ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై సోషల్ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే... ఆయనపై జాలేస్తోందని... సీఎం కుర్చీలో తాను ఉంటే ఓ గంట కూడా కూర్చోలేనని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తాను అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు. చంద్రబాబు వద‍్ద పనిచేసే అధికారులే ఆయన గురించి సరిగ్గా చెబుతారంటూ ఎద్దేవా చేశారు.