటిష్టతను దెబ్బతీసి తద్వారా తన పరువుకు భంగం వాటిళ్లే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఏబీఎన్ ఛానల్, యాజమాన్యంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఈమేరకు తన అనుచరుల ద్వారా శుక్రవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరుకోవడంతో శాసన సభ్యుని హోదాలో జూలై 27న జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అయితే కార్యక్రమం పూర్తయిన తర్వాత తన స్వగ్రామమైన యల్లనూరు మండలం తిమ్మంపల్లికి బయలుదేరి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు అయితే జూలై 28 తేదీన జలహారతి కార్యక్రమానికి సంబంధించి ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా తన వాహనంపై దాడి చేశారంటూ పదే పదే వీడియోలను ప్రసారం చేసి తన గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేశారన్నారు. అలాగే వైఎస్సార్సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నించారన్నారు. పార్టీలో వర్గవిభేదాలున్నాయని, ఘర్షణలు జరిగాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసిన ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాక్రిష్ణ, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బి.సురేష్, స్థానిక ఛానల్ రిపోర్టర్ ఎ.వెంకటరమణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. (పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్ బెయిల్) -
మత కలహాలు సృష్టించేందుకు కుట్ర
తిరుపతి సెంట్రల్: రాష్ట్రంలో మత కలహాలను సృష్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుట్రలు పన్నుతున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం తొత్తుగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, టీటీడీ పాలక మండలిని వేలెత్తి చూపడానికి ఏ కారణాలు లేకపోవడంతో కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిపై స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలిసి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేతిలో పత్రిక ఉందని తప్పుడు వార్తలను ప్రచురిస్తే ఉపేక్షించేది లేదని ఆంధ్రజ్యోతిని హెచ్చరించారు. టీటీడీపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడితే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ వెబ్సైట్లో ‘యేసయ్య‘ అనే పదమే లేదని స్పష్టం చేశారు. టీటీడీ క్యాలెండర్లో గానీ, వెబ్సైట్లో గానీ ఆ పదం ఉంటే చూపాలని సవాల్ విసిరారు. సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరతాం ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్టశక్తులు అన్యమత ప్రచారం పేరుతో గందరగోళం సృష్టిస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇటీవల కొండ మీద శిలువ ఉందంటూ ప్రతిపక్షం అసత్య ప్రచారం చేసిందన్నారు. విచారణలోదీని వెనుక ఉంది టీడీపీ సానుభూతిపరులేనని వెల్లడైందని గుర్తు చేశారు. బస్సు టిక్కెట్లపై కూడా ఇలాగే అసత్య ప్రచారం చేసిందని.. దీనిపై విచారణ చేయిస్తే అవి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించినవేనని తేలిందన్నారు. ఆన్లైన్ వేదికగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. టీటీడీ పంచాంగం మొదటి పేజీలో తెలుగులో ‘శ్రియై నమః’ అనే పదం కనిపిస్తుందని, ఇది గూగుల్ అనువాదంలో ‘శ్రీ యేసయ్య‘గా మార్పు చెంది ఉండవచ్చన్నారు. ఇది గూగుల్ తప్పే కానీ టీటీడీ పంచాంగంలో దొర్లిన తప్పు కాదన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి గూగుల్‌కు రిపోర్టు చేసి వివరణ కోరామని తెలిపారు. ఇప్పుడు ఆ పదం కనిపించడంలేదన్నారు. గూగుల్ తప్పులకు టీటీడీ ఎలా బాధ్యత వహిస్తుందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీటీడీ తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి పాల్గొన్నారు. -
ఇప్పుడు కిరసనాయిలు ఏం ‘పలుకు’తాడో...
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ‘మన నుడి, మన నది. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి. తర్వాత మీకు ప్యాకేజీఇచ్చే యజమాని కృష్ణానదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది’ అంటూ పవన్ ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఇంగ్లీష్ మీడియం బోధనకు తాను వ్యతిరేకం కాదని కుల పెద్ద చంద్రబాబు నాలుక మడతేశాక కిరసనాయిలు ఏం ‘పలుకు’తాడో. యూదు భాషలో రాసిన బైబిల్‌కు ఇంగ్లిష్‌కు ఏ సంబంధం లేదని సోషల్ మీడియాలో యువత జ్ణానోపదేశం చేశాక అర్థం చేసుకుని ఉంటాడా? ఇంకా చెత్త పలుకులు పేరుస్తూనే ఉంటాడా? అంటూ ప్రతిపక్ష నేతను ఉద్దేశించి విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
‘చంద్రబాబుకు మతి భ్రమించింది’
సాక్షి, అనంపురం(తాడిపత్రి) : అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య ఎద్దేవా చేశారు. సోమవారం భగత్‌సింగ్‌నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పైలా నరసింహయ్య మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో చేతులు కలిపి పత్రికల్లో పిచ్చిరాతలు రాయిస్తున్నాడని మండి పడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చారని, ఇందులో భాగంగానే 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నారు. అయితే సీఎం పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు లేఖరాయడం విడ్డూరంగా ఉందన్నారు. జనం బుద్ధి చెప్పినా చంద్రబాబు తన పద్ధతిని మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ^ సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం పట్టణాధ్యక్షుడు మనోజ్, నాయకులు రేగడి కొత్తూరు ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రజ్యోతికి ‘గుడా’ నోటీసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా స్పందించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 208/5ఎలో ప్రింటింగ్ ప్రెస్ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం గతేడాది 1.75 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభం కూడా చేసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచే పత్రికా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే, దీని నిర్మాణం కోసం డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అధికారుల నుంచి గానీ, ‘గుడా’ నుంచిగానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించలేదు. భవన ప్రధాన ముఖ ద్వారం రోడ్డు కాకుండా మరో రోడ్డు (పెరిఫెరల్ రోడ్) కూడా నిర్మించాల్సి ఉండగా.. ఇక్కడ అలాంటిదేమీ చేపట్టలేదు. ‘గుడా’ అధికారులపై ఆంధ్రజ్యోతి ఒత్తిళ్లు అక్రమ నిర్మాణాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అప్రమత్తమైంది. తమ భవనానికి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇవ్వాలని గుడా అధికారులపై ఒత్తిడి తెస్తోంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకోవాలని గుడా వర్గాలు చెప్పినా పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ కింద అయితే సుమారు రూ. 70 లక్షలు చెల్లించాల్సి వస్తోందని ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు గుడా అధికారులు ఈ నెల 25న ప్రొవిజినల్ ఆర్డర్ నోటీసు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతికి గుడా జారీ చేసిన నోటీసు -
చంద్రబాబుకు సాయి‘రా పంచ్‌లు..!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాయి‘రా హాష్‌టాగ్‌తో సెటైర్లు వేశారు. గతేడాది తిత్లీ తుపాన్ వచ్చినప్పుడు సహాక చర్యలు పూర్తి కాకుండానే ‘థాంక్యూ సీఎం సార్’ అని ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఫొని తుపాన్ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తాజగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, అయితే, థాంక్యూ సీఎం సార్ అనే బదులు థాంక్యూ సీఎస్ సార్ అని ప్రజలు అంటారేమోనని బాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. బాబు గంతులేస్తున్నారు.. ‘అధికారులను బెదిరించడానికి, ఓట్ల లెక్కింపు రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఈవీఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో?’ అంటూ ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ దాసరి రాజా మాస్టర్ జీత భత్యాలను అయాచితంగా పెంచడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ జీతభత్యాలను రూ.50 వేల నుంచి రెండు లక్షలకు పెంచడం నీతి మాలిన చర్య కాదా చంద్రబాబూ?’ అని ప్రశ్నించారు. గతేడాది నుంచి రాజాకు 24 లక్షలు బకాయి పడ్డామని, వాటిని చెల్లించాలని ఏప్రిల్19న ఉత్తర్వులు ఇచ్చావ్. మీ హెరిటేజ్ కంపెనీలో అయితే ఉద్యోగుల జీతాలను ఇలా 200% పెంచుతారా?’ అని చురకలంటించారు. (చదవండి : దాసరి రాజాకు చంద్రబాబు నజరానా) -
ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో బుధవారం సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని వెల్లడించారు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పేవరకు ఉద్యోగులు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ప్రసారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం పునర్నిర్మాణానికి పని గంటలతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉద్యోగులపై రాధాకృష్ణ వ్యాఖ్యలు అభ్యంతరకరంగానూ, అవమానకరంగానూ ఉన్నాయన్నారు. అనంతరం శ్రీలంకలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల ధర్నా
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాచౌక్‌లో ఉద్యోగ సంఘాల నేతలు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో 8.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాధాకృష్ణ దారుణ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి, పని గంటలతో సంబంధం లేకుండా, వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్‌లు, జన్మభూమి కార్యక్రమాలు, ఇతరత్రా ప్రభుత్వ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అవమానకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. 'రాధాకృష్ణ వ్యాఖ్యలను కనీసం సీఎం ఖండించలేదు. సీఎం స్థాయి వ్యక్తి ఉద్యోగులకు భరోసా కల్పించాలి. ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇష్టమొచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి భజన సంఘాలుగా మారాయి. కొంతమంది ఉద్యోగులను ధర్నాలకు రాకుండా బెదిరించారు. మహిళా అధికారిపై దాడి చేసిన చింతమనేనికి సీఎం వత్తాసు పలికడమే కాకుండా మళ్లీ టికెట్ ఇచ్చారు. బ్లాక్ మనీ రాజకీయాలతో ఏబీఎన్ రాధాకృష్ణ విర్రవీగుతున్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని, మనో ధైర్యాన్ని దెబ్బతీసిన రాధాకృష్ణ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు. ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ సందర్భంగా చంద్రబాబు, రాధాకృష్ణ ఉద్యోగులపై ఎంత విషం నింపుకున్నారో తేటతెల్లమైన విషయం తెలిసిందే. ‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాం గానీ..’ అని చంద్రబాబు అనగానే.. రాధాకృష్ణ ‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా! ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలు ఇవ్వడానికా జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దేవద్దు. తీసేయండి’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా చంద్రబాబు ‘మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. వాళ్లను (ఉద్యోగులను) కూడా లాగాలి కదా?’ అని ఉద్యోగుల విషయంలో తన దుర్బుద్ధి ఏమిటో చంద్రబాబు బయటపెట్టారు. -
బాబు, రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 24వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ధర్నాచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో 8.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాధాకృష్ణ దారుణ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయని చెప్పారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి, పని గంటలతో సంబంధం లేకుండా, వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్‌లు, జన్మభూమి కార్యక్రమాలు, ఇతరత్రా ప్రభుత్వ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అవమానకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై రాధాకృష్ణ ఇంతవరకూ స్పందించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహావేశాలు రగిలిస్తోందన్నారు. రాధాకృష్ణ ఉద్యోగులపై వాడిన పదజాలం వల్ల ప్రతి ఉద్యోగి ఆత్మాభిమానం దెబ్బతిందన్నారు. అంతేకాకుండా ఉద్యోగ వర్గాల ప్రతినిధి రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై కొందరు రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రతి ఉద్యోగి ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని, మనో ధైర్యాన్ని దెబ్బతీసిన రాధాకృష్ణ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 24న ధర్నా చౌక్ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమానికి ఆత్మాభిమానం గల ఉద్యోగులందరూ హాజరు కావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. -
పైకి కపట ప్రేమ.. లోన కాలకూట విషం
సాక్షి,అమరావతి: ‘ఆదర్శ రాజకీయాలు నావి. నీతి, నిజాయితీలే ఊపిరిగా బతుకుతున్నా. నేను నిప్పులాంటి వాణ్ణి. దేశంలో ఎవరూ చేయనివిధంగా ఆస్తుల్ని ఏటా ప్రకటిస్తున్న ఆదర్శ రాజకీయవేత్తను. నాకు కులాలు, మతాలు ఉండవు. అందరూ, అన్ని ప్రాంతాలూ సమానమే. ప్రపంచానికే పాఠాలు చెప్పేవాడిని’ ఇటీవల కాలంలో ఏ టీవీలో చూసినా ఈ మాటలు వినిపిస్తున్నాయి. ఏ పత్రిక తిరగేసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇన్ని నీతులు వల్లెవేసే ఈ నాయకుడిలోని మరో స్వరూపం కూడా అప్పడప్పుడు బయటకు కనిపిస్తుంటుంది. పైకి గొప్పవాడిలా కనిపిస్తూ.. ప్రపంచానికే ఆదర్శ పురుషుడినని చెప్పుకునే ఈయన అసలు నైజం అనుకోకుండానే ఒక్కోసారి బయటపడుతూ ఉంటుంది. తాను బయటకు వల్లె వేసేది సూక్తులు, ఆదర్శాలు. లోపల చేసేది కుట్రలు, కుతంత్రాలు అనేది స్పష్టంగా తెలిసిపోతుంటుంది. విషపూరితమైన తన అసలు నైజాన్ని యథాలాపంగా బయట పెట్టేస్తుంటారు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అన్నట్టు పైకి బిల్డప్ ఇస్తూ.. లోపల మాత్రం కుట్రలు చేసే ఈ నాయకుడు ఎవరో కాదు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. బయటకు ప్రేమ ఒలకబోస్తూ.. లోపల విషం కక్కే వారికి ఓటు వేయాలా? నిండైన మనసుతో ప్రేమను పంచేవారికి ఓటు వేయాలా ! ప్రతి ఒక్క ఓటరూ నిర్ణయించుకోవాల్సిన క్షణాలు ఇవే. ఆ.. నా కొడుకులకు జీతాల కోసమా.. ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ సందర్భంగా చంద్రబాబు, రాధాకృష్ణ ఉద్యోగులపై ఎంత విషం నింపుకున్నారో తేటతెల్లమైంది. ‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాం గానీ..’ అని చంద్రబాబు అనగానే.. రాధాకృష్ణ ‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా! ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలు ఇవ్వడానికా జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దేవద్దు. తీసేయండి’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా చంద్రబాబు ‘మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. వాళ్లను (ఉద్యోగులను) కూడా లాగాలి కదా?’ అని ఉద్యోగుల విషయంలో తన దుర్బుద్ధి ఏమిటో చంద్రబాబు బయటపెట్టారు. బయట ఇలా.. ‘ప్రభుత్వ నిర్ణయాలను, కార్యక్రమాలను అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం సంతోషంగా.. గౌరవప్రదంగా పనిచేసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాం. యంత్రాంగం సమర్థవంతంగా పని చేసినప్పుడే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరతాయి. ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే యంత్రాంగం సహకారం ఎంతైనా అవసరం’ ఇది ఉద్యోగుల విషయమై మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశం. పైకి లిబరల్గా కనిపించాలి.. తర్వాత మేనేజ్ చేయాలి సంక్షేమ పథకాల విషయంలో కూడా చంద్రబాబు బయటకు చెప్పేది ఒకటి. లోపల భావం వేరొకటి. ఇటీవల సామాజిక పెన్షన్లను రూ.2వేలకు పెంచడం, పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు ఖర్చు చేశారు. పెద్ద కొడుకుగా ఆదుకుంటున్నానని పెన్షన్ల గురించి చెప్పుకున్నారు. అన్నగా అక్కచెల్లెమ్మలకు పసుపు–కుంకుమ ఇస్తున్నానంటూ ప్రేమను ఒలకబోశారు. ఇదీ అసలు స్వరూపం ఏబీఎన్ ఇంటర్వ్యూలోనే .. ‘నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు (సంక్షేమ పథకాల పేరిట) ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకాని వాణ్ణి అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏం చేశానంటే బిగినింగ్‌లో మరీ డిజాస్టర్‌గా ఉన్నప్పుడు రూ.పది వేలిచ్చాను. నేనేమంటానంటే.. నాలాంటి వాడు కాస్త లిబరల్గా కనబడకపోతే చాలా ప్రాబ్లెమ్స్ వస్తాయి. లిబరల్గా వచ్చిన తరువాత మేనేజ్ చేయడం.. ఎడ్యుకేట్ చేయడం ఈజీగా వచ్చేస్తాయి’ అని చంద్రబాబు సంక్షేమ పథకాల విషయంలో తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. వాడిపేరు తీసేయాలి పిల్లనిచ్చిన మామ, తండ్రితో సమానమైన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయనపై ఇప్పటికీ ఎంతటి విషం చిమ్ముతున్నారో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియో ద్వారా బట్టబయలైంది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం పేరు ఇంకా అదే ఉందా అని రాధాకృష్ణ అంటే చంద్రబాబు ‘వాడి (ఎన్టీఆర్) పేరు తీసేయాలి. పేరు మార్చాలి. మారుస్తున్నా’ అన్నారు. ఇంతకు ముందు కూడా చంద్రబాబు తెలుగుదేశం కరపత్రాలపై ఎన్టీ రామారావు బొమ్మను తీసేయగా.. పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైకి చెప్తారిలా... ‘తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మనకు ఆదర్శం. ఆయన ఆశయాల సాధనకు అందరూ కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్దాం. పేదలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్నదే అన్నగారి నినాదం. అదే మన లక్ష్యం. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందుకు వెళ్దాం’ పార్టీ సమావేశాలు, ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు చేస్తున్న ప్రతిజ్ఞ. ఎన్టీ రామరావుకు భారతరత్న ఇచ్చేలా మహానాడులో ఏటా తీర్మానాలు ఆమోదిస్తూనే ఉంటారు. ముందు హామీ ఇద్దాం.. తర్వాత చూద్దాం.. రైతుల విషయంలో ఇలా.. ‘రైతే దేశానికి వెన్నెముక. వ్యవసాయం గిట్టుబాటుకాక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించడం వ్యవసాయ రంగ సంక్షోభానికి దర్పణం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకుంటాం. అందుకే వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేయనున్నాం. రుణమాఫీ వ్యవసాయ రంగానికి కొంత ఉపశమనం మాత్రమే’ 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అన్న మాటలివి. లోపలి మనిషి ఇలా.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ సందర్భంలో రాధాకృష్ణ, చంద్రబాబు అనుకోకుండా మనసులోని అసలు సంగతులను బయటపెట్టారు. ‘రైతుల రుణమాఫీ చేస్తానన్నాను. ఎంత చేస్తానో.. అసలు చేయాలో వద్దో తరువాత డిసైడ్ చేసుకోవచ్చు. ముందు హామీ ఇద్దాం’ అంటూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ సంచలనం రేపుతోంది. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు? లోపలి మనిషి బయటకొచ్చినప్పుడు.. ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఎంత చులకన భావం ఉందో ఇటీవల బయట పెట్టుకున్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు. డబ్బులు లేకపోతే. అందరూ సంపన్న వర్గంలోనే పుట్టాలనుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలను ఏలవచ్చనుకుంటారు’ అంటూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై చులకన భావాన్ని బయట పెట్టుకున్నారు. పైకి మాత్రం ఇలా.. ‘ఎస్సీ, ఎస్టీలు అనాదిగా చాలా వెనుకబడి ఉన్నారు. అంటరానితనం పోవాలి. రెండు గ్లాసుల విధానం ఇప్పటికీ అమలవుతోంది. ఇది అమానుషం. మనుషు లంతా సమానమే. సమాజంలో అగ్రవర్ణాలతో సమానంగా వారినీ పైకి తీసుకురావడమే నా లక్ష్యం. చదువుల్లో ముందుండాలి. అన్నిరంగాల్లో వారిని పైకి తీసుకువచ్చే బాధ్యత నాది’ అసెంబ్లీలో.. అంబేడ్కర్ స్మృతివనం శంకుస్థాపన సమయంలో చంద్రబాబు చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలివి. తోలు తీస్తా.. తోకలు కత్తిరిస్తా ఎస్టీల్లో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని జిల్లాల పర్యటన సందర్భంగా ఆయనను కలిసి విన్నవించిన మత్స్యకారులపై చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీ తోలు తీస్తా. తమాషాలు చేస్తున్నారా?’ అని హూంకరించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బందితో వారందరినీ బయటకు నెట్టేయించారు. ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులు కనీస వేతనాలు ఇవ్వాలని వేడుకున్నందుకు వారినీ అవమానించారు. ‘సచివాలయంలోకి వచ్చి తమాషాలు చేయాలనుకుంటున్నారా. తోకలు కత్తిరిస్తా ఏమనుకుంటున్నారో. మీకు వేతనాలు పెంచేది లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ అవమానించారు. రాయలసీమ గూండాలు 2014 ఎన్నికల సమయంలో విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్కువ్యతిరేకంగా ప్రచారం చేయిస్తూ రాయలసీమ గూండాలు వచ్చారని ఆ ప్రాంత ప్రజలను అవమానించారు. కాపు రిజర్వేషన్ల సందర్భంగా ముద్రగడ పద్మనాభం తునిలో సభ పెట్టినప్పుడు విధ్వంసానికి తెరతీయించి దాని వెనుక సీమ, పులివెందుల గూండాలు ఉన్నారని వ్యాఖ్యానించారు. కపట ప్రేమ ఇలా.. ఇటీవల కడప జిల్లా పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబు తన కపట ప్రేమను ఒలకబోశారు. ‘సీమ ప్రాంత బిడ్డగా గర్విస్తున్నా, సీమలోనే మళ్లీ జన్మించాలని కోరుకుంటున్నా’ అన్నారు. నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ ఓట్లు వేయరా నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ‘నేను వేసిన రోడ్లపై నడుస్తూ, నేనిచ్చే పెన్షన్ల డబ్బు తింటూ.. నాకు ఓటు వేయరా’ అని వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత టీడీపీలో చేరిన సందర్భంగా.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆమె పలు సమస్యల పరిష్కారానికి నా వద్దకు వచ్చినా వేరే పార్టీకి చెందిన వ్యక్తి కనుక ఆ పనులు చేయనని చెప్పేశా’ అని తన కుత్సిత బుద్ధిని బయటపెట్టారు. వాచీలేదు.. ఉంగరమూ లేదు రాజకీయాల్లో తన అంత నీతిమంతుడు లేడన్నట్టుగా చంద్రబాబు కలరింగ్ ఇస్తుంటారు. పేదల సంక్షేమం, వారి అభ్యున్నతే తన ధ్యేయమంటారు. అవినీతి, అక్రమాలకు తాను ఎంతో దూరమని వ్యాఖ్యానిస్తూ.. ‘కావాలంటే చూసుకోండి. నా చేతికి వాచీ లేదు. వేలికి ఉంగరమూ లేదు. ఉదయం ఒక ఇడ్లీ.. రాత్రి రెండు చపాతీలు మాత్రమే తీసుకుంటా’ అని గొప్పలు చెబుతుంటారు. నిజంలోకి వెళితే.. వాస్తవంలోకి వెళితే చంద్రబాబు చేసే అవినీతి, అక్రమాలు అన్నీఇన్నీ కావు. ఇటీవల ఆయన దగ్గర పనిచేసిన నలుగురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు అవినీతి ఏస్థాయిలో జరుగుతోందో వివరాలతో సహా వెల్లడించారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు రూ.6 లక్షల కోట్ల మేర దోపిడీ చేశారు. ఎన్నికల్లో ఖర్చు కోసం వందలాది కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.40 కోట్లు ఇప్పటికే పంపిణీ చేయించారు. మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? ప్రత్యేక హోదాకు బదులు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించిన చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘హోదాకు మించిన ప్రయోజనాలు ప్యాకేజీ ద్వారా కేంద్రం కల్పిస్తామంటోంది. ప్యాకేజీతోనే అన్నీ వస్తున్నప్పడు హోదా మనకెందుకు? కోడలు మగపిల్లాడిని కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా? మగబిడ్డను కని ఇస్తానంటే అంతకన్నా మంచిదేముంటుంది? ఆడపిల్లల కన్నా మగపిల్లల్ని కనటమే మంచిద’ని వ్యాఖ్యానించి మహిళా లోకంపై తన చులకన భావాన్ని బయట పెట్టుకున్నారు. తెరముందు ఇలా.. ‘మహిళలంటే నాకెంతో గౌరవం ఉంది. సమాజం పురోగతి సాధించాలంటే మహిళల పాత్ర ఎంతో ముఖ్యం. పురుషులతో పోలిస్తే మహిళలు ఎందులోనూ తీసిపోరు. అవకాశం వస్తే వారికన్నా ముందుకు దూసుకుపోతారు. సమాజంలో సగానికిపైగా మహిళలున్నా అందుకు తగ్గ అవకాశాలు వారికి దక్కడం లేదు’ అంటూ ప్రపంచ మహిళా దినోత్సవం సాక్షిగా చంద్రబాబు అన్న మాటలివి. భన్వర్‌లాల్‌కు రోజాతో అక్రమ సంబంధం అంటగట్టమన్నారు గతం ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ నిష్పక్షపాతంగా ఉంటూ.. చంద్రబాబు అక్రమాలకు అడ్డుకట్టేవేసేవారు. దీన్ని జీర్ణించుకోలేక నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఆయనకు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నట్టు ప్రచారం చేయా లని వీడియో కాన్ఫరెన్సుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు చంద్రబాబు ఆదేశించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాతో అక్రమ సంబంధం అంటగట్టండన్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ విషయాలను బయటపెట్టారు. తాను చెప్పేవి అబద్ధమైతే చంద్రబాబు మనుమడు దేవాన్‡్షపై ప్రమాణం చేయాలని కూడా ఆమంచి సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి దీనిపై ఎలాంటి స్పందనా లేదు. శవ రాజకీయాలకు పెట్టింది పేరు కేసీఆర్‌ను బూచిగా చూపిస్తూ ఈ ఎన్నికల్లో సెంటిమెంట్‌ను రాజేసి ఓట్లు దండుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఆయనలోని మరో పార్శా్వన్ని పరిశీలిస్తే.. ‘రోడ్డు ప్రమాదంలో తన బావమరిది హరికృష్ణ చనిపోతే ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. హరికృష్ణ శవం పక్కనే పెట్టుకుని టీఆర్ఎస్నేత, కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌తో ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరిపారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలసి పోటీ చేస్తామని, పొత్తులు కుదుర్చుకుందామని ప్రతిపాదించారు. దానికి కేసీఆర్, కేటీఆర్ నిరాకరించారు. హరికృష్ణ శవం ఉందన్న కనీస స్పృహ కూడా లేకుండా చంద్రబాబు అక్కడే శవ రాజకీయాలకు దిగారు. మాట మారుస్తారిలా.. ‘రాష్ట్రంపై పెత్తనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు. వైఎస్ జగన్‌కు మద్దతు ఇస్తూ.. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నారు. పోలవరంపై కేసులు వేసి అది పూర్తి కాకుండా కుట్రలు చేస్తున్నారు’ ఇటీవల కాలంలో చంద్రబాబు తరచూ చేస్తున్న విమర్శలు ఇవి. -
ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది?
‘ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా...? ‘ఆ.. నా కొడుకులకు’ జీతాలివ్వడానికా? జనం ట్యాక్స్‌లు (పన్నులు) కట్టేది? వద్దు వద్దు... పక్కన పెట్టేయండి... వద్దే వద్దు తీసేయండి. – ఆంధ్రజ్యోతి ఎమ్డీ రాధాకృష్ణ నువ్వు చెప్పినవన్నీ (ఉద్యోగుల విషయంలో) ముమ్మాటికీ నిజాలే. కానీ వారిని కూడా లాగాలి కదా.. మనకు అధికారం ముఖ్యం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. –ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎమ్‌డీల మధ్య ఈ మేరకు జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే వీడియో ‘సాక్షి’కి దొరికింది. దాన్ని ఒకసారి చూస్తే.. చంద్రబాబు – రాధాకృష్ణ సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చిద్విలాసంగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ‘ఆ .. నా కొడుకులు’ అని రాధాకృష్ణ దుర్భాషలాడినా.. అలా అనడం తప్పని చంద్రబాబు అనకపోవడం గమనార్హం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేమని, అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వాలని సీఎం చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత ఉదారంగా ఉంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చని అన్నారు. రుణమాఫీ హామీ కూడా అధికారం కోసమే ఇచ్చామంటూ మనసులో మాట చెప్పేశారు. వీడియోలో ఏముందంటే.. ముఖ్యమంత్రి: ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ.... రాధాకృష్ణ: ఏందీ? ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు ? నాన్ ప్లాన్ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఇదీ అంతే. రెండూ ఒకటే. ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా? జనం ట్యాక్స్‌లు కట్టేది. అది వద్దు. వద్దే వద్దు తీసేయండి. సీఎం: అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా? రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం. సీఎం: కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. దాని కోసం... ఇంట్రెస్టింగ్ అంశం చెబుతా. నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్‌లో మరీ డిజాస్టర్స్‌గా ఉన్నప్పుడు పది వేలిచ్చాను. చూస్తే నాదగ్గర అంత ఉండదు. మార్చుకున్నా 5 వేలిచ్చా. అంత కూడా ఉండదు. దీంతో రూ. 2,000 ఒక ఇది చేసి 1,300 మందికి ఇచ్చా. వాళ్లను చూసినప్పుడు భయంకరమైన పరిస్థితి. నేనేమంటానంటే బిగినింగ్ లో నాలాంటి వాడు కాస్త లిబరల్గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లిబరల్గా వచ్చిన తర్వాత మేనేజ్ చేయడం , ఎడ్యుకేట్ చేయడం ఈజీగా వచ్చేస్తాయి. దటీజ్ వేర్ అయాం సేయింగ్... రాధాకృష్ణ:ఇప్పుడు అడ్రస్ చేయగలిగింది కూడా ఏమీ లేదులే సీఎం: రుణమాఫీ చేస్తానన్నాను. చేస్తాను. ఎంత చేస్తాను? తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. అట్లా చేయాలి. రైతు చాలా డిస్ట్రెస్‌లో ఉన్నాడు. గిట్టుబాటు ధరలు లేవు. రాధాకృష్ణ: ఇంక ఎంత సేపుంది? సీఎం: ఫ్యామిలీది కూడా ఎక్స్పోజ్ చేయడం అవసరమా? అవసరమేమిటని? రాధాకృష్ణ: సింపుల్‌గా చెప్పి తేల్చేయండి ఏముందీ? సీఎం: నాకు కోరికలు లేవు. నాకు ఒక కొడుకు. వాడు చేసుకుంటున్నాడు. సీఎం: మొన్న నరేంద్రమోదీ ఒకటే మాట్లాడారు. పార్టీ గురించి మాట్లాడలా. అతని గురించి మాట్లాడారు. అతనేమన్నారంటే.. నాకు ఓటేయండి. మీరేసే ఓటంతా నాకు వేసినట్లు అని మాట్లాడారు. అది నేను ఇంకా మాట్లాడలా. ఎందుకంటే ఈయన సోలో అనుకుంటారని...మోడరైట్ చేస్తున్నాను. రాధాకృష్ణ: మాట్లాడొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రికి అయ్యేవారు మీరు తప్ప ఎవరున్నారు? చంద్రబాబు ఆది నుంచి ఉద్యోగ వ్యతిరేకే... చంద్రబాబు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉద్యోగ వ్యతిరేకే. తొమ్మిదేళ్ల పాలనలో 31 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి ఉద్యోగులను రోడ్డున పడేశారు. పదో పీఆర్సీకి సంబంధించి 11 నెలల బకాయి రూ.5,200 కోట్లు ఉద్యోగులకు ఎగనామం పెట్టారు. మూడు డీఏలు పెండింగులో పెట్టారు. ఉద్యోగులను.. ‘‘ఏయ్? తోక కత్తిరిస్తా. ఉద్యోగం ఊడబెరుకుతా’’... అంటూ బెదిరించిన సంఘటనలు కోకొల్లలు. 2014 ఎన్నికల్లో తాను మారిన మనిషినని, ఉద్యోగుల పట్ల ప్రేమగా ఉంటానని, తనను నమ్మాలని చెప్పుకొచ్చారు. తీరా ఆధికారంలోకి వచ్చాక మళ్లీ తాను పాత మనిషినేనని చాటుకున్నారు. -
లీక్ అయిన బాబు-రాధకృష్ణల మరో వీడియో..
-
ఒళ్లంతా కుట్రలే!
ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుంది నందమూరి తారకరామారావు గురించి ఆయన అల్లుడు చంద్రబాబు, ఎబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో కళ్లారా చూసి ఎంతో బాధపడ్డాం. నిజంగా ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా ఉంది. రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్న ఆయన్ను ‘వాడు’ అని సంబోధించడం సరైంది కాదు. వీరికి పుట్టగతులు ఉండవు. – సిద్దేశ్వర, ఎన్టీఆర్ అభిమాని, ఉరవకొండ కుట్రదారుడని రుజువైంది ఎన్టీఆర్ జ్ఞాపకాలను పూర్తిగా ప్రజల హృదయాల్లో నుంచి చెరిపేయడానికి కుట్ర చేయడం బాధాకరం. ఏబీఎన్ వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడి ఉంటారు. అధికారం కోసం సొంత మామనే వెన్నుపొటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు అనేది దీని ద్వారా రుజువైంది. – డిష్ సురేష్, వజ్రకరూరు వీళ్లా పెద్ద మనుషులు? సీఎం చంద్రబాబు, ఏబీఎన్ వేమూరి రాధాకృష్ణ ఇద్దరూ తెర ముందు పెద్ద మనుషులుగా కనిపిస్తున్నారు. ఎప్పుడైతే ఎన్టీఆర్‌ను వాడు అని సంబోధించే స్థాయిలో వీరు ఉన్నారంటే ఎంత నీచమైన బుద్దో అర్థం చేసుకోవచ్చు. తెర వెనుక వీరు చేసిన నీచాన్ని సోషల్ మీడియా బయటపెట్టింది. ఇలాంటి వాళ్లని రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగేలా తరిమితరిమి కొట్టాలి. – నులక రామయ్య, ధర్మవరం నీచబుద్ధి బయటపడింది టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ని ‘వాడు’ అని చంద్రబాబు సంభోదించడం దారుణం. చంద్రబాబు నీచబుద్ధి బయటపడింది. బిడ్డనిచ్చిన మామనే ఇలా అవమానకరంగా మాట్లాడడం తెలుగుజాతికే సిగ్గుచేటు. ఓ వైపు ఎన్టీఆర్ అమర్‌రహే అంటూనే మరోవైపు ఇష్టంమెచ్చినట్లు మాట్లడడం బాబుకే చెల్లింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతాం. – జరిపటి మనోహర్, తనకల్లు బాబు అసలు రంగు బయటపడింది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అసలు రంగు బయటపడింది. ప్రభుత్వ పథకాల్లో ఆయన పేరు లేకుండా చేస్తానని చెప్పడం చాలా సిగ్గుచేటు. చంద్రబాబు రాజకీయ జీవితం ఎన్టీఆర్ ప్రసాదించిన భిక్ష. అలాంటి మహావ్యక్తిని తీవ్ర పదజాలంతో తిట్టడం అనైతికం. చంద్రబాబుకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు. – నాగరాజు, ఎన్టీఆర్ అభిమాని, అమ్మవారిపల్లి తరిమి తరిమి కొట్టాలి పిల్లనిచ్చిన మామను వాడు వీడు అంటూ సంబోధించిన సీఎం చంద్రబాబుని ఎన్టీఆర్ అభిమానులు తరిమి కొట్టాలి. పదవీ వ్యామోహంతో ప్రజలను ఇన్నాళ్లు మభ్యపెడుతూ వచ్చారు. చంద్రబాబు, వేమూరి రాధాకృష్ణ ఇద్దరూ తోడు దొంగలు. వీళ్ల నిజ స్వరూపం సోషల్ మీడియా బట్టబయలు చేసింది. తోక పత్రిక యజమానికి, చంద్రబాబుకు ఒళ్లంతా కుట్రలే అని తెలుస్తోంది. – శివారెడ్డి, పోతుకుంట, ధర్మవరం మండలం బాబుకు మహిళలంటే చిన్నచూపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలంటే చాలా చిన్న చూపు. మహిళ అనే గౌరవం లేకుండా నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో విపక్ష పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారితో ఓ మహిళా నేతకు అనైతిక సంబంధాన్ని అంటగట్టి ప్రచారం చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు ఆదేశించడం దారుణం. ప్రతి మహిళా ఈ విషయంగా చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి. – శ్రీవాణి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, శెట్టూరు -
ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దిన పత్రిక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌తో పాటు ఆ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సోమవారం క్రిమినల్ కేసు నమోదు అయింది. తనది కాని ‘వాయిస్’ను డబ్బింగ్ చేసి ఏబీఎన్ ఛానల్లో పదే పదే ప్రసారం చేస్తూ తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా, అసత్య ప్రచారం చేస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతీశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ నెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ సలహా అనంతరం పోలీసులు ఇవాళ... సెక్షన్లు 171సి, 171జీ, 171ఎఫ్, 469,505(2) కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. కాగా టీడీపీకి అమ్ముడుపోయిన వేమూరి రాధాకృష్ణ తన వాయిస్ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేయడంతో పాటు ఆంధ్రజ్యోతి దిన పత్రికలోనూ ప్రచురించి తన పరువు తీశారని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకృష్ణపై ఐపీసీ సెక్షన్ 120 (బి), సెక్షన్ 153 (ఏ), 171(సి) 171(హెచ్), 420, 123,125 రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ 1951 కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు. ఈ నెల 5వ తేదీన తనదికాని వాయిస్‌తో ఏబీఎన్ ఛానల్లో ఏపీ ప్రజలకు నిబద్ధత లేదు అన్నట్లుగా ప్రసారం చేసి తనతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని, శనివారం కూడా ఈ అంశంపై చర్చా వేదిక ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ చర్చావేదికలో పాల్గొన్నవారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఆధారాలు లేకుండా ప్రసారం చేసిన అంశంపైన తన వాయిస్‌ను డబ్బింగ్ చేసిన విధానంపై తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కుట్ర వెనక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించి తప్పుడు ప్రచారం చేశారని, తెలుగు ప్రజల మనోభావాలు దీని వల్ల దెబ్బతిన్నాయని ఆయన పేర్కొంటూ ఈ నెల 5,6 తేదీల్లో ఆ చానల్లో తనపై వచ్చిన ప్రసారాల ఆడియో టేపులను, ఈనెల 7న ఆంద్రజ్యోతి ప్రచురించిన కథనాన్ని విజయసాయిరెడ్డి ఫిర్యాదుకు జత చేశారు. చదవండి...: వారిద్దరిపై కేసు నమోదు చేయండి ఆంధ్రజ్యోతి వశీకరణ వార్తలు పట్టించుకోవద్దు! ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే! -
ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని, తమ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పూర్తి అర్థమైందని, అందుకే వైఎస్సార్సీపీ నేతలపై దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్లుగా చేసిన దోపిడీలకు సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా బాబుతోపాటు జైలుకు వెళ్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని, ఏపీ ప్రజలను తాను కించపరిచినట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ విషప్రచారం చేస్తోందని, దీనిపై ఈసీకి, సీఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాత్రికేయ విలువలను తుంగలో తొక్కుతున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌ను మూసివేయాలని ఫిర్యాదు చేస్తామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమాజానికి పట్టిన చీడ పురుగు రాధాకృష్ణ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఆంధ్రజ్యోతికి రూ.1,500 కోట్లు ‘‘చంద్రబాబు మాత్రమే కాదు.. గత ఐదేళ్లుగా దోపిడీకి సహకరించిన వారిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒక భాగస్వామి. చంద్రబాబుతోపాటు రాధాకృష్ణ లాంటి వ్యక్తులు జైలుకు వెళ్తారు. అధికారం చేజారుతుందని చంద్రబాబు రోజురోజుకీ అసహనానికి లోనవుతున్నాడు. అందుకే రాధాకృష్ణ తప్పుడు వార్తలు రాస్తే.. మరుసటి రోజే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికకు రూ.1,500 కోట్ల విలువైన ప్రకటనలు వచ్చాయి. ఇదికాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరో రూ.1500 కోట్ల సెటిల్మెంట్లు రాధాకృష్ణ చేశాడు’’అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే ‘‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లో నాపై తప్పుడు ప్రచారం చేశారు. మా పార్టీ అధ్యక్షుడి గురించి, ఏపీ ప్రజల గురించి కించపరుస్తూ మాట్లాడిన్నట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్లోనే వచ్చింది. కుట్రపూరితంగా దీన్ని ప్రసారం చేశారు. నేను ఏ రోజూ అలా మాట్లాడను. ఆ వాయిస్‌లోని కొన్ని పదాలు నాకు తెలియవు. అస్ట్రేలియాలోని ఓ వ్యక్తి ద్వారా మాట్లాడించి నాకు అంటగట్టారు. ఆ విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్థారిస్తుంది. ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే. అది ఒక కులానికి కొమ్ముకాస్తున్న పత్రిక. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతంలో కిరోసిన్, రేషన్ బియ్యం దొంగ. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. రాధాకృష్ణ నిజమైన జర్నలిస్టు అయితే ఆయన చానల్లో నాపై ప్రసారం చేసిన అంశాలను నిరూపించాలి. టీడీపీ ప్రయోజనాల కోసమే ఈ న్యూస్ ప్రసారం చేశారు. నిన్న లక్ష్మీపార్వతిపై, నేడు నాపై దుష్ప్రచారం చేశారు. రేపు ఇంకొక వైఎస్సార్సీపీ నేతపైనా ఇలాగే చేస్తారు. రాధాకృష్ణ ఒక కులానికి నాయకుడు. కుల పిచ్చి ఉన్న వ్యక్తి. సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయిన బాడుగ నేత రాధాకృష్ణ. చంద్రబాబుతో కలిసి ఆయన దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తాం. ఇక్కడ దుష్ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడి పోలీసులకు కూడా రాధాకృష్ణపై ఫిర్యాదు చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం’’అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకే..
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 650కి పైగా హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు 36 పేజీల టీడీపీ మ్యానిఫెస్టోను విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని, అధికారం పోతుందనే భయంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా మ్యానిఫెస్టోను విడుదల చేశారని, రాజన్న రాజ్యం మళ్లీ ప్రజలకు అందేలా ఈ మ్యానిఫెస్టో ఉందన్నారు. విజయసాయి రెడ్డి శనివారమిక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘ఇటీవల విశాఖలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు నాకు అండగా ఉండాలి. లేకపోతే నేను జైలుకు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు... గత అయిదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి సహకరించిన వారందరూ...ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు వెళతారు. విశాఖలో ఓ గర్భిణిపై వైఎస్సార్ సీపీ నేతలు దాడి చేశారని చంద్రబాబుతో పాటు ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలు ప్రచురిస్తున్నారు. అయితే విశాఖ పోలీసులు కూడా మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినా, చంద్రబాబు మాత్రం ఇంకా మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక లోక్‌నీతి సర్వే అంటూ బోగస్ ప్రచారం చేశారు. చివరికి లోక్‌నీతి సంస్థ కూడా ఆ సర్వే మాది కాదని ఖండించింది. దీంతో చంద్రబాబు, రాధాకృష్ణ మొహం మీద ఉమ్మినట్లు అయింది. ఈ నాలుగున్నరేళ్లలో ఇంచుమించు రాధాకృష్ణ.. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలతో పాటు వివిధ రూపాల్లో రూ.1500 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరో 1500 కోట్లకు సెటిల్మెంట్లు చేశారు. పత్రికాముఖంగా చెబుతున్నా. చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళతాడు. ఈరోజు.. ఆంధ్రజ్యోతిలో నేను మా పార్టీ అధ్యక్షుడిని కించపరిచేలా మాట్లాడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తూ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ చేసింది. ఆంధ్రజ్యోతి.. ఒక కులజ్యోతి పత్రిక మాత్రమే. ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తోంది. గతంలో రాధాకృష్ణ కిరోసిన్, రేషన్ బియ్యం దొంగ. ఒక దొంగకు ఇంతకన్నా మంచి ఆలోచనలు, ఐడియాలు వస్తాయా?. మానవతా విలువలు విడిచి...దుష్ప్రచారం చేస్తూ సమాజంలో మాట్లాడకూడనివి కూడా అసభ్యకరంగా ప్రసారం చేస్తున్నారు. వీటన్నింటిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. అంతేకాదు చట్టపరంగా కూడా ముందుకు వెళతా. రాధాకృష్ణ నిజమైన జర్నలిస్టు అయితే...నీ ఛానల్ టెలికాస్ట్‌లో ...వాయిస్‌ను నాదని నిరూపించు. నా వాయిస్ అందరికీ తెలుసు. కొంతమంది సామాన్య జనానికి తెలియకపోవచ్చనే ఉద్దేశంతో టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతోంది. నిన్న లక్ష్మీపార్వతి, ఈరోజు నా మీద, రేపు ఇంకొకరిపై ఇలాంటి అసత్య ప్రచారాలే చేస్తాడు. రాధాకృష్ణ జాతీయ నాయకుడివా? లేక దేశభక్తుడివా? కాదు...కాదు.. కాదు అని నేను స్పష్టంగా చెప్పగలను. సమాజానికి చీడ పురుగువి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తివి కావు. గతంలో మందకృష్ణ మాదిగను బాడుగ నేతగా నువ్వు అభివర్ణించావు. ఇప్పుడు నువ్వు కాదా బాడుగ నేతవి. నువ్వు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయావు. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న రాష్ట్ర సొమ్మును పైసాతో సహా కక్కిస్తాం. నీపై ఈసీకి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు ఫిర్యాదు చేస్తాం. ఆడియోలో ఆ వాయిస్ ఎవరిదన్నది...సీఎఫ్‌ఎల్‌సీకి నిర్థారణ చేసిన తర్వాతే అసలు విషయం తెలుస్తోంది. గతంలో ఓటుకు నోటుకు కేసులో ఉన్న వాయిస్ చంద్రబాబుదేనని స్పష్టం అయింది. మీరు ప్రసారం చేసినట్లుగా సన్నాయి నొక్కులు, దుర్యోధనుడు, దృతరాష్ట్రుడు, అనే పదాలు కూడా నాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడే అడిగి తెలుసుకున్నా.’ అని అన్నారు. -
ఆంద్రజ్యోతి కాదు.. అది కులజ్యోతి
-
అబద్ధాలు, వెన్నుపోట్లు బాబు పేటెంట్లు
సాక్షి, అమరావతి : అబద్ధాలు ఆడడం, వెన్నుపోట్లు పొడవడంలో చంద్రబాబునాయుడికి తప్ప మరెవ్వరికీ పేటెంట్ లేదని ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉందని, అందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ కొన్ని ఆడియోలను వినిపించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం తనకు ఇచ్చిన నోటీసుపై ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. పరుష పదజాలంతో ఆ ఛానల్ యజమానిని దుమ్మెత్తిపోశారు. ఆయ న ఏమన్నారంటే.. ‘ఇటీవల నేను తీసిన ఒక సినిమాకు సంబంధించి తెలుగుదేశం అభిమాని చేసిన ఫిర్యాదుపై స్వయంగా రమ్మని ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు అనారోగ్య కారణాలతో హాజరుకాలేనని లిఖితపూర్వక సమాధానం ఇచ్చా. దాన్ని కూడా ఆ ఛానల్ రాజకీయం చేసింది. పోసాని కృష్ణమురళి నడవలేని పరిస్థితుల్లో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కొన్ని ఛానళ్లలో వచ్చింది. వాటిల్లో ప్రత్యేకించి ఏబీఎన్‌లో చాలా ప్రముఖంగా వచ్చింది. నా ఆరోగ్యం బాగోలేదని.. ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని, డాక్టర్ ఎన్వీరావు ఇచ్చిన డయాగ్నసిస్ రిపోర్ట్‌ను జతచేసి వాళ్లకు పంపించా. ఎన్నికల కమిషన్ అంటే చాలా గౌరవం. ఆ గౌరవంతోనే నా పర్సనల్ రిపోర్టు కూడా పంపించా. కానీ, ఈ లేఖ ఏబీఎన్ వాళ్లకు చేరింది. దానిని వారు ట్విస్ట్ చేసి కాస్తంత మసాలా అద్దారు. ఎవరో కుటుంబరావంట.. ఆయనతో మాట్లాడించారు. దానికి ఆయన.. చంద్రబాబును పోసాని కులం పేరిట దూషించడం తప్పు, పోసానికి నిజంగా సీరియస్‌గా ఉంటే మేం సాయం చేస్తాం, అబద్ధమైతే ఆయనది మరింత పెద్ద నేరం అవుతుందని అన్నాడు. నేను కుటుంబరావును అడిగేదేమిటంటే.. ఎస్, నేను అన్నాను. చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉంది. అందుకు సాక్ష్యం నా వద్ద ఉంది. (చంద్రబాబు, చింతమనేని అన్న మాటల ఆడియోలను వినిపించారు). ఎస్టీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనవచ్చా. అందుకే చంద్రబాబుకు కులాభిమానం ఉందన్నాను. అందుకు కట్టుబడి ఉన్నాను. మరి దీని గురించి ఏబీఎన్ రాధాకృష్ణ అన్న ఎప్పుడైనా రాశాడా? అక్షరాన్ని వేశ్యగా మార్చి మీడియా వ్యభిచారం చేయకు రాధాకృష్ణ. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నావు. వెరీ కామన్ మెన్‌ను అయిన నా గురించి నేను అనని ఒక వార్తను నువ్వు తిప్పితిప్పి చెబుతావా.. ఐయామ్ ఏ క్లీన్ పర్సన్. ఎప్పుడూ అబద్ధం ఆడను. ఆడితే మీడియా ముందు ఒప్పుకుంటా. రాధాకృష్ణా నీది ఆ క్యారక్టర్ కాదు. నా కాళ్లూ చేతులు పడిపోయాయంటూ చెప్పావు. డాక్టర్ రిపోర్టులు ఇవిగో.. ఎంత మలుస్తావో మలుచుకో’.. అంటూ పోసాని సవాల్ చేశారు. బాబుగురించి ఎవరికి తెలీదు: సినిమాను నేనే చూడలేదు. ఫస్ట్ కాపీ రేపో ఎల్లుండో వస్తుంది, ఇందులో ఏముందంటే.. డబ్బుకు, మందుకు ఓటు అమ్ముడుపోవద్దు. కులానికి అమ్ముడుపోకండి అని ఉంది. ఎన్నికల కమిషన్‌ను సపోర్టు చేస్తూ తీసిన సినిమా ఇది. వాళ్లు ఆ సినిమా చూస్తే అభినందిస్తారు. చంద్రబాబును విమర్శించటానికి, ఆయన్ని అన్‌పాపులర్ చేయడానికి సినిమా తీయాలా? బాబు గురించి ఎవరికి తెలీదు. రాధాకృష్ణకు బాగా తెలుసు. ఆయన మనస్సు చంపుకుని బతికేస్తున్నాడు. మీడియా నీ చేతిలో ఉందని ఫుట్‌బాల్ ఆడుకుందామనుకుంటే నేను అంతకంటే పెద్ద బాల్‌తో కొడతా. మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా..’అని రాధాకృష్ణను కోరారు. నా జోలికి రాకు.. ‘అమ్మాయిలతో లోకేష్‌బాబు ఫొటోలు వచ్చినట్లుగా జగన్‌వి వచ్చాయనుకో.. ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్‌గా వస్తూ ఉండేది కదా.. నువ్వు నా జోలికి రాకు. నువ్వు ఎన్ని తిట్టినా చిరునవ్వుతో బయటకు వెళ్లడానికి నేను జగన్‌ను కాదు.. పోసాని కృష్ణమురళీని. నాలో తిట్లు మ్యానే కాదు. డాబర్ మ్యాన్ కూడా ఉన్నాడు. నా జోలికి రాకు రిక్వెస్ట్ చేస్తున్నా. -
నేను జగన్‌ను కాదు...పోసానిని..
సాక్షి, హైదరాబాద్ : ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై సినీనటుడు పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తనకు వచ్చిన నోటీసులపై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలపై ధ్వజమెత్తారు. ఏబీఎన్ రాధాకృష్ణ మానసిక రోగంతో బాధపడుతున్నారని, తనపై తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని పోసాని హెచ్చరించారు. తన తప్పు ఉంటే బహిరంగంగా చెబితే... సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్ని విమర్శలు చేసినా, తిట్టినా.. చిరునవ్వుతో సహించడానికి తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాదని....పోసాని కృష్ణమురళీని అని అన్నారు. ఇకనైనా బుద్ది తెచ్చుకో.. సిగ్గు తెచ్చుకో రాధాకృష్ణా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి....(నా గురించి అబద్ధాలు రాస్తావా.. రాధాకృష్ణా బుద్ధి తెచ్చుకో) ఆయన ఇంకా మాట్లాడుతూ... ‘రాధాకృష్ణ అన్నయ్య నువ్వంటే చాలా గౌరవం. గతంలో ఎప్పుడో నువ్వు .. అక్షరం ఆయుధంగా మారుస్తానని రాశావు. అయితే నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా ఫరవాలేదు కానీ... ఆ అక్షరాన్ని వేశ్యగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నాం. అబద్ధం చెప్పేవాడిని ఏమనాలి. లంగా...లోఫర్... దొంగా ...ఇంకా ఎక్కువే అనవచ్చు. మీడియా అంటే నువ్వు ఒక్కడవే కాదు. జర్నలిజం కోసం ప్రాణాలు అర్పించినవాళ్లు ఉన్నారు. చేతిలో మీడియా ఉంది కదా నువ్వు ఏమైనా చేసుకో. నాకు సంబంధం లేదు. చదవండి...(టీడీపీకి ఓటేస్తే రాష్ట్రం సర్వనాశనం) అయితే నా జోలికి మాత్రం రావద్దు. నేను ఏమైనా భూకబ్జాలు చేశానా?. బ్యాంకులు, ప్రభుత్వాలను మోసం చేశానా?. నా తప్పుంటే నిర్భయంగా చెప్పు. అంతేకాని నేను అనని మాటలు అన్నట్లు రాస్తే ఊరుకోను. నేను తిట్లమెన్నే కాదు. నాలో డాబర్ మెన్ కూడా ఉన్నాడు. నీ బతుకు .... నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని, ఇకనుంచి అయినా మనిషిగా బతకడం నేర్చుకో. మీడియా అంటే పక్షపాతంతో వ్యవహరించకూడదు. అయితే రాధాకృష్ణ మాత్రం అధికార పక్షానికి మిత్రపక్షంగా ఉంటాడు. రాధాకృష్ణకు చంద్రబాబు ఇష్టమైతే కాళ్లు నాకవచ్చు. నేను అనని మాటలు అన్నానని తప్పుడు వార్తలు రాయొద్దు. నాపై రాధాకృష్ణ ఎందుకు తప్పుడు వార్తలు రాశాడు?. నా సినిమాను ప్రజల కోసమే తీశాను. ఎన్నికల కమిషన్ వారికి అనుకూలంగా సినిమా తీశాను.’ అని అన్నారు. -
నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింతజీవి...
-
నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింతజీవి...
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై సోషల్ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే... ఆయనపై జాలేస్తోందని... సీఎం కుర్చీలో తాను ఉంటే ఓ గంట కూడా కూర్చోలేనని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తాను అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు. చంద్రబాబు వద్ద పనిచేసే అధికారులే ఆయన గురించి సరిగ్గా చెబుతారంటూ ఎద్దేవా చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి. నిన్న ఒకమాట...నేడు ఒకమాట.. మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదాపై ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నిన్న మోదీని ....నేడు రాహుల్ గాంధీని పొగుడుతారు. రాజధాని భూములను ఒక్కొక్కరికీ ఒక్కో రేటుకు ధారాదత్తం చేశారు. గ్రాఫిక్స్‌తోనే డిజైన్లు చూపుతూ కాలం గడుపుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం ఏళ్ల తరబడి జరుగుతోంది. ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదు. ఎన్నికల కోసం మేమే చేస్తామని ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారు. పోలీస్ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను ఆయన భ్రష్టు పట్టించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనే బాధ్యతను ఇంటెలిజెన్స్ ఐజీకి అప్పగించారు. ప్రతిపక్షంలో ఉన్నవారికి కాంట్రాక్టులు అప్పచెపుతామని ఐజీ ప్రలోభపెడుతున్నారు. స్పీకర్ వ్యవస్థను కూడా దిగజార్చేశారు. స్పీకర్ వ్యవస్థను తూట్లు పొడుస్తూ...ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజాన్ని నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో కడుతున్న ప్రాజెక్టుల్లో రాధాకృష్ణకు కమీషన్లు అందాయి. పట్టిసీమ ప్రాజెక్టుపై రాధాకృష్ణ వాస్తవాలు బయటపెట్టగలరా?. పట్టిసీమ, పోలవరం, హంద్రీనీవా పనుల్లో ఆయనకు ముడుపులు అందాయి. ప్రజలకు మేలు చేసేలా రాధాకృష్ణ జర్నలిజం లేదు.’ అని మండిపడ్డారు. -
రాధాకృష్ణపై పవన్ పదునైన సెటైర్లు!
-
రాధాకృష్ణపై పవన్ పదునైన వ్యంగ్యాస్త్రాలు!
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో టీడీపీ నేతల వద్ద అద్భుతమైన వ్యూహం ఉందని, దేశ ప్రధానమంత్రిని అత్యంత అసభ్య పదజాలంతో తిట్టడమే ఆ వ్యూహమని పవన్ ఎద్దేవా చేశారు. పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలను ఎత్తిచూపారు. టీడీపీ నేతలు ఇలా వ్యవహరించడం వెనుక ఉన్నది ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సలహా ఉందంటూ ముక్తాయించారు. టీడీపీ జ్యోతిరత్న ఆర్కే అంటూ రాధాకృష్ణకు చురకలు అంటించారు. ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు అందిరినీ తిట్టడమే టీడీపీ సంప్రదాయమని, ఇది కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ట్రైనింగేనని పవన్ మండిపడ్డారు. ఆర్కేగారూ మీరు చేస్తున్న దూషణను మేం భరిస్తాం. ఎందుకంటే మేం శక్తిలేనివాళ్లం, సాదాసీదావాళ్లం అంటూ పవన్ ఫ్యాన్స్‌పై ఏబీఎన్ చానెల్ పెట్టిన కేసును ప్రస్తావించారు. టాలీవుడ్లో తాజా పరిణామాలు, తన తల్లిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి దూషణ నేపథ్యంలో టీడీపీ అనుకూల మీడియా తీరుపై పవన్ కల్యాణ్ ట్విటర్లో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ బాసుల ప్రోత్బలంతోనే ఆ పార్టీ అనుకూల మీడియా కుట్రపూరితంగా తన తల్లిని తిట్టించిందని ఆయన ఆరోపిస్తున్నారు. TDP leaders has a great strategy to achieve “Special category Staus,” Abuse Prime Minister of India in the most Unparliamentary language. Who advised? Definitely, it must be RK. — Pawan Kalyan (@PawanKalyan) 22 April 2018 TDPJyothi Rathna,RK.. what is the culture of TDP, Abuse everyone.. Right from PM to Commoner. Good training, keep it up.👏👏👏 — Pawan Kalyan (@PawanKalyan) 22 April 2018 -
ఆంధ్రజ్యోతి ఎండీపై నాన్ బెయిలబుల్ వారంట్!
-
రాధాకృష్ణపై నాన్ బెయిలబుల్ వారంట్!
సాక్షి, హైదరాబాద్: మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో హైకోర్టు సానుకూల ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ మంగళవారం నాంపల్లి కోర్టు ఎదుట హాజరుకాలేదు. దీంతో రాధాకృష్ణ చర్యలను తీవ్రంగా పరిగణించిన 17వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. అనారోగ్యం వల్ల కోర్టుకు రాలేకపోయారంటూ ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతేకాక ఇది చాలా చిన్న కేసంటూ రాధాకృష్ణ తరఫు న్యాయవాదుల వాదనను సైతం కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఎటువంటి స్టే ఉత్తర్వులు ఇవ్వనప్పుడు తామిచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని, వాటిని గౌరవించకపోవడం ఎంత మాత్రం సరికాదంటూ వారంట్ జారీ చేసింది. అయితే పబ్లిషర్, ఎడిటర్‌తో పాటు ఇతర ఉద్యోగులు కోర్టు ఎదుట హాజరయ్యారు. వారి హాజరును నమోదు చేసుకున్న కోర్టు.. ఒక్కొక్కరు రూ.5 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని వారిని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిస్తే, అసత్యాలతో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువుప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగానూ రాధాకృష్ణతో పాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పబ్లిషర్, ఎడిటర్, మరో నలుగురు ఉద్యోగులు స్వయంగా కోర్టు ముందు హాజరై తీరాలంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై రాధాకృష్ణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు వీరి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణకు రాధాకృష్ణ సహా మిగిలిన వారందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. రాధాకృష్ణ హాజరు కావాల్సిందే.. రాధాకృష్ణ తప్పనిసరిగా కోర్టు ఎదుట హాజరు కావాల్సిందేనని తేల్చిచెబుతూ ఎన్బీడబ్ల్యూ జారీ ఉత్తర్వులకు న్యాయమూర్తి సిద్ధమయ్యారు. ఈ సమయంలో మళ్లీ రాధాకృష్ణ న్యాయవాది కల్పించుకుని ఇది చాలా చిన్న కేసని, ఎండీకి సంబంధం లేదంటూ పదేపదే చెప్పారు. ఒక్క నిమిషం ఆగాలని చెప్పిన న్యాయమూర్తి, ఎన్బీడబ్ల్యూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు. విచారణకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కాగా, రాధా కృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 11న విచారణ జరపనుంది. డాక్టర్ సర్టిఫికెట్ ఎక్కడ..? కేసు విచారణకు రాగానే.. రాధాకృష్ణకు అనారోగ్యంగా ఉన్నందున కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. ఈ మేరకు ఓ పిటిషన్‌ను న్యాయమూర్తికి అందజేశారు. దాని ని పరిశీలించిన న్యాయమూర్తి, అందులో డాక్టర్ సర్టిఫికెట్ లేకపోవడంపై ప్రశ్నించారు. ఇది చాలా చిన్న కేసని, ఎండీ హోదా లోని వారికి ఈ కేసు వర్తించదని రాధాకృష్ణ తరఫు న్యాయవాది చెప్పగానే.. అవన్నీ కేసు విచారణ సమయంలో చెప్పుకోవాలని న్యా యమూర్తి తేల్చి చెప్పారు. గతంలో ఇచ్చిం ది జ్యుడీషియల్ ఉత్తర్వులనే విషయం మీకు కూడా తెలుసుకదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో న్యాయవాది.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పగానే, ఎమ్మెల్యే ఆళ్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కల్పించుకుని.. హైకోర్టులో స్టే ఉత్తర్వులు రాలేదని గుర్తుచేశారు. దీనిపై న్యాయమూర్తి కల్పించుకుని.. హైకోర్టు స్టే ఉత్తర్వులు లేనప్పుడు గతంలో తామిచ్చిన జ్యుడీషియల్ ఉత్తర్వుల మేరకు నేటి విచారణకు హాజరు కావాలి కదా అని ప్రశ్నించారు. ఈ కేసు దాఖలు చేసే అర్హత ఎమ్మెల్యే ఆళ్లకు లేదని రాధాకృష్ణ న్యాయవాది చెప్పగా, ఆ విషయాలన్నీ కేసు విచారణ సమయంలో చెప్పుకోవాలని స్పష్టం చేశారు. -
రాధాకృష్ణకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ
-
వేమూరి రాధాకృష్ణకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణకు హాజరు కాలేనంటూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో రేపు (మంగళవారం) నాంపల్లి కోర్టుకు విచారణకు రాధాకృష్ణ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన కేసు విచారణకు రాధాకృష్ణతోపాటు ఎడిటర్, పబ్లిషర్, మరికొందరు మంది ఉద్యోగులు హాజరు కాకపోవడంపై నాంపల్లి కోర్టు మండిపడిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులను ఆదేశించింది. ఏపీకి ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, మంగళవారం నాటి విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ రాధాకృష్ణ, తదితరులను ఆదేశించింది. వ్యక్తిగత హాజరులో మినహాయింపు కోరుతూ రాధాకృష్ణ దాఖలుచేసిన క్వాష్ పిటిషన్‌ను నేడు విచారించిన హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. నాంపల్లి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు హైకోర్టు షాక్ -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కోర్టు తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణకు రాధాకృష్ణతోపాటు ఎడిటర్, పబ్లిషర్, మరికొందరు మంది ఉద్యోగులు హాజరు కాకపోవడంపై మండిపడింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరై తీరాల్సిందేనని ఎండీ రాధాకృష్ణ, ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ శేషగిరిరావు, మరో నలుగురు ఉద్యోగులను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు, వారికి సంబంధం ఏంటి? ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని, ఇందుకుగాను రాధాకృష్ణతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, మంగళవారం నాటి విచారణకు స్వయంగా హాజరు కావాలంటూ రాధాకృష్ణ తదితరులను ఆదేశించింది. అయితే, మంగళవారం నాటి విచారణకు వారు హాజరు కాకుండా తమ న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా తాము కోర్టు ముందు హాజరు కాలేపోతున్నామని అందులో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలకు, వీరికి ఏం సంబంధం ఉందంటూ ఆశ్చర్యపోయింది. ఈ సమయంలో రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ... ఫిర్యాదుదారు ఎమ్మెల్యే అని, ఆయనే న్యాయస్థానం ముందు హాజరు కాగా, అసెంబ్లీతో సంబంధం లేని వ్యక్తులు మాత్రం గైర్హాజరయ్యారని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తదుపరి విచారణకు వ్యక్తితంగా హాజరై తీరాలని రాధాకృష్ణ, శ్రీనివాస్, శేషగిరిరావు తదితరులకు తేల్చి చెప్పింది. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు
-
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో వైఎస్ జగన్‌పై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు.. ప్రతిష్టను దెబ్బ తీసినందుకు పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది. (కాగా ఆంధ్రజ్యోతి పత్రికలో.... అసత్యాలతో కూడిన, పరువుకు నష్టం కలిగేలా ప్రధాన మంత్రికి జగన్మోహన్రెడ్డి సమర్పించిన వినతిపత్రం విషయమై ‘అమ్మ జగనా..’ అంటూ మే 15న తప్పుడు కథనం ప్రచురించారు. వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు, అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాధలు, మిర్చి రైతుల దుస్థితి, ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి తదితర అంశాలపై వైఎస్ జగన్.. ప్రధాన మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అయితే జగన్మోహన్రెడ్డి తనపై నమోదైన కేసులకు సంబంధించి వినతిపత్రం సమర్పించినట్లు రాధాకృష్ణ ఆ కథనంలో రాయించారు. ఆ వినతిపత్రంలో గౌరవనీయులైన నరేంద్రమోదీ జీ అని సంబోధిస్తే, ఆంధ్రజ్యోతి మాత్రం ఎక్స్‌లెన్సీ (సర్వశ్రేష్ట) అని రాసినట్లు తన కథనంలో పేర్కొంది. ఈ కథనంపై వైఎస్సార్సీపీ పత్రికా సమావేశం పెట్టి వాస్తవాలను వివరించింది. ప్రధానమంత్రికి ఇచ్చిన వినతి పత్రాన్ని చూపించింది. అయితే ఈ విషయాలను తన పత్రికలో ప్రచురించని రాధాకృష్ణ.. ఆ కథనానికి కొనసాగింపుగా ‘పాత లేఖ పేరిట వైసీపీ కొత్తపాట’ అంటూ మరో కథనం వండి వార్చారు. జగన్.. ప్రధానిని కలవడం ఓర్చుకోలేకే రాధాకృష్ణ.. తన బృందం ద్వారా తప్పుడు కథనం రాయించి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఈ కథనం ప్రచురితం కావడానికి రాధాకృష్ణతో పాటు ఆ పత్రిక ఎడిటర్, ఏపీ, తెలంగాణ బ్యూరో ఇన్చార్జ్, ఓ రిపోర్టర్ బాధ్యులు. వీరందరికీ సమన్లు జారీ చేయాలి’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తదుపరి చర్యల్లో భాగంగా తొలుత ఆళ్ల వాంగ్మూలం నమోదు ఆదేశించిన విషయం విదితమే.) -
ఆంధ్రజ్యోతి ఎండీకి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
ఖమ్మం లీగల్: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) వేమూరి రాధాకృష్ణపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఖమ్మం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.సునీతారాణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పూసా నరేందర్ 2010 సంవత్సరంలో కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఖమ్మం కోర్టుకు బుధవారం రాధాకృష్ణ హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆయన రాకుండా ఇద్దరు న్యాయవాదుల ద్వారా ఇద్దరు పూచీదారులను హాజరుపరిచారు. దీంతో, ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ.. వచ్చే నెల 10వ తేదీకి కేసును కోర్టు వాయిదా వేసింది. వేమూరి రాధాకృష్ణపై పరువు నష్టం దావా వరంగల్ లీగల్: అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి లక్ష్యంగా తప్పుడు ప్రకటనలు ప్రచురించి ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం.. సమాజంలో తన గౌరవ మర్యాదలకు నష్టం కలిగించిందని మాజీ ఎమ్మెల్యే, వర్దన్నపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు బుధవారం మున్సిఫ్ మెజిస్ట్రేట్కోర్టు జడ్జి నసీమ్‌సుల్తానా ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అనం తరం సంబంధిత సాక్షుల విచారణ కోసం ఈ కేసును కోర్టు 20కి వాయిదా వేసింది. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్
నంద్యాల, న్యూస్‌లైన్: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ వేమూరి రాధాకృష్ణకు శుక్రవారం నంద్యాల జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేశారు. 2011లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ప్రకటన తన పరువుకు నష్టం కలిగించిందని నంద్యాల పట్టణానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించి రాధాకృష్ణ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని గతంలో ఆదేశించింది. అయితే రాధాకృష్ణ హాజరు కాకపోవడంతో మెజిస్ట్రేట్ నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. -
నిజాలను బుడమేరులో ముంచారు
‘యాక్టివ్ ప్లాంటు’పై వాస్తవాలను కప్పిపెట్టి తోక పత్రిక అబద్ధపు రాతలు ఈ ప్లాంటుకు అనుమతితో ఎన్టీటీపీఎస్కు దెబ్బ రోజూ 10 లక్షల యూనిట్ల ఉత్పత్తికి విఘాతం రెండు యూనిట్లలో ఉత్పత్తిని తగ్గించుకోక తప్పని పరిస్థితి ప్రభుత్వంపై ఏడాదికి రూ.127 కోట్ల అదనపు భారం వరదలు వస్తే నీటమునగనున్న 12 వేల ఎకరాల పంట భూములు సాక్షి, హైదరాబాద్: పచ్చ పత్రికకు పచ్చి నిజాలు కూడా పచ్చి అబద్ధాలుగానే కనిపిస్తున్నాయి! కఠోర వాస్తవాలను కప్పిపెట్టి కడుపు మంట బయటపెట్టుకుంది అబద్ధాల ఆంధ్రజ్యోతి! ఆ పత్రిక అధినేత రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంటుతో ఎవరికీ నష్టమే లేదని, పెపై చ్చు తమ ప్లాంటు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికే ఏడాదికి రూ.6 కోట్లు మిగులుతున్నాయని నిస్సిగ్గుగా అవాస్తవాలను తన పత్రికలో అలికేసింది. కానీ ఈ ప్లాంటుకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రభుత్వంపైనే ఏటా రూ.127 కోట్ల భారం పడే ప్రమాదం ఉందని, ఎన్టీటీపీఎస్ (నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్) రోజుకు ఏకంగా 10 లక్షల యూనిట్లు నష్టపోవాల్సి వస్తుందని జెన్కో, ఇంధన శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం 1.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రైవేటు ప్లాంటు కోసం భారీ థర్మల్ ప్లాంటు ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని, తద్వారా ప్రజలపై భారం తప్పద ని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్లాంట్‌తో 12 వేల ఎకరాలు నీట మునిగే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఎన్టీటీపీఎస్కు నష్టం ఇలా... నెలకు 10 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే యాక్టివ్ ప్లాంటు వల్ల జెన్కోకు చెందిన ఎన్టీటీపీఎస్ రోజుకు 10 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని నష్టపోనుంది. ఎన్టీటీపీఎస్ నుంచి విడుదల చేసే కూలింగ్ వాటర్‌ను ఈ ప్లాంటు నిలపడమే ఇందుకు కారణం. ఎన్టీటీపీఎస్లోని కండెన్సర్‌ను కూలింగ్ చేయడం కోసం కృష్ణా నది నుంచి జెన్కో నీరు తీసుకుంటుంది. కండెన్సర్‌ను కూలింగ్ చేసి న తర్వాత కాలువ ద్వారా బుడమేరులోకి ఆ నీటిని వదులుతుంది. ఇలా వదిలిన కూలింగ్ వాటర్‌పైనే ఈ ప్రైవేటు ప్లాంటు ఉంది. తన ప్లాంటులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చిన కూలింగ్ వాటర్‌ను యాక్టివ్ ప్లాంటు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్టీటీపీఎస్ వద్ద నీటిమట్టం 22.8 మీటర్ల కంటే ఎ క్కువ ఉండకూడదు. అయితే యాక్టివ్ ప్లాంటు నీటిని నిల్వ చేసుకుంటే ఎన్టీటీపీఎస్ కండెన్సర్ వద్ద నీటిమట్టం 23 మీటర్లకు పెరుగుతుంది. తద్వారా కండెన్సర్‌లో ఆవిరి వేడి తగ్గదు. కండెన్సర్‌ను చల్లబరిచిన తర్వాత వచ్చిన నీరు వచ్చినట్టే వెళ్లిపోవాలి. కానీ ఇక్కడ నీటి నిల్వ పెరిగి కండెన్సర్లోనే నిలిచిపోతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. రోజుకు 10 లక్షల యూనిట్ల విద్యుత్‌ను నష్టపోవాల్సి ఉంటుందని ఇంధనశాఖ వర్గాలే అంటున్నాయి. ఎన్టీటీపీఎస్ స్టేజ్-1కు చెందిన రెండు యూనిట్లు (ఒక్కొక్కటి 210 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తిపై దీని ప్రభావం పడుతుంది. మొదటి యూనిట్ ఉత్పత్తిని 185 మెగావాట్లకు, రెండో యూనిట్ ఉత్పత్తిని 190 మెగావాట్లకే పరిమితం చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 45 మెగావాట్ల విద్యుత్‌ను నష్టపోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు 10 లక్షల యూనిట్లు (ఎంయూ) అన్నమాట! ఎన్టీటీపీఎస్లో విద్యుత్ సామర్థ్యాన్ని తగ్గించి నడపాల్సి వస్తున్న విషయాన్ని పేర్కొంటూ చంద్రబాబు హయాంలోనే ప్రభుత్వానికి అప్పట్లో జెన్కో చైర్మన్ జంపాల పార్థసారథి లేఖ రాశారు. అయినా బాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నష్టాన్ని అంకెల్లోకి మార్చితే ఏడాదికి రూ.126 కోట్లు అవుతుందని ఇంధనశాఖ వర్గాలు ప్రాథమికంగా అంచనా కట్టాయి. జెన్కో ఉత్పత్తి చేసే యూనిట్ విద్యుత్ విలువ రూ.3.50. మార్కెట్ ధరల ప్రకారం రూ.6 కాకుండా రూ.3.50 చొప్పున లెక్కించినా రోజుకు 10 లక్షల యూనిట్లు అంటే రూ.35 లక్షలను జెన్కో నష్టపోతుంది. అంటే ఏడాదికి రూ.127.75 కోట్లు! ఈ మొత్తం భారం ప్రజలపైనే విద్యుత్ చార్జీల రూపంలోనే పడుతుంది. 2001 మార్చి 29 నుంచి 2001 జూలై 1 మధ్య కాలంలో 29.165 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను నష్టపోవాల్సి వచ్చిందని పార్థసా రథి లేఖలో తెలిపారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ లెక్కన సదరు ప్లాంటు నడిచిన పదేళ్లూ జెన్కో, ప్రజలు ఎన్ని వందల కోట్లు నష్టపోయూరో, ప్లాంటు వుూసేసిన ఆరేళ్లలో ఎన్ని వందల కోట్లు ఆదా అయ్యూయో అర్థం చేసుకోవచ్చు! ప్రత్యామ్నాయ కాలువతో ప్రభుత్వంపైనే భారం.. యాక్టివ్ ప్లాంటు కోసం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ కాల్వను తవ్వడం సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. కాల్వ నిర్మాణాన్ని చేయనున్న ప్రాంతంలో (బుడమేరు ఎడమవైపు) ప్రైవేటు భూములు, నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల భూ సేకరణ క్లిష్టమైన పని. నివాసిత ప్రాంతాల తరలింపు ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకే రోశయ్య హయాంలో నిపుణుల కమిటీ నివేదిక మేరకు ఎన్వోసీ పునరుద్ధరణకు ప్రభుత్వం నిరాకరించింది. ఈఎన్సీలు బీఎస్ఎన్ రెడ్డి, రెహమాన్, బీవీఎస్ ప్రకాశ్రావులతో పాటు అప్పటి పోలవరం సీఈ (ప్రస్తుత ఈఎన్సీ) వెంకటేశ్వరరావులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ప్లాంట్‌కు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది. బుడమేరు ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాతే ప్లాంట్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం ప్లాంట్‌కు అనుమతిలో ప్రధాన భూమిక పోషిం చిన ఈఎన్సీ (రిటైర్ అయిన తర్వాత పదవిని పొడిగించారు).. బుడమేరు ఎడమవైపు ఎలాంటి ప్రైవేట్ భూములు, ఇళ్లు లేవని నివేదిక ఇచ్చి.. తప్పుదోవ పట్టించారు. {పస్తుతం సూచిస్తున్న ప్రత్యామ్నాయ కాల్వను తవ్వడం ద్వారా ప్రభుత్వంపై అదనంగా సుమారు రూ.30 కోట్ల ఆర్థిక భారం పడనుందని అంచనా వేస్తున్నారు. కాల్వ పనుల్ని సదరు కంపెనీ చేసినప్పటికీ.. జాతీయ ర హదారులపై బ్రిడ్జీల నిర్మాణం, నీటి సరఫరాల, నియంత్రణకు అవసరమైన వెంట్స్, రెగ్యులేటర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉంది. ప్రభుత్వ భూమి లేనందున ప్రైవేటు భూమిని సేకరించడం ద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. అసలు ప్లాంట్ నిర్మాణమే నిబంధనలకు విరుద్ధం. అనుమతి ఒక చోట తీసుకుని ఇంకో చోట నిర్మాణం చేశారు. దీనికి ప్లాన్ కూడా అప్రూవ్ కాలేదు. 1998 ఏప్రిల్ 13న విడుదల చేసిన 532 జీవోలో ఈ ప్లాంట్‌ను వీటీపీఎస్‌కు చెందిన కూలింగ్ వాటర్ కెనాల్‌కు బుడమేరుకు జాతీయ రహదారి వైపున ఉన్న ఐలాండ్‌లో చేపట్టాలని సూచించారు. అయితే ఏకంగా రెగ్యులేటర్పైనే ఏర్పాటు చేసారు. గతంలో 80 మీటర్లు ఉన్న వెడల్పు ఇప్పుడు 50 మీటర్లకు తగ్గిపోయింది. ఇప్పుడు జారీ చేసిన జీవోలో కూడా ప్రభుత్వం ఐలాండ్‌లో ఈ పవర్ ప్లాంట్ ఉన్నట్లుగానే పేర్కొనడం విశేషం. రైతు బతుకులు బుడమేరే! సాక్షి, విజయవాడ: బుడమేరు వరదలొస్తే యాక్టివ్ ప్లాంటు కారణంగా తమ పొలాలు నీటమునగడం ఖాయమని రైతులు చెబుతున్నారు. వరద పెరిగినప్పుడల్లా పలు గ్రామాలతోపాటు, విజ యవాడ కూడా ముంపునకు గురి అవుతోంది. బుడమేరు పొంగినప్పుడు రాయనపాడు, పైడూరుపాడు, ఈలప్రోలు గ్రామాలకు చెందిన సుమారు 12 వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. -
నేడు చంద్రబాబు డిశ్చార్జి
ఆరోగ్యం మెరుగుపడిందన్న వైద్యులు రామోజీరావు పరామర్శ.. గంటకుపైగా ఏకాంతంగా మంతనాలు సాక్షి, హైదరాబాద్: ఇక్కడి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదే శం అధ్యక్షుడు చంద్రబాబునాయుడును వైద్యులు బుధవారం డిశ్చార్జి చేయనున్నారు. ఆయనకు బుధవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం లేదా సాయంత్రం డిశ్చార్జి చేస్తామని మంగళవారం రాత్రి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, కామెర్లు 80 శాతం తగ్గాయని ప్రకటించారు. అలాగే కాలేయం పనితీరు కూడా మెరుగైందని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చంద్రబాబు రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబును రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మంగళవారం పరామర్శించారు. ఆయనతో ఏకాంతంగా గంటసేపు మాట్లాడారు. సినీ నటుడు బాలకృష్ణ కూడా చంద్రబాబును పరామర్శించారు. టీడీపీ అధినేత ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుతూ పార్టీ హైదరాబాద్ నగర నేతలు ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. పార్టీ నేతలు పలువురు కూడా చంద్రబాబును పరామర్శించారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సోమవారం చంద్రబాబును కలిశారు. సీపీఐ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నారాయణ ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి కూడా బాబును పరామర్శించారు. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాధాకృష్ణ
తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా కథనాలను ప్రచురించారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు దాఖలు చేసిన కేసులో పరువునష్టం దావా కేసుల్లో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు అక్టోబరు 18కి వాయిదావేసింది. ఈ సందర్భంగా రాధాకృష్ణకు వ్యతిరేకంగా తెలంగాణ న్యాయవాదులకు నినాదాలు చేశారు. తప్పుడు కథనాలు ప్రచురించారని, వాటిపై వివరణ ఇవ్వాలంటూ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ‘త్యాగాల సెంటిమెంట్‌తో...భోగాల సెటిల్మెంట్’ శీర్షికన ఈఏడాది జూన్ 20న ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని ప్రచురించిందని, ఇదే విషయాన్ని ఏబీఎన్ ఛానల్ పదేపదే ప్రసారం చేసిందని, దీంతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని తెలిపారు. అమెరికా మంచి ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తనపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని ఆరోపించారు. ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు.