ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో టీడీపీ నేతల వద్ద అద్భుతమైన వ్యూహం ఉందని, దేశ ప్రధానమంత్రిని అత్యంత అసభ్య పదజాలంతో తిట్టడమే ఆ వ్యూహమని పవన్ ఎద్దేవా చేశారు. పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలను ఎత్తిచూపారు. టీడీపీ నేతలు ఇలా వ్యవహరించడం వెనుక ఉన్నది ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సలహా ఉందంటూ ముక్తాయించారు.