
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుమారుడు లోకేశ్ గురించి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళనగా మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో శనివారం రాధాకృష్ణను కలిసిన రేవంత్‌రెడ్డి పిచ్చాపాటి మాటల్లో లోకేశ్ ప్రస్తావన తీసుకురాగా.. తాను లోకేశ్ కోసం ఎంతో తిరిగానని రాధాకృష్ణ బదులిచ్చారు. దీంతో అతన్ని క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పమని రేవంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. తెలంగాణలో మీడియా అంతా కేసీఆర్ కంట్రోల్‌లో ఉందని.. ఏపీ మీడియాలో మాత్రం ఏబీఎన్, టీవీ–5 చానల్స్ ద్వారా లోకేశ్‌కు బాగా ప్రచారం కల్పిస్తున్నామని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment