
సాక్షి, చిత్తూరు: ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు బినామీ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని ధ్వజమెత్తారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తప్పుడు వీడియోలు ప్రసారం చేశారని, రాజకీయ లబ్ధి కోసమే జరిగిందన్నారు. ఆ వీడియో ఇప్పుడు ఫేక్ అని తేలిందన్నారు. చంద్రబాబుతో కలిసి రాధాకృష్ణ ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం ఉండదన్నారు.
చదవండి: అందుకే వారికి కడుపు మంట: సీఎం జగన్
బీసీలకు చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తన గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేసిన రాధాకృష్ణ నా సవాల్ స్వీకరించలేదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణకు దమ్ముంటే ఇప్పటికైనా తన సవాల్ స్వీకరించాలని నారాయణస్వామి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment