
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో విజయ ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జై రమేష్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో దాసరి జై రమేష్ శుక్రవారం వైఎస్ జగన్‌ను కలిశారు. ఆయన వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కూడా ఉన్నారు. దాసరి జై రమేష్ దివంగత ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడే కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. కాగా ఆంధ‍్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నిన్న టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అవంతి శ్రీనివాస్ నిన్న వైఎస‍్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా దాసరి జై రమష్ ...వైఎస్ జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment