అబద్ధాలు, వెన్నుపోట్లు బాబు పేటెంట్లు  | Posani Hits Out At Vemuri Radhakrishna Of ABN Andhrajyothy | Sakshi
Sakshi News home page

అబద్ధాలు, వెన్నుపోట్లు బాబు పేటెంట్లు 

Published Fri, Mar 22 2019 1:44 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Posani Hits Out At Vemuri Radhakrishna Of ABN Andhrajyothy - Sakshi

సాక్షి, అమరావతి :  అబద్ధాలు ఆడడం, వెన్నుపోట్లు పొడవడంలో చంద్రబాబునాయుడికి తప్ప మరెవ్వరికీ పేటెంట్‌ లేదని ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉందని, అందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ కొన్ని ఆడియోలను వినిపించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం తనకు ఇచ్చిన నోటీసుపై ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. పరుష పదజాలంతో ఆ ఛానల్‌ యజమానిని దుమ్మెత్తిపోశారు. ఆయ న ఏమన్నారంటే..  

‘ఇటీవల నేను తీసిన ఒక సినిమాకు సంబంధించి తెలుగుదేశం అభిమాని చేసిన ఫిర్యాదుపై స్వయంగా రమ్మని ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు అనారోగ్య కారణాలతో హాజరుకాలేనని లిఖితపూర్వక సమాధానం ఇచ్చా. దాన్ని కూడా ఆ ఛానల్‌ రాజకీయం చేసింది. పోసాని కృష్ణమురళి నడవలేని పరిస్థితుల్లో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కొన్ని ఛానళ్లలో వచ్చింది. వాటిల్లో ప్రత్యేకించి ఏబీఎన్‌లో చాలా ప్రముఖంగా వచ్చింది. నా ఆరోగ్యం బాగోలేదని.. ఆపరేషన్‌ చేయించుకోవాల్సి ఉందని, డాక్టర్‌ ఎన్వీరావు ఇచ్చిన డయాగ్నసిస్‌ రిపోర్ట్‌ను జతచేసి వాళ్లకు పంపించా. ఎన్నికల కమిషన్‌ అంటే చాలా గౌరవం. ఆ గౌరవంతోనే నా పర్సనల్‌ రిపోర్టు కూడా పంపించా.

కానీ, ఈ లేఖ ఏబీఎన్‌ వాళ్లకు చేరింది. దానిని వారు ట్విస్ట్‌ చేసి కాస్తంత మసాలా అద్దారు. ఎవరో కుటుంబరావంట.. ఆయనతో మాట్లాడించారు. దానికి ఆయన.. చంద్రబాబును పోసాని కులం పేరిట దూషించడం తప్పు, పోసానికి నిజంగా సీరియస్‌గా ఉంటే మేం సాయం చేస్తాం, అబద్ధమైతే ఆయనది మరింత పెద్ద నేరం అవుతుందని అన్నాడు. నేను కుటుంబరావును అడిగేదేమిటంటే.. ఎస్, నేను అన్నాను. చంద్రబాబుకు కులపిచ్చి, కులగజ్జి ఉంది. అందుకు సాక్ష్యం నా వద్ద ఉంది. (చంద్రబాబు, చింతమనేని అన్న మాటల ఆడియోలను వినిపించారు). ఎస్టీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనవచ్చా. అందుకే చంద్రబాబుకు కులాభిమానం ఉందన్నాను. అందుకు కట్టుబడి ఉన్నాను. మరి దీని గురించి ఏబీఎన్‌ రాధాకృష్ణ అన్న ఎప్పుడైనా రాశాడా? అక్షరాన్ని వేశ్యగా మార్చి మీడియా వ్యభిచారం చేయకు రాధాకృష్ణ. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నావు. వెరీ కామన్‌ మెన్‌ను అయిన నా గురించి నేను అనని ఒక వార్తను నువ్వు తిప్పితిప్పి చెబుతావా.. ఐయామ్‌ ఏ క్లీన్‌ పర్సన్‌. ఎప్పుడూ అబద్ధం ఆడను. ఆడితే మీడియా ముందు ఒప్పుకుంటా. రాధాకృష్ణా నీది ఆ క్యారక్టర్‌ కాదు. నా కాళ్లూ చేతులు పడిపోయాయంటూ చెప్పావు. డాక్టర్‌ రిపోర్టులు ఇవిగో.. ఎంత మలుస్తావో మలుచుకో’.. అంటూ పోసాని సవాల్‌ చేశారు. 

బాబుగురించి ఎవరికి తెలీదు:  సినిమాను నేనే చూడలేదు. ఫస్ట్‌ కాపీ రేపో ఎల్లుండో వస్తుంది, ఇందులో ఏముందంటే.. డబ్బుకు, మందుకు ఓటు అమ్ముడుపోవద్దు. కులానికి అమ్ముడుపోకండి అని ఉంది. ఎన్నికల కమిషన్‌ను సపోర్టు చేస్తూ తీసిన సినిమా ఇది. వాళ్లు ఆ సినిమా చూస్తే అభినందిస్తారు. చంద్రబాబును విమర్శించటానికి, ఆయన్ని అన్‌పాపులర్‌ చేయడానికి సినిమా తీయాలా? బాబు గురించి ఎవరికి తెలీదు. రాధాకృష్ణకు బాగా తెలుసు. ఆయన మనస్సు చంపుకుని బతికేస్తున్నాడు. మీడియా నీ చేతిలో ఉందని ఫుట్‌బాల్‌ ఆడుకుందామనుకుంటే నేను అంతకంటే పెద్ద బాల్‌తో కొడతా. మరోసారి రిక్వెస్ట్‌ చేస్తున్నా..’అని రాధాకృష్ణను  కోరారు.  

నా జోలికి రాకు.. 
‘అమ్మాయిలతో లోకేష్‌బాబు ఫొటోలు వచ్చినట్లుగా జగన్‌వి వచ్చాయనుకో.. ఫ్రంట్‌ పేజీలో ఇప్పటికీ సీరియల్‌గా వస్తూ ఉండేది కదా.. నువ్వు నా జోలికి రాకు. నువ్వు ఎన్ని తిట్టినా చిరునవ్వుతో బయటకు వెళ్లడానికి నేను జగన్‌ను కాదు.. పోసాని కృష్ణమురళీని. నాలో తిట్లు మ్యానే కాదు. డాబర్‌ మ్యాన్‌ కూడా ఉన్నాడు. నా జోలికి రాకు రిక్వెస్ట్‌ చేస్తున్నా.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement