
సాక్షి, కృష్ణా: విజయవాడ నగరంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద క్రిస్టియన్, దళిత సంఘాలు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పలు కథనాలను ఇచ్చిన ఏబీఎన్ ఛానెల్ ఛైర్మెన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. తప్పుడు కథనాలకు బాధ్యతవహిస్తూ.. క్షమాపణ చెప్పాలని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాధాకృష్ణ తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని కార్యాలయ సిబ్బందిని ఆందోళనకారులు హెచ్చరించారు.
చంద్రబాబుతో చేతులు కలిపిన రాధాకృష్ణ దళితులను, క్రైస్తవులను అవమాన పరుస్తున్నాడని రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనీల్ ఆరోపించారు. మూడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేసి ఆంధ్రజ్యోతి కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభింపచేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment