ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్ | non-bailable warrant to radha krishna | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్

Published Sat, May 10 2014 3:00 AM | Last Updated on Wed, Oct 17 2018 6:31 PM

non-bailable warrant to radha krishna

 నంద్యాల, న్యూస్‌లైన్:  ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ వేమూరి రాధాకృష్ణకు శుక్రవారం నంద్యాల జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేశారు. 2011లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ప్రకటన తన పరువుకు నష్టం కలిగించిందని నంద్యాల పట్టణానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించి రాధాకృష్ణ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని గతంలో ఆదేశించింది. అయితే రాధాకృష్ణ హాజరు కాకపోవడంతో మెజిస్ట్రేట్ నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement