
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో టీడీపీ నేతల వద్ద అద్భుతమైన వ్యూహం ఉందని, దేశ ప్రధానమంత్రిని అత్యంత అసభ్య పదజాలంతో తిట్టడమే ఆ వ్యూహమని పవన్ ఎద్దేవా చేశారు. పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలను ఎత్తిచూపారు. టీడీపీ నేతలు ఇలా వ్యవహరించడం వెనుక ఉన్నది ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సలహా ఉందంటూ ముక్తాయించారు. టీడీపీ జ్యోతిరత్న ఆర్కే అంటూ రాధాకృష్ణకు చురకలు అంటించారు. ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు అందిరినీ తిట్టడమే టీడీపీ సంప్రదాయమని, ఇది కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ట్రైనింగేనని పవన్ మండిపడ్డారు. ఆర్కేగారూ మీరు చేస్తున్న దూషణను మేం భరిస్తాం. ఎందుకంటే మేం శక్తిలేనివాళ్లం, సాదాసీదావాళ్లం అంటూ పవన్ ఫ్యాన్స్‌పై ఏబీఎన్ చానెల్ పెట్టిన కేసును ప్రస్తావించారు.
టాలీవుడ్‌లో తాజా పరిణామాలు, తన తల్లిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి దూషణ నేపథ్యంలో టీడీపీ అనుకూల మీడియా తీరుపై పవన్ కల్యాణ్ ట్విటర్‌లో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ బాసుల ప్రోత్బలంతోనే ఆ పార్టీ అనుకూల మీడియా కుట్రపూరితంగా తన తల్లిని తిట్టించిందని ఆయన ఆరోపిస్తున్నారు.
TDP leaders has a great strategy to achieve “Special category Staus,” Abuse Prime Minister of India in the most Unparliamentary language. Who advised? Definitely, it must be RK.
— Pawan Kalyan (@PawanKalyan) 22 April 2018
TDPJyothi Rathna,RK.. what is the culture of TDP, Abuse everyone.. Right from PM to Commoner. Good training, keep it up.👏👏👏
— Pawan Kalyan (@PawanKalyan) 22 April 2018
Comments
Please login to add a commentAdd a comment