ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏడుగురికి నాంపల్లి కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో వైఎస్ జగన్‌పై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు.. ప్రతిష్టను దెబ్బ తీసినందుకు పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు
Published Tue, Oct 3 2017 8:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement