
బలుసులపాలెంలో కూల్చివేసిన చర్చి
చెరుకుపల్లి(రేపల్లె): టీడీపీ నాయకులు క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని కూల్చివేసిన ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం బలుసులపాలెంలో గురువారం జరిగింది. టీడీపీ నాయకుడు కొనకాల రవికిరణ్, మరి కొంతమంది సెవెన్త్‌డే చర్చిని కూల్చివేశారు. ఆ సమయంలో పాస్టర్ ఏసురత్నం ఒక్కరే చర్చిలో ఉన్నాడు. టీడీపీ నాయకులు ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగడంతో భయపడి పాస్టర్ చెరుకుపల్లికి పారిపోయారు.
ఈ సమాచారం దళిత, క్రైస్తవ సంఘాల పెద్దలకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు చేరి ఆందోళన చేపట్టడానికి సిద్ధమవడంతో అధికారులు స్పందించారు. అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకులు కూలగొట్టిన చర్చి పునఃనిర్మాణాన్ని చేపట్టేలా దళిత, క్రైస్తవ సంఘాలతో చర్చలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment