Christian communities
-
క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
-
ప్రజలు ప్రశాంతంగా ఉంటే చంద్రబాబు ఓర్వలేరు..
గుంటూరు: కులమతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు సామరస్యంగా మెలుగుతుంటే చంద్రబాబు ఓర్వలేరని క్రైస్తవ సంఘాల నాయకులు మండిపడ్డారు. క్రైస్తవులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మగౌరవ సభలో నాయకులు మాట్లాడుతూ.. క్రైస్తవులు మతమార్పిడులకు పాల్పడటం లేదని, అలా ఎక్కడైనా జరిగివుంటే రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ క్రైస్తవులను అవమానించిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. క్రైస్తవులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపిస్తామని వారు ధ్వజమెత్తారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. విగ్రహాలు ధ్వంసం చేసింది టీడీపీ వాళ్లేనని సాక్షాధారాలతో సహా రుజువైందని, దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వారు నిలదీశారు. ఆలయాలపై దాడుల కేసులతో క్రైస్తవులకు ఎటువంటి సంబంధం లేదని, తమను తప్పుగా చిత్రీకరిస్తున్న చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో చంద్రబాబును రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. విగ్రహాలు ధ్వంసానికి పాల్పడిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ బిషప్స్ కౌన్సిల్, పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ ఫోరం, తదితర క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫిలిప్ సి తోచర్‌కు బెదిరింపు కాల్స్.. ఇటీవల టీడీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. 38 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆయన.. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్‌లతో కలిసి పని చేశారు. పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని డీజీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ నెంబర్లను డీజీపీకి ఇచ్చానని తెలిపారు. కాగా, క్రైస్తవుల పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన
సాక్షి, కృష్ణా: విజయవాడ నగరంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద క్రిస్టియన్, దళిత సంఘాలు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పలు కథనాలను ఇచ్చిన ఏబీఎన్ ఛానెల్ ఛైర్మెన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. తప్పుడు కథనాలకు బాధ్యతవహిస్తూ.. క్షమాపణ చెప్పాలని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాధాకృష్ణ తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని కార్యాలయ సిబ్బందిని ఆందోళనకారులు హెచ్చరించారు. చంద్రబాబుతో చేతులు కలిపిన రాధాకృష్ణ దళితులను, క్రైస్తవులను అవమాన పరుస్తున్నాడని రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనీల్ ఆరోపించారు. మూడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేసి ఆంధ్రజ్యోతి కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభింపచేస్తామని ఆయన హెచ్చరించారు. -
‘ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచే విధంగా కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్ చానెల్‌పై క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. శనివారం రాత్రి ఛానెల్లో ప్రసారమైన ‘కిరాక్’ కార్యక్రమంలో యాంకర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నాయకులు ఆదివారం సాయంత్రం ఫిలింనగర్‌లోని చానెల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చానెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ రొంపిలోకి క్రైస్తవులను లాగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. క్రైస్తవులకు క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చానెల్ ప్రతినిధులకు లేఖ అందజేశారు. వివిధ సంఘాల నాయకులు శామ్యూల్ గౌరిపాగ, మలాకి, సాల్మన్‌రాజ్, సుందర్రాజు, కెన్నడి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారం అండతో చర్చి కూల్చివేత
చెరుకుపల్లి(రేపల్లె): టీడీపీ నాయకులు క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని కూల్చివేసిన ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం బలుసులపాలెంలో గురువారం జరిగింది. టీడీపీ నాయకుడు కొనకాల రవికిరణ్, మరి కొంతమంది సెవెన్త్‌డే చర్చిని కూల్చివేశారు. ఆ సమయంలో పాస్టర్ ఏసురత్నం ఒక్కరే చర్చిలో ఉన్నాడు. టీడీపీ నాయకులు ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగడంతో భయపడి పాస్టర్ చెరుకుపల్లికి పారిపోయారు. ఈ సమాచారం దళిత, క్రైస్తవ సంఘాల పెద్దలకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు చేరి ఆందోళన చేపట్టడానికి సిద్ధమవడంతో అధికారులు స్పందించారు. అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకులు కూలగొట్టిన చర్చి పునఃనిర్మాణాన్ని చేపట్టేలా దళిత, క్రైస్తవ సంఘాలతో చర్చలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. -
వర్ల రామయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలి
గాంధీనగర్ : టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రభుత్వాన్ని మోసగించి పేద దళితులకు కేటాయించే స్థలాన్ని అక్రమంగా పొందారని దళిత, క్రైస్తవ సంఘాల రాష్ట్ర నాయకుడు కామా దేవరాజు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళ వారం విలేకరులతో మాట్లాడారు. వర్ల రామయ్య 1983లో విజయవాడలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేశారన్నారు. ఆ సమయంలో పేద దళితుడినని చెప్పుకుని విద్యాధరపురం ఒకటో వార్డులో ఎన్టీపీఎస్ నం. 387/23పి, ఎల్పీ నం.14/83, ప్లాట్ నం. 20 నందు 253 చదరపు గజాలు స్థలాన్ని అక్రమంగా పొందారన్నారు. తాను సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత అధికారులను వివరాలు కోరగా, పేద దళితులకు కేటాయించే ఇంటి స్థలాన్ని 1983లో ఆయన పేరుతో పొందినట్లు అధికారులు ధ్రువీకరించి ఇచ్చారన్నారు. నిబంధనల ప్రకారం ఏ దళితుడికైనా కేవలం 90 చదరపు గజాల లోపు ఇళ్ల స్థలం కేటాయిస్తారన్నారు. రామయ్య తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, దళితుడినని చెప్పుకుని ఇంటి స్థలం పొందడమే కాకుండా పక్కన ఉన్న పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి ఆలయం నిర్మిం చారన్నారు. తన కుమారుడి పేర ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆల యంలో వచ్చే ఆదాయాన్ని తన సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. దీనికి స్పందించిన కోర్టు ఈనెల 13న దానిపై విచారణ చేపట్టాలని భవానీపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 25న భవానీపురం పోలీసులు వర్ల రామయ్యపై ఎఫ్ఐఆర్ నం. 202/2015తో సెక్షన్ 405, 420 కింద కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో వర్ల రామయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోలీసులపై వత్తిడి తెచ్చి కేసును తారుమారు చేయించే అవకాశం ఉందన్నారు. త్వరలో కలెక్టర్‌ను కలిసి వర్ల రామయ్య అక్రమంగా స్థలం పొందడం గురించి వినతి పత్రం అందజేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి టి.సుందర్ ప్రసాద్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.