daggubati venkateswar rao
-
నేను, హితేష్ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాం: దగ్గుబాటి వెంకటేశ్వర రావు
-
ఆ వార్తలను ఖండిస్తున్నా: బాలినేని
సాక్షి, ఒంగోలు : చిన్నగంజాంలో ఇసుక అక్రమ తరలింపు విషయంలో తన కుమారుడిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. ఇసుక అక్రమ తరలింపు విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లనే పీపీఏలపై కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇక వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి తెలిపారు. అది వారే నిర్ణయించుకోవాలి.. పర్చూరు విషయంలో కుటుంబం మొత్తం ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని సీఎం వైఎస్ జగన్.... దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సూచించినట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం దగ్గుబాటిదేనని.. ఆయనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. రానున్న వారం రోజుల్లో పర్చూరు విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. -
పర్చూరు టీడీపీకి షాక్
సాక్షి, కారంచేడు (ప్రకాశం): టీడీపీ నాయకులు భయపడుతున్నట్టుగానే జరిగింది. అసమ్మతి నాయకులు కీలక సమయంలో జలక్ ఇచ్చారు. మాకొద్దీ ఎమ్మెల్యే అని ఎంత మొత్తుకున్నా వినకుండా తెలుగుదేశం పార్టీ అధినేత బలవంతంగా తమపై రుద్దిన ఏలూరి అభ్యర్థిత్వానికి వ్యతిరేకించారు. తాము ప్రకటించినట్లుగానే ఏలూరిని ఓడించేందుకు దగ్గుబాటి కుటీరంలో చేరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 5500కి పైగా టీడీపీ కుటుంబాలు వైఎస్సార్ సీపీ కండువ కప్పుకున్నాయి. దగ్గుబాటి గతంలో చేసిన అభివృద్ధి, మాట తప్పని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీలు, మేనిఫెస్టోకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. ఈ చేరికల పరంపరతో పర్చూరులో దగ్గుబాటి విజయం నల్లేరుపై బండినకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాము టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో.. అక్కడి నేతల తీరుపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓటమి ఎరుగని నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావుకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఉన్న అసమ్మతి దగ్గుబాటి విజయాన్ని మరింత సులువు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది పర్చూరు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. దగ్గుబాటి తనదైన శైలిలో తన ఎన్నికల ప్రచారంను నిర్వహిస్తున్నారు. ఏలూరిని వీడుతున్న అసమ్మతి నేతలు.. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అసమ్మతి నాయకులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్న ఆయన అసమ్మతి నేతలు ఆయనకు సీటు ఇస్తే కచ్చితంగా ఓడించి తీరతామని తీర్మానించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో అసమ్మతి నేతలు ఎమ్మెల్యేతో కలిసి సాగుతామని ఆయనతో చెప్పి బైటకు వచ్చారు. కానీ తమ మనసుకు వ్యతిరేకంగా ఏలూరితో కలిసి పనిచేయలేక ఆపార్టీని వీడి బైటకు వచ్చి డాక్టర్ దగ్గుబాటి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతున్నారు. వీరితో పాటు వారి అనుచర వర్గాలు కూడా దగ్గుబాటి కుటీరానికి క్యూ కడుతున్నారు. 25 నుంచి 30 సంవత్సరాలుగా పార్టీ విజయానికి కృషి చేసిన తమను విస్మరించడం జీర్ణించుకోలేకనే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారు. దీనికి తోడు గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి డాక్టర్ దగ్గుబాటి చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ çపథకాలు మళ్లీ ఆయనతో కలిసి పనిచేసేలా చేస్తున్నాయని వారంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేద ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండటం.. చేరికల పరంపరకు కారణమని స్థానిక ప్రజల్లో చర్చసాగుతోంది. మండలాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కుటుంబాలు.. మండలం కుటుంబాలు (సుమారు) కారంచేడు 850 పర్చూరు 1050 మార్టూరు 1150 చినగంజాం 1230 ఇంకొల్లు 890 యద్దనపూడి 370 ఐదేళ్లుగా మా మాటకు విలువ లేదు 373 ఓట్ల మెజార్టీతో గెలిచాను. నా ప్రాంత ప్రజలకు కనీస అసవరాలు తీర్చడంలో విఫలమయ్యాను. అధికారంలో ఉండీ కూడా ఏ ఒక్క పనీ చేయించుకోలేకపోయాను. మండల సర్వసభ్య సమావేశంలో కూడా నేను నా గొంతు వినిపించుకొనే యోగ్యం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయాను. టీడీపీలో ఉండి లాభం లేదనుకున్నాను. టీడీపీని వదిలి వైసీపీలో చేరాను. – యార్లగడ్డ రజనీ, కారంచేడు–1 ఎంపీటీసీ సభ్యురాలు గ్రామానికి కనీసం రోడ్డు వేయించుకోలేకపోయాం ఇడుపులపాడు–కోనంకి రోడ్డును ఆర్ అండ్ బీ కింద మార్చాలని ఎమ్మెల్యేను అనేక మార్లు కోరాం. అయినా ఆయన పట్టించుకోలేదు. గ్రామాభివృద్ధికి ఎలాంటి పని చేయించుకోలేక పోయాం. పార్టీలో సముచిత న్యాయం జరగనప్పుడు అక్కడ ఉండి ఏమి ప్రయోజనం. అందుకే టీడీపీని వదిలి వైఎస్సార్ సీపీలో ఉన్న నాయకులపై నమ్మకంతో చేరాం. – పెంట్యాల సత్యన్నారాయణ, ఎంపీటీసీ సభ్యుడు, ద్రోణాదుల, మార్టూరు మండలం దగ్గుబాటిపై నమ్మకంతోనే వైఎస్సార్ సీపీలో చేరాం టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నాం. పార్టీ కోసం పనిచేసాం. పార్టీ మాకేమీ ఇవ్వలేదు, అవమానాలు తప్ప. గ్రామానికి చెందిన డాక్టర్ మాకు అండగా ఉంటామన్నారు. ఆయనకు తెలుసు ఈ ప్రాంత ప్రజలకు ఏమి కావాలో. ఆయన నాయకత్వంలో మాకు మేలు జరగుతుందనే నమ్మకం మాకుంది. పార్టీ అధినాయకత్వం పైనా మాకు నమ్మకం ఉంది. అందుకే టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరాం. – యార్లగడ్డ శ్రీనివాసరావు, కారంచేడు -
పర్చూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రచారం
-
రాష్ట్ర ప్రజలు టీడీపీ పాలనతో విసిగిపోయారు
-
ప్రకాశంలో జగన్నినాదం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాజకీయ ఉద్ధండులను రాష్ట్రానికి అందించిన ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల పోరు వన్‌సైడ్ వార్‌గా మారిందనే చెప్పవచ్చు. జిల్లాలో ఒక్క సీటుతో మొదలైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎనిమిదేళ్లలో క్లీన్ స్వీప్ చేసే విధంగా మారింది. జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధికంగా 6 సీట్లు కైవసం చేసుకోగా టీడీపీ 5 సీట్లకే పరిమితమైంది. నవోదయం పార్టీ ఎమ్మెల్యేగా ఒకరు గెలిచారు. ఈ సారి సీనియర్ నాయకులతో పాటు, యువనాయకులు భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో ప్రజలకు చేరువకావడం, ఆయన ప్రకటించిన ‘నవరత్నాలు’ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేసేవిలా ఉండడంతో జనం వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నాయకులు సైతం పోటీ చేయడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పట్టున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి, సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మానుగుంట మహీధరరెడ్డి లాంటి నాయకులు పార్టీకి మరింత ఉత్తేజం తీసుకువచ్చారు. ప్రజాక్షేత్రంలో ఉండే ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. విద్యావంతులుగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ లాంటి నాయకులు పార్టీలో చేరడం కలిసొచ్చే అంశం. ఈ ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉండగా టీడీపీ నైరాశ్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లల్లో నీటి ప్రాజెక్టులతో పాటు మిగిలిన అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవడంతోపాటు రామాయపట్నం పోర్టు కేవలం శిలాఫలకానికే పరిమితమైంది. తాగునీరు, కిడ్నీ బాధితుల సమస్యలు పట్టించుకోకపోవడంతోపాటు ఉద్యాన కళాశాల,ట్రిపుల్ఐటీ ఏర్పాటు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నేరవేర్చక పోవడంతో చంద్రబాబు సర్కార్‌పై ప్రజలలో తీవ్ర వ్యతిరేక వచ్చింది. దీంతో ప్రకాశంలో ప్రజల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా పయనించే పరిస్థితులు ఉన్నాయి. వంచించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో వందలాది హామీలిచ్చిన చంద్రబాబు అధికార పీఠమెక్కాక హామీలను గంగలో కలిపారు. ప్రధానంగా వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తి.. ఫ్లోరైడ్‌కు సమస్యకు పరిష్కారం.. రామాయపట్నం పోర్టు తదితర హామీలిచ్చారు.ఇంకా కనిగిరి, దొనకొండలలో పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు.. మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. వీటిలో ఏఒక్క హామీని నెరవేర్చలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం ఉంది. ఒంగోలు, దర్శి, కొండేపి, కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు అసెంబ్లీ స్థానాలు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉండగా, సంతనూతలపాడు, పర్చూరు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇక కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉంది. ఓటర్ల వివరాలు పురుషులు : 12,43,411 మహిళలు : 12,51,823 ఇతరులు :149 మొత్తం :24,95,383 ... ఒంగోలు నియోజకవర్గం మంత్రి పదవిని వదిలేసి, ప్రజలను ఇంటి మనుషులుగా చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టీడీపీ తరపున బరిలో దిగుతున్నారు. బాలినేని నియోజకవర్గంలో పర్యటించి జగన్ నవరత్నాలతో పాటు జగన్ ముఖ్యమంత్రి అయితే జరిగే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. టీడీపీ అభ్యర్థి జనార్థన్ అబివృధ్ది పనులలో కమీషన్లు పుచ్చుకుని సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ... కందుకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి మహీధరరెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ నేత, ఎమ్మెల్యే దివి శివరాంతో విభేదాల కారణంగా వారు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. మహీధరరెడ్డి స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ...ఎర్రగొండపాలెం (ఎస్సీ) పశ్చిమ ప్రకాశంలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో విద్యావంతుడైన ఆదిమూలపు సురేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. యర్రగొండపాలెంలో వైఎస్సార్సీపీ మరింత బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్ రాజు ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. అయితే టీడీపీ టికెట్ డేవిడ్ రాజుకు దక్కలేదు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అజితారావ్ బరిలోకి దిగారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సురేష్ గత నాలుగేళ్లు గా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ... కనిగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూధన్ యాదవ్ పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కానీ, ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి కానీ బరిలోకి దిగే అవకాశముంది. జిల్లాలో బీసీలకు సీటు కేటాయించాలని నిర్ణయించిన జగన్ గత ఎన్నికలలో బుర్రాకు సీటు కేటాయించారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యల పై పోరాటం చేస్తూ ఉన్నారు. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కదిరి బాబూరావు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, స్థానిక సమస్యల గురించి పట్టించుకోకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారోనని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ... పర్చూరు పర్చూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా దగ్గుబాటికి మంచి పేరుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాంబశివరావు దేవరపల్లి భూముల విషయంలో దళితులను ఇబ్బంది పెట్టడంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. ... దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా విద్యావంతుడు, విద్యాసంస్థల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తనయుడు సిద్దా సుధీర్ పోటీలో ఉండే అవకాశం ఉంది. ... గిద్దలూరు వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు వైఎస్సార్సీపీ నుంచి బరిలో ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి టీడీపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అశోక్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాంబాబు అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే వ్యక్తిగా పేరుంది. ... చీరాల వైఎస్సార్సీపీ అభ్యర్థ్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. ఆమంచి అన్ని వర్గాలలో మంచి పట్టున్న నేత. టీడీపీలో పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు కరణం బలరాంను అభ్యర్థిగా నిలిపారు. ... అద్దంకి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బాచిన చెంచుగరటయ్య పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్సీ కరణం బలరాంతో వర్గ విబేధాలు ఉన్నాయి. ... మార్కాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు కుందూరు నాగార్జునరెడ్డి పోటీలో ఉండగా టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. నారాయణరెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ... కొండేపి (ఎస్సీ) వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత వైద్యులు వెంకయ్య పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి పోటీ చేస్తున్నారు. సంతనూతలపాడు(ఎస్సీ) వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్‌బాబు, టీడీపీ తరఫున విజయ్‌కుమార్ బరిలో ఉన్నారు. -బిజివేముల రమణారెడ్డి, సాక్షి ప్రతినిధి, ఒంగోలు -
నా తోడల్లుడు ఐదో వింతజీవి
సాక్షి, అమరావతి: దేవుడు భూచరాలు, జలచరాలు, ఉభయచరాలు, కేచరాలు (వాయు) లాంటి నాలుగు చరాల జీవులను సృష్టిస్తే తన తోడల్లుడు, సీఎం చంద్రబాబు ఐదో చరం వింతజీవి అని సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు పొద్దున ఒకమాట, మధ్యాహ్నం మరోమాట, సాయంత్రం ఇంకో మాట చెబుతుంటారని దుయ్యబట్టారు. దగ్గుబాటి తన కుమారుడు హితేష్ చెంచురాంతో కలసి మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. పోలవరం.. గీలవరం వద్దన్న బాబు కేంద్రం నిధులతో చేపట్టిన పోలవరాన్ని తానే నిర్మిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ ప్రాజెక్టు సందర్శన పేరుతో రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని దగ్గుబాటి మండిపడ్డారు. గతంలోనే రాజ్యసభ మాజీ సభ్యుడు యర్రా నారాయణస్వామి ఆధ్వర్యంలో ‘పోలవరం సాధన సమితి’ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని దేవెగౌడ పోలవరం ఇస్తానని అంటే.. పోలవరం వద్దు గీలవరం వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని దగ్గుబాటి ధ్వజమెత్తారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు రూ.11 కోట్లు, రాష్ట్రంలో ఒక్కో ధర్మపోరాట దీక్షకు రూ.రెండు నుంచి మూడు కోట్లను చంద్రబాబు ఇష్టానుసారంగా ఖర్చు చేశారని చెప్పారు. చంద్రబాబు సభలకు జనాలను సమీకరించేందుకు, వచ్చిన వారు వెళ్లిపోకుండా కాపలాదారుల మాదిరిగా కలెక్టర్లను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జిల్లాలో చంద్రబాబు 90 సార్లు పర్యటించడంతో జనసమీకరణ, ఏర్పాట్లకే సమయం సరిపోయిందని ఇక ప్రజల సమస్యలు పట్టించుకునే సమయం ఎక్కడుందని ఓ కలెక్టర్ తన వద్ద వాపోయినట్టు దగ్గుబాటి తెలిపారు. రాజధాని నిర్మాణంపై ఐదేళ్లుగా డిజైన్లు, గ్రాఫిక్‌లకే పరిమితమై తాత్కాలిక నిర్మాణాలతో సరిపెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక నిఘా అధికారి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని దగ్గుబాటి దుయ్యబట్టారు. నిఘా అధికారుల నుంచి ఎస్పీలు, డీఎస్పీలను టీడీపీ కోసం వాడుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు రూ.7 కోట్ల నుంచి రూ.20 కోట్లు వరకు చెల్లించి కొనుగోలు చేయడం వెనుక ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు బేరసారాలు ఆడారని స్పష్టం చేశారు. స్పీకర్ కుర్చీలో సైతం తానే ఉన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా స్పీకర్ వ్యవహరించారన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారిని చేర్చుకోవాలంటే పదవులు, పార్టీకి రాజీనామా చేసి రావాలని గతంలో జాస్తి చలమేశ్వర్ పాల్గొన్న తిరుపతి మహానాడులో టీడీపీ చేసిన తీర్మానాన్ని చంద్రబాబు తుంగలోకి తొక్కారని పేర్కొన్నారు. జగన్ హామీలనే ప్రభుత్వం అమలు చేస్తోంది... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలనే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని దగ్గుబాటి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు అయినా రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదన్నారు. బాబు నిర్వాకం కారణంగా డ్వాక్రా మహిళలపై దాదాపు రూ.ఆరున్నర వేల కోట్ల వడ్డీ భారం పడిందని, ఎన్నికల ముందు పోస్ట్ డేటెడ్ చెక్కులతో మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తాను ప్రయత్నించినా అది చంద్రబాబుకు ఇష్టం లేదని నాటి స్పీకర్ బాలయోగి తనతో చెప్పారన్నారు. చివరకు పురందేశ్వరి కృషితో ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటు హాలులో ఏర్పాటైందన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు అన్నిట్లో కమీషన్లు... చంద్రబాబుపై అసూయ, ఈర్ష్యతోనే దగ్గుబాటి తన కుమారుడిని వైఎస్సార్ సీపీలో చేరుస్తున్నట్లు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కొత్త పలుకులో రాయడం పవిత్రమైన జర్నలిజం విలువలను దిగజార్చటమేనని మండిపడ్డారు. చంద్రబాబు అంటే తనకు అసూయ లేదని, సీఎం కుర్చిలో కూర్చుని రోజుకో మాట మార్చే ఆయన్ను చూసి జాలి పడుతున్నానని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. రూ.500 కోట్లతో పూర్తయ్యే పట్టిసీమకు రూ.1,500 కోట్లు ఎందుకు ఖర్చుచేశారని, అందులోనూ రాధాకృష్ణకు కమీషన్ల వాటాలున్నాయని ఆరోపించారు. పోలవరం, హంద్రీ– నీవా తదితర ప్రాజెక్టులతో పాటు రాజధాని నిర్మాణం, ప్రతి కాంట్రాక్టులోనూ రాధాకృష్ణకు కమీషన్లు అందుతున్నాయని పేర్కొన్నారు. జగన్ సీఎం అయితే కమీషన్లు ఆగిపోతాయనే బాధతోనే రా«ధాకృష్ణ ఇలాంటి రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. నేడు వైఎస్సార్సీపీలో హితేష్ చేరిక రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను పెంచేలా వైఎస్ జగన్ పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారని దగ్గుబాటి చెప్పారు. మాట తప్పని జగన్ నైజం ఆయన పట్ల ప్రజల్లో అభిమానాన్ని పెంచిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం పనిచేసే తత్వంతో ఆయన ఇస్తున్న హామీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు. బుధవారం వైఎస్ జగన్ గృహప్రవేశం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సమక్షంలో తన కుమారుడు హితేష్ వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు దగ్గుబాటి చెప్పారు. -
నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింతజీవి...
-
నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింతజీవి...
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై సోషల్ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే... ఆయనపై జాలేస్తోందని... సీఎం కుర్చీలో తాను ఉంటే ఓ గంట కూడా కూర్చోలేనని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తాను అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు. చంద్రబాబు వద్ద పనిచేసే అధికారులే ఆయన గురించి సరిగ్గా చెబుతారంటూ ఎద్దేవా చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి. నిన్న ఒకమాట...నేడు ఒకమాట.. మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదాపై ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నిన్న మోదీని ....నేడు రాహుల్ గాంధీని పొగుడుతారు. రాజధాని భూములను ఒక్కొక్కరికీ ఒక్కో రేటుకు ధారాదత్తం చేశారు. గ్రాఫిక్స్‌తోనే డిజైన్లు చూపుతూ కాలం గడుపుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం ఏళ్ల తరబడి జరుగుతోంది. ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదు. ఎన్నికల కోసం మేమే చేస్తామని ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారు. పోలీస్ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను ఆయన భ్రష్టు పట్టించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనే బాధ్యతను ఇంటెలిజెన్స్ ఐజీకి అప్పగించారు. ప్రతిపక్షంలో ఉన్నవారికి కాంట్రాక్టులు అప్పచెపుతామని ఐజీ ప్రలోభపెడుతున్నారు. స్పీకర్ వ్యవస్థను కూడా దిగజార్చేశారు. స్పీకర్ వ్యవస్థను తూట్లు పొడుస్తూ...ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజాన్ని నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో కడుతున్న ప్రాజెక్టుల్లో రాధాకృష్ణకు కమీషన్లు అందాయి. పట్టిసీమ ప్రాజెక్టుపై రాధాకృష్ణ వాస్తవాలు బయటపెట్టగలరా?. పట్టిసీమ, పోలవరం, హంద్రీనీవా పనుల్లో ఆయనకు ముడుపులు అందాయి. ప్రజలకు మేలు చేసేలా రాధాకృష్ణ జర్నలిజం లేదు.’ అని మండిపడ్డారు. -
వైఎస్ జగన్‌తో దాసరి జై రమేష్ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో విజయ ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జై రమేష్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో దాసరి జై రమేష్ శుక్రవారం వైఎస్ జగన్‌ను కలిశారు. ఆయన వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కూడా ఉన్నారు. దాసరి జై రమేష్ దివంగత ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడే కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నిన్న టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అవంతి శ్రీనివాస్ నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా దాసరి జై రమష్ ...వైఎస్ జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీలో జోష్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దివంగత ఎన్టీఆర్ పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తనయుడు హితేష్ చెంచురాంతో కలిసి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. లోటస్ పాండులో ఆదివారం మధ్యాహ్నం జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను, తన కుమారుడు హితేష్ చెంచురాం జగన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని ఈ మేరకు ఆయన్ను కలిసినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు. త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు దగ్గుబాటి మీడియా ముందు ప్రకటించారు. దీంతో దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్సీపీ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాంలు వైఎస్సార్ సీపీ లో చేరతారన్న ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు ఆదివారం వారిద్దరూ వైఎస్ జగన్‌ను కలవడంతో ఉత్కంఠకు తెరపడింది. వెంకటేశ్వరరావు జగన్ ను కలిశారన్న వార్త ఆదివారం మధ్యాహ్నం మీడియాలో ప్రసారం కావడంతో జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్సీపీ లో చేరితే పార్టీ జిల్లాలో మరింతగా బలోపేతమౌతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆహ్వానం నుంచి అన్నా టీడీపీ!
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ.. ఇటు సినిమా రంగంలో అటు రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. అందులో ఎన్టీఆర్ రాష్ట్రాన్ని చుట్టుముట్టిన చైతన్య రథానికి హరికృష్ణ రథసారధి. అలాంటి హరికృష్ణకు సొంత తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అవమానాలు తప్పలేదు. సొంత బావ చంద్రబాబు నాయుడు కారణంగా ఆయన పార్టీలో అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో హరికృష్ణను వాడుకుని వదిలేశారన్న విమర్శ ఉంది. మామకు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో హరికృష్ణ ఆరోజుల్లో చంద్రబాబునాయుడు పక్షాన నిలిచారు. హరికృష్ణతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో సహా మెజారిటీ కుటుంబ సభ్యులు చంద్రబాబు పక్షాన నిలిచారు. అనాడు అధికారం కోసం హరికృష్ణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు వ్యవహరించారు. అయితే చంద్రబాబు మాత్రం హరికృష్ణను తన అవసరాలకు పావుగా వాడుకున్నారన్న విషయం ఆ తర్వాత పరిణామాలు స్పష్టం చేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరినీ దూరం పెడుతూ వచ్చారు. చంద్రబాబు ఎత్తుగడలో ప్రధానంగా బలైంది నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ ను గద్దెదింపి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు ఆ తర్వాత కాలంలో హరికృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుని రవాణా శాఖ అప్పగించారు. హరికృష్ణ ఎమ్మెల్యే కాకుండానే మంత్రిపదవిని చేపట్టారు. ఆరు మాసాల్లో శాసనసభకు ఎన్నిక కాని కారణంగా ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఆ తర్వాత 1996లో ఆయన హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ చంద్రబాబు ఆయనను కేబినేట్ లో చేర్చుకోలేదు. ఎన్టీఆర్ మరణంతో ఖాళీ అయిన హిందూపూర్ శాసనసభ స్థానానికి ఉపఎన్నికను జాప్యం చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోజుల్లో వార్తలొచ్చాయి. ఎమ్మెల్యే కాకుండా హరికృష్ణ మంత్రిపదవి చేపట్టి ఆరు నెలలు పూర్తయిన కారణంగా ఆయన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. పార్టీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా కూడా హరికృష్ణకు అవమానాలు తప్పలేదు. ఆ తర్వాత రెండోసారి రాజ్యసభ టికెట్టు నిరాకరించడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గించడం, ఎన్నికల సమయాల్లో దగ్గరకు చేర్చుకోవడం, పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించడం వంటివి చేస్తూ అవసరం తీరగానే ఆయనను పక్కన పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మహానాడుకు ఆహ్వానించకపోవడం, పొలిట్ బ్యూరో సమావేశాల గురించి సమాచారం ఇవ్వకపోవడం వంటివి అనేక చేదు అనుభవాలు హరికృష్ణకు ఎదురయ్యాయి. ఇలాంటి అనేక అనుమానాలు, ఆటుపోట్ల మధ్య ఆయన చంద్రాబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి 1999 జనవరి 26 న "అన్నా తెలుగుదేశం పార్టీ'' స్థాపించారు. అబిడ్స్‌లోని తన సొంత హోటల్ ఆహ్వానం కేంద్రంగా ఆయన పార్టీని స్థాపించారు. అన్నా టీడీపీ తరపున ఆయన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికల బరిలో ఆపార్టీ ప్రభావం చూపలేకపోయింది. 1999 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత క్రమంలో ఆ తర్వాత కాలంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన తిరిగి టీడీపీలో చేరారు. 2008లో ఎట్టకేలకు రాజ్యసభకు పంపినా రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్ 4న హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. -
బీజేపీలోకి పురందేశ్వరి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరనున్నట్లు విశాఖపట్నంలో గురువారం ప్రకటించడంతో ఆమె భర్త, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. దగ్గుబాటి దంపతులు కాంగ్రె స్ పార్టీని వీడి, వేరే పార్టీలో చేరాలని కొంత కాలంగా ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.. ముందుగా టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఆయనే స్వయంగా ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని చూసిన తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఫ్లెక్సీలు తొలగించి, కాల్చి వేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి వీలు లేకపోయింది. అది కూడా మనమంచికే జరిగిందని* దగ్గుబాటి దంపతులు భావిస్తున్నారు. తెలుగుదేశం ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆ పార్టీలోకి వెళ్లినా ఉపయోగం లేదని భావించినట్లు తెలిసింది. నరేంద్ర మోడి ప్రభావంతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు పలు వార్త సంస్థలతో పాటు, సర్వేలు వెల్లడించాయి. యూపీఏలో కేంద్ర మంత్రి స్థాయి ఉండటంతో బీజేపీలోకి వెళితే , ఆ పార్టీ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి లభించే అవకాశం ఉందని ఈ దంపతులు భావిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం వీరిద్దరూ ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. అటు విశాఖలోను, ఇటు పర్చూరులోను ఆ దంపతులను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు వారించే ప్రయత్నం చేసినా, వారి మాటలను వినే స్థితిలో లేదని తెలిసింది. స్వప్రయోజనాల కోసమే.. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు అన్యాయం చేసిందని, వద్దన్నా రాష్ట్రాన్ని విభజించిందని అందుకే రాజీనామా చేసినట్లు చెప్పుకుంటున్న దగ్గుబాటి దంపతులు విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న వెంటనే, ఆ పార్టీకి, మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని వారి సన్నిహితులే ప్రశ్నిస్తున్నారు. కేవలం పదవే పరమావధిగా పార్టీలు మారుతున్న దగ్గుబాటి దంపతుల పట్ల వారి సన్నిహితులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకు బదులుగా తన కుమారుడిని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీకి దింపాలనుకున్నా, బీజేపీ నుంచి అనుకూల సాంకేతాలు రావడంతో ఆయనే బీజే పీ నుంచి పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. పర్చూరులో బీజేపీకి సానుకూల పవనాలు లేకపోయినా, గెలుస్తామనే ధీమా దగ్గుబాటి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్ వలసలపై గుర్రు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీలోకి కాంగ్రెస్ నేతలు రావడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో టీడీపీకి సత్తా లేకపోవడంతో, కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని పలువురు కాంగ్రె స్ నేతలను టీడీపీ నాయకులు సంప్రదిస్తున్నారు. కొంత మందికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి, పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారని ఆపార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులను చంద్రబాబు పార్టీలోకి తీసుకోవడంతో...మరో కాంగ్రెస్ పార్టీలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంత మంది నాయకులు చంద్రబాబు నాయుడిని నిలదీసినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్తు కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని, దీనిపై ఎవరూ మాట్లాడకూడదని, మీడియా ముందుకు వెళ్లకూడదని ఆయన హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో తెలుగు తమ్ముళ్లు లోలోపల రగిలిపోతున్నట్లు సమాచారం. జిల్లా తెలుగుదేశంలో ఎన్నికల హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. ఒక పక్క మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా, సార్వత్రిక ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే టీడీపీలో ఎక్కడా చలనం కనిపించడం లేదు. ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థికి స్థానిక నాయకుడు కరణం బలరాం ఉండగా, కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి, పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పర్చూరు నియోజకవర్గానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును తీసుకొచ్చే ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. దగ్గుబాటిని తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తూ, అప్పట్లో కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. దీనిపై పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ విషయం మరుగున పడింది. తాజాగా దగ్గుబాటి కుమారుడు హితేష్‌ను రంగంలోకి దింపాలనే ప్రయత్నంలో ఉన్నట్ల్లు తెలిసింది. దీనికి నటుడు బాలకృష్ణ ఆశీస్సులు కూడా ఉన్నాయంటున్నారు. ఇదిలా ఉండగా యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఇటీవల రాజీనామా చేసిన సురేష్‌ను, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌ను కూడా తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. చీరాల ఎమ్మెల్యేగా ఇటీవల రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్‌తో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు సమాచారం. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డితో మంతనాలు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ విధంగా కాంగ్రె స్ నాయకులందరినీ తెలుగుదేశంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ దేశమనో, తెలుగు కాంగ్రెసనో పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. అదీ కాకుండా ముందు నుంచి జెండాలు మోసిన నాయకులు, కార్యకర్తలను కాదని, నిన్నటి వరకు తెలుగుదేశంపై ఆరోపణలు చేసిన నాయకులను, పార్టీలోకి ఆహ్వానించడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లాలో తెలుగుదేశం నేతలంతా చంద్రబాబును త్వరలో కలిసి నిలదీయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.