
సాక్షి, తాడేపల్లి: ఐఏఎస్‌లపై వచ్చిన హనీ ట్రాప్ కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అధిపతి రాధాకృష్ణ బతుకంతా కుట్రలేనని విమర్శించారు. అమ్మ పాలు తాగుతూ బతికావా? నాగు పాము విషం తాగి బతికావా? అని ప్రశ్నించారు. విషసర్పంలా వెంటాడుతున్న ఆయన ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిరపర్చలేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రజా మద్దతు ఉందని తెలిపారు. కాగా "హనీ ట్రాప్.. ఇద్దరు కలెక్టర్ల కహానీ" పేరుతో కలెక్టర్లపై ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు కథనం ప్రచురితమైంది. దీనిపై ఆగ్రహంతో పాటు ఆవేదనకు గురైన జిల్లా కలెక్టర్లందరూ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు. తాజాగా వీరికి జోగి రమేష్ మద్దతు తెలిపారు. (తప్పుడు కథనంపై కలెక్టర్ల లీగల్ నోటీసు)
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "బ్రోకర్ వ్యవస్థకు ఆద్యుడు ఎవరు? అంటే.. నారా చంద్రబాబు నాయుడు అని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు. ఒకప్పుడు సైకిల్‌పై తిరిగే రాధాకృష్ణ ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఈయన వ్యవస్థపై, బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్ముతున్నారు. ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వైస్రాయ్ హోటల్ హానీ ట్రాప్ చేయలేదా? రాధాకృష్ణ ఒక బ్రోకర్.. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కరోనా కష్టకాలంలోనూ జిల్లా కలెక్టర్లు వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి 24 గంటలు కష్టపడుతున్నారు. అలాంటి వారిపై మీరు విషం చిమ్ముతున్నారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, శిఖండిల్లా అడ్డు పడుతున్నారు. 25 ఏళ్ళ పాటు వైస్సార్ సీపీ అధికారంలో ఉంటుంది, రాధాకృష్ణ నీ కోరలు పీకుతాం. ఈరోజు ఐఏఎస్ అధికారులు, సివిల్ సర్వెంట్స్‌పై వెనకుండి విషపు రాతలు రాయిస్తున్న రాధాకృష్ణ, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి. సివిల్ సర్వెంట్లకు మేము అండగా ఉంటాము" అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. (గుండెల నిండా జనం అజెండా)
Comments
Please login to add a commentAdd a comment