సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పూరిత వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలకు శనివారం నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె శ్రీనివాస్‌కు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. అసత్య వార్తలతో కథనాలు ప్రచురిస్తే సహించేది లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా, ఆంద్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయి.
కాగా రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కుట్రపూరితంగా అగాధం పెంచేందుకు కొన్ని రాజకీయ శక్తుల ముసుగులో ఒక వర్గం మీడియా పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏబీఎస్, టీపీ-5లో అవాస్తవ కధనాలను ప్రసారం చేశారని, దీనిపై ఆ రెండు సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ మూర్తులపై నిఘా అంటూ ప్రచురించిన వార్త ఒక పక్కా ప్రణాళికతో నేరపూరితంగా జరిగిన కుట్రలో భాగమేనని ప్రభుత్వం భావిస్తోంది.
(ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్ సీరియస్)
Comments
Please login to add a commentAdd a comment