నిజాలను బుడమేరులో ముంచారు | Andhrajyoti paper writes Unrealistic articles | Sakshi
Sakshi News home page

నిజాలను బుడమేరులో ముంచారు

Published Thu, Jan 30 2014 3:09 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

నిజాలను బుడమేరులో ముంచారు - Sakshi

నిజాలను బుడమేరులో ముంచారు

‘యాక్టివ్ ప్లాంటు’పై వాస్తవాలను కప్పిపెట్టి తోక పత్రిక అబద్ధపు రాతలు
 ఈ ప్లాంటుకు అనుమతితో ఎన్‌టీటీపీఎస్‌కు దెబ్బ
 రోజూ 10 లక్షల యూనిట్ల ఉత్పత్తికి విఘాతం
 రెండు యూనిట్లలో ఉత్పత్తిని తగ్గించుకోక తప్పని పరిస్థితి
ప్రభుత్వంపై ఏడాదికి రూ.127 కోట్ల అదనపు భారం
 వరదలు వస్తే నీటమునగనున్న 12 వేల ఎకరాల పంట భూములు

 
 సాక్షి, హైదరాబాద్: పచ్చ పత్రికకు పచ్చి నిజాలు కూడా పచ్చి అబద్ధాలుగానే కనిపిస్తున్నాయి! కఠోర వాస్తవాలను కప్పిపెట్టి కడుపు మంట బయటపెట్టుకుంది అబద్ధాల ఆంధ్రజ్యోతి! ఆ పత్రిక అధినేత రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంటుతో ఎవరికీ నష్టమే లేదని, పెపై చ్చు తమ ప్లాంటు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికే ఏడాదికి రూ.6 కోట్లు మిగులుతున్నాయని నిస్సిగ్గుగా అవాస్తవాలను తన పత్రికలో అలికేసింది.
 
  కానీ ఈ ప్లాంటుకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రభుత్వంపైనే ఏటా రూ.127 కోట్ల భారం పడే ప్రమాదం ఉందని, ఎన్‌టీటీపీఎస్ (నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్) రోజుకు ఏకంగా 10 లక్షల యూనిట్లు నష్టపోవాల్సి వస్తుందని జెన్‌కో, ఇంధన శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం 1.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రైవేటు ప్లాంటు కోసం భారీ థర్మల్ ప్లాంటు ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని, తద్వారా ప్రజలపై భారం తప్పద ని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్లాంట్‌తో 12 వేల ఎకరాలు నీట మునిగే ప్రమాదం కూడా పొంచి ఉంది.
 
 ఎన్‌టీటీపీఎస్‌కు నష్టం ఇలా...
     నెలకు 10 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే యాక్టివ్ ప్లాంటు వల్ల జెన్‌కోకు చెందిన ఎన్‌టీటీపీఎస్ రోజుకు 10 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని నష్టపోనుంది. ఎన్‌టీటీపీఎస్ నుంచి విడుదల చేసే కూలింగ్ వాటర్‌ను ఈ ప్లాంటు నిలపడమే ఇందుకు కారణం.
     ఎన్‌టీటీపీఎస్‌లోని కండెన్సర్‌ను కూలింగ్ చేయడం కోసం కృష్ణా నది నుంచి జెన్‌కో నీరు తీసుకుంటుంది. కండెన్సర్‌ను కూలింగ్ చేసి న తర్వాత కాలువ ద్వారా బుడమేరులోకి ఆ నీటిని వదులుతుంది. ఇలా వదిలిన కూలింగ్ వాటర్‌పైనే ఈ ప్రైవేటు ప్లాంటు ఉంది.
     తన ప్లాంటులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎన్‌టీటీపీఎస్ నుంచి వచ్చిన కూలింగ్ వాటర్‌ను యాక్టివ్ ప్లాంటు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌టీటీపీఎస్ వద్ద నీటిమట్టం 22.8 మీటర్ల కంటే ఎ క్కువ ఉండకూడదు. అయితే యాక్టివ్ ప్లాంటు నీటిని నిల్వ చేసుకుంటే ఎన్‌టీటీపీఎస్ కండెన్సర్ వద్ద నీటిమట్టం 23 మీటర్లకు పెరుగుతుంది. తద్వారా కండెన్సర్‌లో ఆవిరి వేడి తగ్గదు. కండెన్సర్‌ను చల్లబరిచిన తర్వాత వచ్చిన నీరు వచ్చినట్టే వెళ్లిపోవాలి. కానీ ఇక్కడ నీటి నిల్వ పెరిగి కండెన్సర్‌లోనే నిలిచిపోతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. రోజుకు 10 లక్షల యూనిట్ల విద్యుత్‌ను నష్టపోవాల్సి ఉంటుందని ఇంధనశాఖ వర్గాలే అంటున్నాయి.
 
     ఎన్‌టీటీపీఎస్ స్టేజ్-1కు చెందిన రెండు యూనిట్లు (ఒక్కొక్కటి 210 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తిపై దీని ప్రభావం పడుతుంది. మొదటి యూనిట్ ఉత్పత్తిని 185 మెగావాట్లకు, రెండో యూనిట్ ఉత్పత్తిని 190 మెగావాట్లకే పరిమితం చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 45 మెగావాట్ల విద్యుత్‌ను నష్టపోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు 10 లక్షల యూనిట్లు (ఎంయూ) అన్నమాట!
 
     ఎన్‌టీటీపీఎస్‌లో విద్యుత్ సామర్థ్యాన్ని తగ్గించి నడపాల్సి వస్తున్న విషయాన్ని పేర్కొంటూ చంద్రబాబు హయాంలోనే ప్రభుత్వానికి అప్పట్లో జెన్‌కో చైర్మన్ జంపాల పార్థసారథి లేఖ రాశారు. అయినా బాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
     ఈ నష్టాన్ని అంకెల్లోకి మార్చితే ఏడాదికి రూ.126 కోట్లు అవుతుందని ఇంధనశాఖ వర్గాలు ప్రాథమికంగా అంచనా కట్టాయి.
     జెన్‌కో ఉత్పత్తి చేసే యూనిట్ విద్యుత్ విలువ రూ.3.50. మార్కెట్ ధరల ప్రకారం రూ.6 కాకుండా రూ.3.50 చొప్పున లెక్కించినా రోజుకు 10 లక్షల యూనిట్లు అంటే రూ.35 లక్షలను జెన్‌కో నష్టపోతుంది. అంటే ఏడాదికి రూ.127.75 కోట్లు! ఈ మొత్తం భారం ప్రజలపైనే విద్యుత్ చార్జీల రూపంలోనే పడుతుంది.
     2001 మార్చి 29 నుంచి 2001 జూలై 1 మధ్య కాలంలో 29.165 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను నష్టపోవాల్సి వచ్చిందని పార్థసా రథి లేఖలో తెలిపారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ లెక్కన సదరు ప్లాంటు నడిచిన పదేళ్లూ జెన్‌కో, ప్రజలు ఎన్ని వందల కోట్లు నష్టపోయూరో, ప్లాంటు వుూసేసిన ఆరేళ్లలో ఎన్ని వందల కోట్లు ఆదా అయ్యూయో అర్థం చేసుకోవచ్చు!
 
 ప్రత్యామ్నాయ కాలువతో ప్రభుత్వంపైనే భారం..
     యాక్టివ్ ప్లాంటు కోసం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ కాల్వను తవ్వడం సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. కాల్వ నిర్మాణాన్ని చేయనున్న ప్రాంతంలో (బుడమేరు ఎడమవైపు) ప్రైవేటు భూములు, నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల భూ సేకరణ క్లిష్టమైన పని. నివాసిత ప్రాంతాల తరలింపు ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకే రోశయ్య హయాంలో నిపుణుల కమిటీ  నివేదిక మేరకు ఎన్‌వోసీ పునరుద్ధరణకు ప్రభుత్వం నిరాకరించింది.
     ఈఎన్‌సీలు బీఎస్‌ఎన్ రెడ్డి, రెహమాన్, బీవీఎస్ ప్రకాశ్‌రావులతో పాటు అప్పటి పోలవరం సీఈ (ప్రస్తుత ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ప్లాంట్‌కు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది. బుడమేరు ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాతే ప్లాంట్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
     అయితే ప్రస్తుతం ప్లాంట్‌కు అనుమతిలో ప్రధాన భూమిక పోషిం చిన ఈఎన్‌సీ (రిటైర్ అయిన తర్వాత పదవిని పొడిగించారు).. బుడమేరు ఎడమవైపు ఎలాంటి ప్రైవేట్ భూములు, ఇళ్లు లేవని నివేదిక ఇచ్చి.. తప్పుదోవ పట్టించారు.
     {పస్తుతం సూచిస్తున్న ప్రత్యామ్నాయ కాల్వను తవ్వడం ద్వారా ప్రభుత్వంపై అదనంగా సుమారు రూ.30 కోట్ల ఆర్థిక భారం పడనుందని అంచనా వేస్తున్నారు.
     కాల్వ పనుల్ని సదరు కంపెనీ చేసినప్పటికీ.. జాతీయ ర హదారులపై బ్రిడ్జీల నిర్మాణం, నీటి సరఫరాల, నియంత్రణకు అవసరమైన వెంట్స్, రెగ్యులేటర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉంది. ప్రభుత్వ భూమి లేనందున ప్రైవేటు భూమిని సేకరించడం ద్వారా ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది.
     అసలు ప్లాంట్ నిర్మాణమే నిబంధనలకు విరుద్ధం. అనుమతి ఒక చోట తీసుకుని ఇంకో చోట నిర్మాణం చేశారు. దీనికి ప్లాన్ కూడా అప్రూవ్ కాలేదు. 1998 ఏప్రిల్ 13న విడుదల చేసిన 532 జీవోలో ఈ ప్లాంట్‌ను వీటీపీఎస్‌కు చెందిన కూలింగ్ వాటర్ కెనాల్‌కు బుడమేరుకు జాతీయ రహదారి వైపున ఉన్న ఐలాండ్‌లో చేపట్టాలని సూచించారు. అయితే ఏకంగా రెగ్యులేటర్‌పైనే ఏర్పాటు చేసారు. గతంలో 80 మీటర్లు ఉన్న వెడల్పు ఇప్పుడు 50 మీటర్లకు తగ్గిపోయింది. ఇప్పుడు జారీ చేసిన జీవోలో కూడా ప్రభుత్వం ఐలాండ్‌లో ఈ పవర్ ప్లాంట్ ఉన్నట్లుగానే పేర్కొనడం విశేషం.
 
 రైతు బతుకులు బుడమేరే!
 సాక్షి, విజయవాడ: బుడమేరు వరదలొస్తే యాక్టివ్ ప్లాంటు కారణంగా తమ పొలాలు నీటమునగడం ఖాయమని రైతులు చెబుతున్నారు. వరద పెరిగినప్పుడల్లా పలు గ్రామాలతోపాటు, విజ యవాడ కూడా ముంపునకు గురి అవుతోంది. బుడమేరు పొంగినప్పుడు రాయనపాడు, పైడూరుపాడు, ఈలప్రోలు గ్రామాలకు చెందిన సుమారు 12 వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement