చంద్రబాబు, రాధాకృష్ణ.. మరో వీడియో వైరల్‌ | Chandrababu Naidu ABN Radha Krishna Another Video Goes Viral on Social Media - Sakshi
Sakshi News home page

ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది?

Published Tue, Apr 9 2019 3:34 PM | Last Updated on Wed, Apr 10 2019 7:11 AM

Chandrababu and ABN Radhakrishna leaked second video goes viral - Sakshi

‘ఉద్యోగులకు సెంట్రల్‌ పీఆర్సీనా...? ‘ఆ.. నా కొడుకులకు’ జీతాలివ్వడానికా? జనం ట్యాక్స్‌లు (పన్నులు) కట్టేది?  వద్దు వద్దు... పక్కన పెట్టేయండి... వద్దే వద్దు తీసేయండి. 
– ఆంధ్రజ్యోతి ఎమ్‌డీ రాధాకృష్ణ  
నువ్వు చెప్పినవన్నీ (ఉద్యోగుల విషయంలో) ముమ్మాటికీ నిజాలే. కానీ వారిని కూడా లాగాలి కదా.. మనకు అధికారం ముఖ్యం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేం.
–ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎమ్‌డీల మధ్య ఈ మేరకు జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇదే వీడియో ‘సాక్షి’కి దొరికింది. దాన్ని ఒకసారి చూస్తే.. చంద్రబాబు – రాధాకృష్ణ  సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్‌ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చిద్విలాసంగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ‘ఆ .. నా కొడుకులు’ అని రాధాకృష్ణ దుర్భాషలాడినా.. అలా అనడం తప్పని చంద్రబాబు అనకపోవడం గమనార్హం. అధికారం లేకపోతే మనమేమీ చేయలేమని, అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వాలని సీఎం చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత ఉదారంగా ఉంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చని అన్నారు. రుణమాఫీ హామీ కూడా అధికారం కోసమే ఇచ్చామంటూ మనసులో మాట చెప్పేశారు. వీడియోలో ఏముందంటే..

ముఖ్యమంత్రి: ఉద్యోగులకు సెంట్రల్‌ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ....
రాధాకృష్ణ: ఏందీ?  ఉద్యోగులకు సెంట్రల్‌ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు ? నాన్‌ ప్లాన్‌ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా అంతే. ఇదీ అంతే. రెండూ ఒకటే.  ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా? జనం ట్యాక్స్‌లు కట్టేది. అది వద్దు. వద్దే వద్దు తీసేయండి. 

సీఎం: అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా? 
రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం.
సీఎం: కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం.  దాని కోసం... ఇంట్రెస్టింగ్‌  అంశం చెబుతా.  నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్‌లో మరీ డిజాస్టర్స్‌గా ఉన్నప్పుడు పది వేలిచ్చాను. చూస్తే నాదగ్గర అంత ఉండదు. మార్చుకున్నా  5 వేలిచ్చా. అంత కూడా  ఉండదు. దీంతో రూ. 2,000 ఒక ఇది చేసి 1,300 మందికి ఇచ్చా. వాళ్లను చూసినప్పుడు భయంకరమైన పరిస్థితి.  నేనేమంటానంటే బిగినింగ్‌ లో నాలాంటి వాడు కాస్త లిబరల్‌గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్‌ వస్తాయి. లిబరల్‌గా వచ్చిన తర్వాత మేనేజ్‌ చేయడం , ఎడ్యుకేట్‌ చేయడం ఈజీగా వచ్చేస్తాయి. దటీజ్‌ వేర్‌ అయాం సేయింగ్‌...

రాధాకృష్ణ:ఇప్పుడు అడ్రస్‌ చేయగలిగింది కూడా ఏమీ లేదులే
సీఎం: రుణమాఫీ చేస్తానన్నాను. చేస్తాను. ఎంత చేస్తాను? తర్వాత డిసైడ్‌ చేసుకోవచ్చు. అట్లా చేయాలి. రైతు చాలా డిస్ట్రెస్‌లో ఉన్నాడు. గిట్టుబాటు ధరలు లేవు. 
రాధాకృష్ణ: ఇంక ఎంత సేపుంది? 

సీఎం: ఫ్యామిలీది కూడా ఎక్స్‌పోజ్‌ చేయడం అవసరమా? అవసరమేమిటని?
రాధాకృష్ణ: సింపుల్‌గా చెప్పి తేల్చేయండి ఏముందీ?
సీఎం: నాకు కోరికలు లేవు. నాకు ఒక కొడుకు. వాడు చేసుకుంటున్నాడు. 
సీఎం: మొన్న నరేంద్రమోదీ  ఒకటే మాట్లాడారు. పార్టీ గురించి మాట్లాడలా. అతని గురించి మాట్లాడారు. అతనేమన్నారంటే.. నాకు ఓటేయండి. మీరేసే ఓటంతా నాకు వేసినట్లు అని మాట్లాడారు. అది నేను ఇంకా మాట్లాడలా. ఎందుకంటే ఈయన సోలో అనుకుంటారని...మోడరైట్‌ చేస్తున్నాను. 
రాధాకృష్ణ: మాట్లాడొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రికి అయ్యేవారు మీరు తప్ప ఎవరున్నారు?

చంద్రబాబు ఆది నుంచి ఉద్యోగ వ్యతిరేకే...
చంద్రబాబు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉద్యోగ వ్యతిరేకే. తొమ్మిదేళ్ల పాలనలో 31 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి ఉద్యోగులను రోడ్డున పడేశారు. పదో పీఆర్సీకి సంబంధించి 11 నెలల బకాయి రూ.5,200 కోట్లు ఉద్యోగులకు ఎగనామం పెట్టారు. మూడు డీఏలు పెండింగులో పెట్టారు. ఉద్యోగులను.. ‘‘ఏయ్‌? తోక కత్తిరిస్తా. ఉద్యోగం ఊడబెరుకుతా’’... అంటూ బెదిరించిన సంఘటనలు కోకొల్లలు. 2014 ఎన్నికల్లో తాను మారిన మనిషినని, ఉద్యోగుల పట్ల ప్రేమగా ఉంటానని, తనను నమ్మాలని  చెప్పుకొచ్చారు. తీరా ఆధికారంలోకి వచ్చాక మళ్లీ తాను పాత మనిషినేనని చాటుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement