
సాక్షి, గుంటూరు: ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కాసేపట్లో గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు జిల్లా జైలుకు రిలిజింగ్ ఆర్డర్స్ చేరాయి. వాస్తవానికి నిన్ననే పోసానికి సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ష్యూరిటీ సమర్పణకు నిన్న సమయం లేకపోవడంతో ఆయన విడుదల కావడం ఆలస్యమైంది. తాజాగా ప్రక్రియలన్నీ పూర్తవటంతో జిల్లా జైలుకు విడుదల ఆర్డర్ వచ్చింది. దీంతో, కాసేపట్లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
కూటమి సర్కార్.. పోసానిపై అక్రమ కేసులు బనాయించిన విషయం తెలిసిందే. కక్ష సాధింపుతో పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 18 కేసులు నమోదు చేశారు. పిటీ వారెంట్ పేరుతో పోలీసులు.. ఆయన్ను రాష్ట్రమంతా తిప్పారు. దీంతో, ఆయన కోర్టును ఆశ్రయించగా.. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరైంది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు.. బెయిల్‌ను మంజూరు చేసింది. కాగా, బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన కోర్టు.. శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇక, పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా.. న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

ఫిబ్రవరి 26వ తేదీ అరెస్టు..
ఏపీ పోలీసులు ఫిబ్రవరి 26వ తేదీని పోసానిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం కూటమి సర్కార్ ఆదేశాలతో రోజుకో కేసు పెట్టి పోసానిని వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తూ తమ అహంకార పూరిత వైఖరిని ప్రదర్శిస్తోంది కూటమి ప్రభుత్వం. పోసానికి ఆరోగ్యం బాగోలేకపోయినా వరుస కేసులు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించింది.
Comments
Please login to add a commentAdd a comment