
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ‘మన నుడి, మన నది. సినిమా టైటిల్లాగా అదిరిపోయింది. ముందు మీ నలుగురు పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించి నుడికారాన్ని మొదలు పెట్టాలి. తర్వాత మీకు ప్యాకేజీఇచ్చే యజమాని కృష్ణానదిని పూడ్చి నిర్మించిన కరకట్ట నివాసాన్ని తొలగించాలని ఆందోళన చేయాలి. అప్పుడు నదుల రక్షణ సఫలమవుతుంది’ అంటూ పవన్ ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.
అలాగే ఇంగ్లీష్ మీడియం బోధనకు తాను వ్యతిరేకం కాదని కుల పెద్ద చంద్రబాబు నాలుక మడతేశాక కిరసనాయిలు ఏం ‘పలుకు’తాడో. యూదు భాషలో రాసిన బైబిల్‌కు ఇంగ్లిష్‌కు ఏ సంబంధం లేదని సోషల్ మీడియాలో యువత జ్ణానోపదేశం చేశాక అర్థం చేసుకుని ఉంటాడా? ఇంకా చెత్త పలుకులు పేరుస్తూనే ఉంటాడా? అంటూ ప్రతిపక్ష నేతను ఉద్దేశించి విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.