Ram Mohan
-
నీ ఇల్లు బంగారం గానూ!
సాక్షి, సిటీబ్యూరో: ఇల్లు నిజంగానే బంగారమైపోయింది. లగ్జరీ ఇంటీరియర్‌కు 24 క్యారెట్ గోల్డ్ లీఫింగ్తో (పైన పూత) ఇంటిని తీర్చిదిద్దుతున్నారు నగరవాసులు. ప్రధాన ద్వారం మొదలు కార్పెట్లు, కర్టెన్లు, వాల్ పేపర్స్, లైట్లు, సీలింగ్, ఫర్నిచర్ వరకూ ప్రతీది బంగార వర్ణంతో మెరిసిపోతుంది. టర్కీ, ఇటలీ వంటి దేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్‌ను దిగుమతి చేసుకొని మరీ ఇంటిని బంగారుమయం చేసేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లడం లేదు. వీకెండ్స్, హాలీడే ట్రిప్స్ లేవు. గతంలో రోజులో 8–10 గంటలు మాత్రమే ఇంట్లో గడిపేవాళ్లు. మిగిలిన సమయం ఆఫీసులో, ప్రయాణంలో, ఇతరత్రా అవసరాలకు పోయేవి. కానీ ఇప్పుడు కరోనా, వర్క్ ఫ్రం హోమ్ ఇతరత్రా కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో వినోదం, ఆనందం కోసం బయట చేసే ప్రతి పనినీ ఇంట్లో ఉంటూనే ఆస్వాదించాలనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఇంటిని, ఇంట్లోని ప్రతి వసతులను ఆధునికంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం బయట జిమ్, స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లే వారు ఇప్పుడు అవే వసతులు, ఔట్‌డోర్ జిమ్‌లను కల్పించే గేటెడ్ కమ్యూనిటీలను వెతుకుంటున్నారు. వీకెండ్స్‌లో సినిమాకు వెళ్లే బదులు.. ఓవర్ ది టాప్ (ఓటీటీ), నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో ఇంట్లోనే థియేటర్ అనుభూతి కల్పించే హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనాకు ముందు కంటే హైఎండ్ నగరవాసుల వినియోగ వ్యయం తగ్గింది. దీనిని లగ్జరీ ఇంటీరియర్ కోసం వెచ్చిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి... ఇటలీ, టర్కీ, ఈజిప్ట్ దేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్ దిగుమతి అవుతున్నాయి. ఇంటీరియల్లో వినియోగించే ఉత్పత్తుల్లో 60 శాతం ఆయా దేశాల నుంచే దిగుమతి అవుతుంటాయని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ కే ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తలుపులు, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, వాల్ పేపర్స్, కర్టెన్స్, మ్యాట్స్, లైట్లు, మార్బుల్స్, టైల్స్, ఫర్నిచర్, శాండిలియర్స్, బాత్ ఫిట్టింగ్స్, ల్యాండ్ స్కేపింగ్, పెయింటింగ్స్, శిల్పాలు.. ఇలా ప్రతి ఒక్కటీ దిగుమతి చేసుకుంటునన్నారు. విభిన్న డిజైన్స్, లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులు దొరకడమే దిగుమతి చేసుకోవటానికి ప్రధాన కారణం. గతంలో హోమ్ డిజైనింగ్‌లో ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ మాత్రమే భాగస్వామ్యమయ్యే వారు. కానీ, ఇప్పుడు శిల్పులు, చిత్రకారులు కూడా వీరితో జతకట్టి నివాసితులకు ఆధునిక అనుభూతిని కల్పించేలా గృహాలను తీర్చిదిద్దుతున్నారు. లిమిటెడ్ ఎడిషన్స్లలో కొన్ని బ్రాండ్లు... పలు లగ్జరీ కార్ల కంపెనీలు బెంట్లీ, పోర్షే వంటివి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. ఇటలీకి చెందిన ఫెండి కాసా, జియోర్జెట్టి, రోబర్టో కావల్లీ, ట్రుసార్జీ కాసా, ఎట్రో హోమ్, జంబో, జియాన్ఫ్రాంకో ఫెర్రే హోమ్, న్యూయార్క్‌కు చెందిన రాల్ఫ్ లారెన్ హోమ్, యూకేకు చెందిన బెంట్లీ హోమ్, ప్యారిస్‌కు చెందిన బకారట్ లా మైసన్, ఫ్రాన్స్‌కు చెందిన రిట్జ్ పారిస్, బుగట్టీ హోమ్.. ఇవన్నీ అంతర్జాతీయ ఇంటీరియర్ బ్రాండ్లు. క్లాసిక్ స్టయిల్లో చేతితో తయారు చేస్తారు. నాణ్యత, డిజైనింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. నగరంలో లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్.. మైహోమ్, అపర్ణా, రాజపుష్ప, ముప్పా వంటి ప్రాజెక్ట్‌లతో నాలుగైదుగురితో పాటు జూబ్లిహిల్స్ రోడ్ నం.45, గచ్చిబౌలిలోని ఇద్దరు వ్యక్తిగత కస్టమర్లు పూర్తిగా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న 24 క్యారెట్ల గోల్డ్ లీఫింగ్తో ఇంటీరియర్ చేయించుకున్నారు. గిరిధారి, ప్రణీత్, ఎస్ఎంఆర్ తదితర సంస్థలు క్లబ్‌హౌస్‌లను విదేశీ ఇంటీరియర్ ఉత్పత్తులతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాయి. సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నేతలు తమ గృహాలను లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌తో రాజభవనాల లాగా తీర్చిదిద్దుతున్నారు. కార్మికులూ విదేశాల నుంచే.. ఈ తరహా ఇంటీరియర్స్‌ను ఇక్కడి కార్మికులు చేయలేరు. అందుకే ఈజిప్ట్ నుంచి ఇంటీరియర్ నిపుణులు వచ్చి డిజైనింగ్ చేస్తుంటారని తాయబా తెలిపారు. 10 వేల చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాలకు మాత్రమే ఈ తరహా లగ్జరీ ఇంటీరియర్స్ బాగుంటాయి. వీటి ధరలు చదరపు అడుగుకు రూ.800 నుంచి 4,500 వరకు ఉంటాయి. ప్రాజెక్ట్ మొత్తానికి రూ.5–10 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంటీరియర్ డిజైన్ పూర్తి చేసేందుకు 30–90 రోజుల సమయం పడుతుంది. కళ్లు తిరిగే ధరలు.. ►బెంట్లీ సోఫా. వీటి ప్రారంభ ధర రూ.30 లక్షల నుంచి ఉంటుంది. పోర్షే కిచెన్ సెట్స్ ప్రారంభ ధర రూ.కోటి నుంచి మొదలవుతుంది. ►అర్మానీ కాసా ఫర్నీచర్, టైల్స్. వీటిని ఆఫ్రికాలో పెరిగే కొన్ని అరుదైన రకాల వృక్షాల నుంచి ఈ ఫర్నీచర్‌ను తయారు చేస్తారు. వీటి ప్రారంభ ధర రూ.50 లక్షల పైమాటే. ►‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే 30–40 ఏళ్ల నాటి అరుదైన వృక్షాలను ఆఫ్రికా దేశం నుంచి దిగుమతి చేసుకొని ల్యాండ్స్కేపింగ్గా వినియోగిస్తుంటారు. ►జపాన్‌కు చెందిన టోటో, జర్మనీకి చెందిన నోకెన్ బాత్రూమ్ అండ్ శానిటైజ్ ఫిట్టింగ్స్‌లో గ్లోబల్ బ్రాండ్లు. ఆయా ఉత్పత్తుల ప్రారంభ ధరలు రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఆటోమెటెడ్ టాయిలెట్, షవర్స్, బాడీ జెట్స్ ఉత్పత్తులు వీటి ప్రత్యేకత. టాయిలెట్ పైన కూర్చుంటే చాలు వాతావరణాన్ని బట్టి ఆటోమెటిక్‌గా అదే నీటిని పంపింగ్ చేస్తుంది. శరీర ఉష్ణోగత్రను బట్టి మారుతూ ఉంటుంది. షవర్స్, బాడీజెట్స్ శ్రావ్యమైన మ్యూజిక్, లైటింగ్స్‌తో పైనుంచి వర్షం పడినట్లుగా వస్తుంటుంది. ►డెఫా లైటింగ్ సొల్యూషన్స్ మనిషి మూడ్‌ను, ఉష్ణోగ్రతను బట్టి గదిలో వెలుతురును ఇవ్వటం దీని ప్రత్యేకత. ప్రముఖ జువెల్లరీ బ్రాండ్ స్వరోస్క్వీ.. శాండిలియర్స్ను కూడా విక్రయిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.10 లక్షలు. ►అమెరికాకు చెందిన జేబీఎల్, డెన్మార్క్‌కు చెందిన డాలీ, డైనడియా, జపాన్‌కు చెందిన డినాన్, ఫ్రాన్స్‌కు చెందిన డెవిలెట్, ఫోకల్ వంటివి థియేటర్ అనుభూతిని కల్పించే హోమ్ థియేటర్స్ గ్లోబల్ బ్రాండ్లు. కరోనా కారణంగా ప్రయాణాలు కుదరడం లేదు రెసిడెన్షియల్, కమర్షియల్, ఇనిస్టిట్యూషనల్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైన్స్ చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు నగరాలలో 50–60 ప్రాజెక్ట్స్ ఆర్డర్లు ఉన్నాయి. కరోనా కారణంగా విదేశాలకు వెళ్లి ఇంటీరియర్స్‌ను ఎంపిక చేయడం కుదరటం లేదు. – జీ రామ్మోహన్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ ప్యాలెస్‌లు తీర్చిదిద్దడం మా ప్రత్యేకత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అహ్మదాబాద్ నగరాల్లో 55 వేల చదరపు అడుగులలో పలు ప్రాజెక్ట్‌ల ఆర్డర్లు ఉన్నాయి. టర్కీ, ఇటలీ రాయల్ ఫర్నిచర్‌తో లండన్, దుబాయ్, సౌదీ ప్యాలెస్ వంటి కాన్సెప్ట్‌లతో ఇంటీరియర్‌ను డిజైన్ చేయడం మా ప్రత్యేకత. పదేళ్ల వారంటీ కూడా ఉంటుంది. – తాయ్యబా, ఎండీ, బెనోయిట్ ఫర్నీచర్ -
లాక్డౌన్: సినిమాలు వాయిదా వేసుకోవాల్సిందే
మహమ్మారి కరోనా ప్రభావంతో సినీ ఇండస్ట్రీ విపత్కర పరిస్థితుల్లో ఉంది. 24 క్రాప్ట్స్ నుంచి థియేటర్స్ వరకు నెలకొన్న స్తబ్దత అందరినీ ఆలోచనల్లో పడవేస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు మళ్ళీ షూటింగ్స్ మొదలవుతాయి.. ఈ ఏడాది చిత్ర పరిశ్రమ మనుగడ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై తెలంగాణా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత పి. రామ్మోహన్ మాట్లాడారు ఇండస్ట్రీ పరిస్థితి ఎప్పుడు మాములు అయ్యే అవకాశాలున్నాయి? అన్ని పరిశ్రమలలో ఉన్న పరిస్థితే పిల్మ్ ఇండస్ట్రీ లో కూడా ఉంది.. అంతకంటే ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమ మళ్ళీ మామూలు పరిస్థితి కి రావడానికి ఎక్కువ టైం పట్టొచ్చు.. సమ్మర్ సీజన్ నే కాదు.. ఈ సంవత్సరం కూడా మిస్ అయినట్లే అనుకోవాలి. జనవరి వరకూ ఈ పరిస్థితి కోనసాగుతుంది అని నా అంచనా. సినిమా అంటే ప్రేక్షకులు వందల సంఖ్యలో వస్తారు.. అంతమంది ఒకసారి వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ సినిమా థియేటర్స్ పరిస్థితి మెరగవదు. మాల్స్, ఫంక్షన్ హాల్స్ , రెస్టారెంట్స్ మాదిరిగానే థియేటర్స్ రికవరీ కూడా ఎక్కువ టైం పడుతుంది. అందరూ దానికి ప్రిపేర్ అవ్వాలి. పెద్ద సినిమాలు పరిస్థతి ఎంటి? పెద్ద సినిమాలు, అంటే థియేటర్స్ దగ్గర రెవెన్యూని రాబట్టగలిగే సత్తా ఉన్న సినిమాలు తప్పకుండా ఆగాల్సిందే. థియేటర్స్ కు ప్రేక్షకులు నిర్భయంగా వచ్చే టైం వరకూ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందే. నిర్మాతలు కూడా సినిమాలను ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేసేందుకు ఇష్టపడరు. నేను నిర్మాతగా వ్యవహారిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’ నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీని సమ్మర్ రిలీజ్ అనుకున్నాం. ఇంకా 15 రోజులు షూటింగ్ ఉంది.. ఈ సినిమా రిలీజ్ డేట్స్ తారుమారు అయ్యాయి. థియేటర్స్ దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఆగాల్సిందే. తప్పదు. ఎప్పుడు షూటింగ్స్ మొదలవుతాయని అంచనా? దాన్ని ఇప్పుడే ఎవరూ ఊహించలేము. ఒక వంది మందితో షూట్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా షూటింగ్స్ మొదలవుతాయి. కానీ ఇప్పుడే మనం ఖచ్చితంగా పరిస్థితిని అంచనా వేయలేం కానీ మరో ఆరునెలల్లో షూటింగ్స్ మొదలవుతాయని నా అంచనా. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ లిమిటెడ్ క్రూతో చేసుకొనే అవకాశాలుంటాయి. కానీ థియేటర్స్ దగ్గర సాధారణ పరిస్థితులు లేనప్పుడు షూటింగ్స్ కూడా మొదలవ్వవు. వైరస్ పూర్తిగా పోనంతవరకూ థియేటర్స్ కు ప్రేక్షకులు అంత సులభంగా రారు. అప్పటి వరకూ చిన్న చిన్న పనులు అయితే నడుస్తాయేమో కానీ, పూర్తిస్థాయి షూటింగ్స్ మొదలవ్వడం జరగదు. ఓటిటి ప్లాట్ ఫామ్ లు పుంజుకుంటాయా? అక్కడ కూడా సినిమా స్టాండెర్డ్స్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. షూటింగ్స్ జరగాలంటే తప్పకుండా మినిమమ్ 50 మంది సిబ్బంది అవసరం అవుతారు. సీరియల్స్ అయినా ఓటిటి అయినా అంత సులభంగా షూటింగ్స్ జరిగే పరిస్థితులు కనపడటం లేదు. ఏదైనా ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ కి ఈ ఏడాది అంతా ప్రభావం ఉంటుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ ల మీదకు పెద్ద సినిమాల బడ్జెట్ లు వర్క్ అవుట్ అవుతాయా? ఓటిటి ప్లాట్ ఫామ్ మీద పెద్ద సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీగా లేరు. ఎందుకంటే వారి బడ్జెట్ లు ఓటిటి మీద వర్కౌట్ అవ్వవు. సినిమా బిజినెస్ వేరు, ఓటిటి బిజినెస్ వేరు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిర్మాతలు నిర్ణయం తీసుకుంటే రెడీ గా ఉన్న సినిమాలు కొన్ని ఓటిటి మీదకు వస్తాయేమో కానీ 90 శాతం సినిమాలు ఓటిటి మీద రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రారు. ఆరునెలలు సినిమాలు ఆగిపోయినంత మాత్రన సినిమాను వచ్చిన కాడికి అమ్ముకుందాం అని ఏ నిర్మాత అనుకోరు. సినిమా పరిశ్రమ కూడా దీనికి ప్రిపేర్ గా ఉండాలి. మార్కెట్ లో 20 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని పరిశ్రమలకు ఉన్నాయి. వాటిలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి గా చూడాలి అంతే. ఈ కష్టాలు.. బయట కష్టాలకంటే ప్రత్యేకమైనవి కావు. థియేటర్స్ బంద్ అయితే తట్టుకునే శక్తి ఉందా? నేను థియేటర్స్‌ని కూడా రన్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ లీజ్ లోనే నడుస్తున్నాయి. నాకు రెంట్ రావడం లేదు. పర్లేదు.. మరో ఆరునెలలు థియేటర్స్ బంద్ ఉన్నా నేను మెయిన్ టైన్ చేయగలను . సంవత్సరానికి పది లక్షల నిర్వహణ వ్యయం తట్టుకునే శక్తి థియేటర్స్ యాజమాన్యం కి ఉంది.. ఎలక్ట్రిసిటీ ఛార్జ్ లను కమర్షియల్ గా కాకుండా ఇండస్ట్రీ యల్ ఛార్జ్ లు వసూలు చేసేలా ప్రభుత్వాన్ని కోరుతాం. అలాగే మినిమమ్ ఛార్జీల నుంచి మినహాయింపులు అడుగుతాం. ఇవన్నీ థియేటర్స్ యాజామాన్యంకు కాస్త ఊరట నిస్తాయి. పరిశ్రమలో ఎక్కవు గా ఇబ్బంది పడే కార్మికుల కోసం ప్రభుత్వం సహాయం అందిస్తుందా? ఏ పరిశ్రమలో అయినా రోజు వారీ కార్మికులు ఉంటారు.. సినిమా తీస్తే అందులో 90శాతం సినిమా కోసం అపాయింట్ చేసుకున్న వారే ఉంటారు.. అంటే సినిమాలు లేవంటే వారికి పని ఉండదు. వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి. చిరంజీవి గారు మొదలు పెట్టిన కరోన్ క్రైసిస్ ఛారిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ కార్మికులను కాపాడుకోవటమే ఇప్పుడు సినిమా పరిశ్రమ ముందు ఉన్న పెద్ద సవాల్. గవర్నమెంట్ చేసే ప్రతి సహాయం వీరికి అందేలా చూస్తాం.. ప్రభుత్వంతో కూడా చర్చించి మద్దతుగా నిలుస్తాం.. థియేటర్స్ దగ్గర మళ్ళీ అదే సందండి చూస్తామా? నాకు పూర్తి నమ్మకం ఉంది. కరోనా లేదనే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు థియేటర్స్ దగ్గర అదే సందండి కపడుతుంది. అది ఆరునెలలు పడుతుందా ఏడాది పడుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.. కానీ థియేటర్స్ వ్యవస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది. లాక్ డౌన్ టైం ఎలా గడుస్తుంది? నేను పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాను. కరోనా ప్రభావం పై ఇండస్ట్రీ పెద్దలతో రోజూ మాట్లాడుతూనే ఉంటాను. తప్పకుండా ఈ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన రోజున మళ్లీ ఇండస్ట్రీ మరింత వేగంగా పుంజుకుంటుంది. -
యానిమేషన్ రాంమోహన్ కన్నుమూత
ముంబై: భారత్ యానిమేషన్ రంగ ఆద్యుడు రామ్మోహన్(88) శుక్రవారం కన్నుమూశారు. భారత ప్రభుత్వ ఫిల్మ్స్ డివిజన్ కార్టూన్ ఫిల్మ్స్ యూనిట్లో 1956 వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1968లో ప్రసాద్ ప్రొడక్షన్స్‌లో యానిమేషన్ విభాగానికి చీఫ్‌గా చేరారు. 1972లో సొంతంగా తన పేరుతో ‘రామ్మోహన్ బయోగ్రాఫిక్’ సంస్థను స్థాపించారు. దేశంలోనే మంచి పేరున్న ముంబైలోని గ్రాఫిటి మల్టీమీడియా సంస్థకు ఆయన చైర్మన్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. గ్రాఫిటి స్కూల్ ఆఫ్ యానిమేషన్‌ను 2006లో ప్రారంభించారు. పలు హిట్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు ఆయన యానిమేషన్ రూపం ఇచ్చారు. ఎంతో మంది యానిమేషన్ నిపుణులను ఆయన తయారు చేశారు. రామ్మోహన్ మరణం పట్ల యానిమేషన్ ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. -
డి సినిమాతో ఖర్చు తక్కువ
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎస్ఎఫ్డీసీ) చైర్మన్ పి.రామ్మోహన్ రావు అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని టిఎస్ఎఫ్డీసీ కార్యాలయంలో పలువురు నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలతో ఎఫ్డీసీ చైర్మన్ పర్సనల్ సెక్రటరీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యూబ్, యు.ఎఫ్.ఓ. డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు భారీ ఖర్చు భరించాల్సి వస్తోంది. ప్రస్తుత ధరల్లో సగం కన్నా తక్కువ ఖర్చులోనే హాలీవుడ్లో వాడే అత్యాధునిక ‘డి’ సినిమా పరిజ్ఞానాన్ని ‘డిజిక్వెస్ట్’ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం క్యూబ్, యు.ఎఫ్.ఓ. సంస్థ లు తక్కువ క్వాలిటీ ఉన్న ‘ఈ’ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నాయి. 2కే, 4కే, 8కే హై క్వాలిటీ ‘డి’ సినిమా ప్రొజెక్షన్ కోసం డిజిక్వెస్ట్ వారు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టెక్నాలజీలో హై ఎండ్ సర్వర్‌తో పాటు హై ఎండ్ లేజర్ ప్రొజెక్టర్‌ని ఉపయోగిస్తారు. మామూలు ప్రొజెక్టర్ లైఫ్ 700నుంచి 1200 గంటలు ఉంటే, లేజర్ ప్రొజెక్టర్ లైఫ్ 20, 000 గంటలు ఉంటుంది. మామూలు లాంప్ మార్చేందుకు 90,000 ఖర్చు అయ్యేది. లేజర్ ప్రొజెక్షన్ లాంప్ ద్వారా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అలాగే పైరసీ జరిగితే ఒక్క నిమిషం ఫుటేజీ శాంపిల్ చెక్ చేసి ఏ థియేటర్లో, ఏ షోకి పైరసీ జరిగిందన్నది నిమిషాల్లోనే చెప్పడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. వచ్చే వారం మళ్లీ సమావేశం నిర్వహించి, తెలంగాణ ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు. ఈ టెక్నాలజీపై డిజిక్వెస్ట్ సంస్థ చైర్మన్, తెలుగు ఫిలిం చాంబర్ ఉపాధ్యక్షుడు కొత్త బసిరెడ్డి ప్రెజంటేషన్ ఇచ్చారు. నిర్మాతలు కె.ఎల్.నారాయణ, సి.కల్యాణ్, విజయేందర్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, రామదాసు, వల్లూరిపల్లి రమేశ్, డిజిక్వెస్ట్ ఇండియా డైరెక్టర్ పిఎల్కె రెడ్డి, టీఎఫ్‌సీసీ ఈసీ మెంబర్ బాలగోవింద్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ వల్లే త్రిపురలో విజయం
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, మార్పునకు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. ‘ప్రధాని త్రిపురలో 4 ర్యాలీల్లో ప్రసంగించారు. మా ప్రచారాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు పార్టీ విజయం కోసం కృషిచేశారు. ఈ విజయం క్రెడిట్ ఆయనకే దక్కుతుంది’ అని అన్నారు. త్రిపుర సీఎం అభ్యర్థిపై బీజేపీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్టీ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఎం మంచి పోరాటపటిమను ప్రదర్శించిందనీ.. ఏదేమైనా త్రిపుర ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకున్నారని పేర్కొన్నారు. ధనబలంతోనే బీజేపీ విజయం: సీపీఐ సాక్షి, న్యూఢిల్లీ: ధనబలం సహా అన్ని శక్తులను వాడి బీజేపీ రాజకీయాలను ఏమార్చి ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. త్రిపురలో ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఎన్నో సందేహాలు రేకిత్తిస్తోందని అన్నారు. త్రిపుర ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేక ఓట్లను బీజేపీ కూడగట్టిందని, ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోగలిగిందని పేర్కొన్నారు. -
బోగస్ సంస్థలతో మోసపోవద్దు
‘‘తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందాయి. కొందరు వీటి అనుబంధ పేర్లతో బోగస్ సంస్థలు ఏర్పాటు చేసి కొత్త నిర్మాతలను మోసగిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ సంస్థల వలలో పడి మోసపోవద్దు’’ అని తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సి.కల్యాణ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘బోగస్ సంస్థలపై నిఘా ఉంచేందుకు ‘అడ్‌హక్’ కమిటీ ఏర్పాటు చేశాం. కొత్త నిర్మాతలు ఎవరైనా తెలుగు ఫిలిం ఛాంబర్ లేదా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మాత్రమే సభ్యత్వం తీసుకోవాలి. ఎలాంటి గుర్తింపు లేని బోగస్ సంస్థల్లో సభ్యత్వం తీసుకుని, మోసపోతే న్యాయం చేయలేం. సినిమా అవార్డులన్నవి ప్రభుత్వాలు ఇస్తేనే బాగుంటుంది కానీ, సంస్థలు కాదు. ఇల్లీగల్ వ్యవహారాల్లో కౌన్సిల్ జోక్యం చేసుకోదు’’ అన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యదర్శి మురళీమోహన్, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
క్వార్టర్స్‌లో రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్: జీవీకే అఖిల భారత సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో రామ్మోహన్రావు, గంగాధరన్ క్వార్టర్స్‌లో ప్రవేశించాయి.. గురువారం జరిగిన పురుషుల (65+) సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రామ్మోహన్ రావు 6-1, 6-0తో పండార్కర్పై గెలుపొందగా... సి.ఆర్. గంగాధరన్ 6-2, 6-2తో శేష సారుుని ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో పద్మాలు తటవర్తి 6-1, 6-2తో సి.పి.రాజుపై, సి.రాధాకృష్ణన్ 7-5, 1-6 (13/11)పై, వి.ఆర్. కులకర్ణి 6-4, 0-6, 12-10తో జయ్ కుమార్‌పై, అశోక్ రెడ్డి 6-3, 6-1తో ప్రవీణ్ మహాజన్‌పై, సుధాకర్ రెడ్డి 7-5, 6-3తో మోహన్ రావుపై, రామారావు 6-3, 6-4తో మదన్ మోహన్ సింగ్‌పై గెలిచారు. 55+ విభాగంలో యోగేశ్ షా 6-4, 7-5తో ఎం. సురేశ్‌పై, మయూర్ వసంత్ 6-0, 6-0తో బి.ఎస్. తులసీరామ్‌పై, వి. ధనుంజయులు 6-1, 6-2తో ఎస్.ఎ.ఎన్ రాజుపై నెగ్గారు. -
ఎమ్మెల్యేరాజ్..!
కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జుల హల్చల్ - కింది స్థాయి ప్రజాప్రతినిధులకు అవమానాలు, బెదిరింపులు - అధికారులతో ఘర్షణలు.. తమ ‘పని’ చేయకుంటే బదిలీ చేయిస్తామని బెదిరింపులు - ఓ కాలేజీ యజమానిని చంపుతానని బెదిరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం - మాట వినకపోతే జైలులో పెట్టిస్తా.. కాంట్రాక్టర్‌కు వేణుగోపాలాచారి హెచ్చరిక - కాంట్రాక్టర్‌ను నోటికొచ్చిన బూతులు తిట్టిన మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి - ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టలేదంటూ సొంత పార్టీ కార్పొరేటర్‌పైనే ఎల్బీనగర్ ఇన్చార్జి రామ్మోహన్ వీరంగం - అధికారులపై దౌర్జన్యానికి దిగిన మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలు - 25 మంది ఎమ్మెల్యేల కర్ర పెత్తనంపై సర్కారుకు నిఘా వర్గాల నివేదిక సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తమదనే తెంపరితనం.. మంత్రులు తమ వాళ్లనే మిడిసిపాటు.. తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు రెచ్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులమని మరిచిపోయి విచ్చలవిడిగా.. వ్యవహరిస్తున్నారు. తమ మాట వినని అధికారులు, కింది స్థాయి ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. ‘అంతుచూస్తాం.. చంపేస్తాం.. జైలుకు పంపుతా’మంటూ హింసిస్తున్నారు. కమీషన్లు ముట్టజెప్పనిదే పనులు చేయడానికి వీల్లేదంటూ కాంట్రాక్టర్లను దోచుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకూ తమ ‘కక్కుర్తి’తో అడ్డం పడుతున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 25 మంది అధికార పార్టీ శాసనసభ్యులు, మరో డజను మంది వరకూ నియోజకవర్గ ఇన్చార్జులు ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సామంత రాజులా..?: ఒక్క మాటలో చెప్పాలంటే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు తమ నియోజకవర్గాల్లో సామంత రాజులుగా చలామణి అవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు నిఘా వర్గాలు చేసిన ప్రయత్నంతో ఈ నేతల అవినీతి, అక్రమ వ్యవహారాలెన్నో బయటపడ్డాయి. గ్రామాల్లో సర్పంచ్ అయినా, నగరాల్లో కార్పొరేటర్ అయినా వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. మండలంలో ఎమ్మార్వో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ఎవరైనా సరే వారి మాటను వేదంగా పరిగణించాల్సిందే. లేదంటే బదిలీ వేటు పడుతుందని బెదిరిస్తారు. అప్పటికీ వినకపోతే అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రచారం చేస్తారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక పంచాయితీల్లో సెటిల్మెంట్లు చేయడం, పంచాయితీకి పిలిచినా రానివారిని బూతులు తిట్టడం, వాట్సప్‌లో తమకు వ్యతిరేకంగా వచ్చే పత్రికల క్లిప్పింగ్‌లు పెడుతున్నారని బెదిరించడం, చెప్పినట్లు చేయకపో తే జైలులో పెట్టిస్తానని బెదిరించడం నిత్యకృత్యంగా మారిపోయాయి. చెప్పిన పని చేయలేదని అధికారులపై చేయి చేసుకున్న మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఇప్పటికే వివాదాస్పదమైంది. ఓ ఎమ్మెల్యే అటవీ అధికారిపై చేయి చేసుకుంటే, మరో మహిళా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోను ఇంటికి పిలిచి బూతులు తిట్టారు. ఇప్పుడు మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపు ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నీ సంగతి తేలుస్తా.. చంపుతా.. కాలేజీ యజమానికి నకిరేకల్ ఎమ్మెల్యే బెదిరింపులు నకిరేకల్ నియోజకవర్గంలో ఓ కాలేజీ నిర్వాహకుడు వీరయ్యను పంచాయితీకి రావాలని అక్కడి ఎమ్మెల్యే వీరేశం హుకుం జారీ చేశారు. ఆ పంచాయితీకి బాధ్యులైన వారితో పరిష్కరించుకుంటామని వీరయ్య చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహంతో ‘అంతు తేలుస్తా’నంటూ బెదిరించారు. మొత్తం 3 సార్లు వీరయ్యకు ఫోన్లో చేసిన బెది రింపుల సంభాషణలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ‘రమ్మంటే రావడం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడకు వస్తా. డ్రామాలు ఆడుతున్నావారా... కొడుకా నీ సంగతి తేలు స్తా’ అంటూ హెచ్చరించారు. ‘నువ్వెక్కడున్నా వచ్చి కొడతా.. తెలుసుకో నా గురించి.. వచ్చి చంపుతా..’ అని బెది రించారు. నియోజకవర్గంలో కింది స్థాయి ప్రజాప్రతినిధులను ఈ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, అధికారులను అవమానిస్తున్నారని ఆరోపణలున్నాయి. ‘చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపుతా..’ ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన సీనియర్ నేత వేణుగోపాలాచారి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సముద్రాల వేణుగోపాలాచారి సీనియర్ నేత. మాజీ కేంద్రమంత్రి. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో టెండర్ తీసుకుని పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను పని ఆపేయాలని ఒత్తిడి తెచ్చారు. చెప్పినట్లు వినకపోతే లోపలకు (జైలుకు) పంపుతానంటూ బెదిరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెబితే పని ఆపేస్తానని కాంట్రాక్టర్ పేర్కొనడంతో.. ‘నేను చెపితే వినవా.. అంతు చూస్తా.. నేను చెపుతున్నా. ప్రభుత్వం మాది. మేము చెప్పినట్లు విను. ఇష్టం లేకపోతే కోర్టుకు పో. అంతేగానీ తమాషా చేయకు. చెప్పినట్లు వినలేదో ఇబ్బంది పడతావు’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. హుషారీ చేస్తే పరేషాన్ అయితవు: రామ్మోహన్ ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్‌నగర్ కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి తన డివిజన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నియోజకవర్గ ఇన్చార్జి రామ్మోహన్‌గౌడ్ ఫొటోను చిన్నగా పెట్టారట. దీంతో రామ్మోహన్ తిరుమల్‌రెడ్డికి ఫోన్ చేసి ‘ఫ్లెక్సీలో నా ఫొటో పెట్టవా’ అని దబాయించారు. ఫొటో ఉంది కదాని కార్పొరేటర్ సమాధానమిస్తే... ‘చిన్నగా పైన పెడుతవా.. నీది, జగదీశ్‌రెడ్డి (మంత్రి) ఫొటోలు పెద్దగా పెట్టుకుని నన్ను అవమానిస్తావా.. ఇదిగో చెబుతున్నా.. నీకు జగదీశ్‌రెడ్డి ఉండొచ్చు. నా వెంట సీఎం ఉన్నడు. ఏం ఎమ్మెల్యే అయితనని చెప్పుకుంటున్నవంట. హుషారీ చేస్తే పరేషాన్ అయితవు. నువ్వు కార్పొరేటర్ టికెట్ కొనుకున్నవని నాకు తెలుసు. ఈ సంగతి మీడియాను పిలిచి చెబుతా..’ అని బెదిరించారు. ‘కొడుకా నీ సంగతి చెపుతా..’ కాంట్రాక్టర్‌పై మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వీరంగం మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అసైన్డ్ భూములపై కన్నేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ ప్రసాద్‌గౌడ్ వాట్సప్ గ్రూపులో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ‘ఎవడో పేపరోడు రాస్తే దానిని వాట్సప్‌లో పెడతవా.. ఎవరి ఏరియా అనుకుంటున్నావు. నా కొడుకా... ఎట్లా పెట్టినవురా, నీ సంగతి చెప్తా, ఫిర్యాదు చేసి లోపల (జైల్లో) వేయిస్తా..’ అంటూ బూతు పురాణం అందుకున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం ఇటీవల సాధారణమైపోయింది. అది నేరంకూడా కాదు. కానీ మేడ్చల్ ఎమ్మెల్యే ఇదేమీ పట్టించుకోకుండా ‘నా ఏరియాలో ఉంటూ ఇలా చేస్తావా..’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. మిషన్ కాకతీయకూ ఆటంకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకూ పలువురు ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అంచనా కంటే 20 శాతానికిపైగా లెస్‌కు టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు సైతం స్థానిక ఎమ్మెల్యేకు సొమ్ము ముట్టజెపితే తప్ప పని మొదలుపెట్టలేరు. ఇటీవలే రాష్ట్రస్థాయి అధికారిక పదవి చేపట్టిన నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకాయన దెబ్బకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. పనిచేయకపోయినా ఫర్వాలేదుగానీ ఆ ఎమ్మెల్యే బెదిరింపులు భరించలేమంటూ చాలా మంది పనులే ప్రారంభించలేదు. నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ టెండర్లో పాల్గొనడం కోసం కూడా అక్కడి ఓ ఎమ్మెల్యేకు ముడుపులు సమర్పించుకోవాలి. ఇలా అన్ని జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. -
కొత్త మేయర్ పై ఉత్కంఠ!
♦ అధికార టీఆర్ఎస్లో జోరుగా చర్చలు ♦ ప్రచారంలో బొంతు రామ్మోహన్, విజయలక్ష్మి పేర్లు ♦ మరో ఇద్దరు బీసీ నేతలూ రేసులో ఉన్నారంటున్న పార్టీవర్గాలు ♦ అధినేత మదిలో ఎవరున్నారో తెలియని పరిస్థితి ♦ 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. అదే రోజున తొలి సమావేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్లో ప్రస్తుతం మేయర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను టీఆర్ఎస్ 99 డివిజన్లను సొంతం చేసుకుని సింగిల్ మెజారిటీ పార్టీగా అవతరించింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరిస్తాయనేది ఉత్కంఠగా మారింది. ఈసారి మేయర్ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. పరోక్ష పద్ధతిలో కార్పొరేటర్లే మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అసలు మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటిదాకా తమ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని టీఆర్ఎస్ బయటపెట్టలేదు. ఎందుకంటే సరిపడ మెజారిటీ రాకుంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితిని టీఆర్ఎస్ ఎదుర్కుని ఉండేది. కాబట్టే ముందుగా మేయర్ అభ్యర్థి విషయాన్ని పక్కన పెట్టిందనే అభిప్రాయముంది. కానీ ఎక్స్అఫీషియో ఓట్లు కూడా అవసరం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే స్థాయిలో టీఆర్ఎస్ మెజారిటీ సాధించింది. దీంతో కార్పొరేటర్లుగా గెలిచిన పలువురు నేతల్లో ఆశలు పెరిగిపోయాయి. ఎన్నికల ప్రచారం సమయంలోనే టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థులుగా పార్టీ యువజన విభాగం నేత బొంతు రామ్మోహన్, పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వలస సంఖ్యే ఎక్కువ: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒకింత వింత పరిస్థితిని ఎదుర్కొంది. హైదరాబాద్‌లో పెద్దగా పట్టులేకపోవడం, క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడంతో తొలుత డివిజన్లలో పోటీ పడగలిగిన అభ్యర్థుల కొరత వెంటాడింది. అయితే టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్ ’తో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరారు. దాంతో ఆయా డివిజన్లలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన నేతలు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేటర్లుగా అందివచ్చిన అవకాశం కంటే... వివిధ పార్టీల నుంచి వలస వచ్చి టికెట్లు దక్కించుకుని విజయం సాధించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత జీహెచ్ఎంసీ పాలకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఫ్లోర్‌లీడర్లుగా వ్యవహరించిన వారు సైతం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి గెలిచారు. కానీ వారెవరూ ఇప్పటికిప్పుడు మేయర్ పీఠాన్ని ఆశించే పరిస్థితి లేదు. దీంతో ఒకవిధంగా టీఆర్ఎస్లో మేయర్ పదవి కోసం పెద్దగా పోటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అధినేత కేసీఆర్ మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా బొంతు రామ్మోహన్, గద్వాల విజయలక్ష్మిల పేర్లు ప్రచారంలో ఉన్నాయని, మరో ఇద్దరు బీసీ నేతలూ ఆశిస్తున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ కొత్త కార్పొరేటర్లంతా శనివారం సీఎం కేసీఆర్‌ను కలసినప్పుడూ మేయర్ అభ్యర్థిత్వం అంశం చర్చకు రాలేదని సమాచారం. ఎన్నిక జరగాల్సిన 11వ తేదీ దాకా మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల విషయంలో ఇదే గోప్యత కొనసాగవచ్చని చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీ తొలి సర్వసభ్య సమావేశం కూడా 11వ తేదీనే జరగనుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
డిప్యూటీ తహశీల్దార్‌పై ఇసుక మాఫియా దాడి
ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఇసుక వాహనాలను అడ్డుకున్న ఘటనలో డిప్యూటీ తహశీల్దార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం మరికమ్మ దిన్నె గ్రామ సమీపంలో గురువారం ఓవర్ లోడుతో వెళ్తున్న ఇసుక టిప్పర్లను గుర్తించిన డిప్యూటీ తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ వాహనాలను అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు. సమాచారం అందుకున్న ఇసుక మఫియాకు చెందిన రామ్మోహన్ తన అనుచరులతో అక్కడికి చేరుకొని డిప్యూటీ తహశీల్దార్‌పై దాడి చేసి వాహనాలను తీసుకెళ్లాడు. కడప జిల్లా వెంపల్లెలో ఏర్పాటు చేస్తున్న సోలార్ హబ్ కోసం ఇసుక తరలిస్తున్నామని.. తమని అడ్డుకునేంతా దమ్ము నీకు లేదని రామ్మోహన్ ప్రగల్భాలు పలికినట్లు స్థానికులు తెలిపారు. -
సోగ్గాడే.. చిన్ని నాయనా...
అక్కినేని ‘ఆస్తిపరులు’ చిత్రంలో ఆల్‌టైమ్ హిట్ సాంగ్... ‘సోగ్గాడే... చిన్ని నాయనా. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు...’. పి.సుశీల పాడిన ఆ పాట ఆ రోజుల్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అయితే ఆ పాటలో నటించింది అక్కినేని కాదు - జగ్గయ్య, వాణిశ్రీ. ఇప్పటికీ ఆ పాటకు అభిమానులున్నారంటే అది అతిశయోక్తి కాదు. అందుకేనేమో.. నాగార్జున నటించనున్న చిత్రానికి ఈ పాట పల్లవిలోని ‘సోగ్గాడే... చిన్ని నాయన’ అనే పదాన్ని టైటిల్‌గా ఖరారు చేసినట్టుగా సమాచారం. అష్టాచమ్మా, ఉయ్యాల-జంపాల చిత్రాల నిర్మాత రామ్మోహన్‌తో కలిసి నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. కల్యాణ్‌కృష్ణ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటారు. రామ్‌గోపాల్‌వర్మ, వైవీఎస్ చౌదరి, వీఆర్ ప్రతాప్, దశరథ్ తదితరులు నాగార్జున ద్వారానే దర్శకులైన విషయం తెలిసిందే. త్వరలో ఈ జాబితాలోకి కల్యాణ్‌కృష్ణ కూడా చేరతారని సినీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. నిర్మాత రామ్మోహనే స్వయంగా కథ అందించిన ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆయన సరసన రమ్యకృష్ణ ఓ కథానాయికగా నటించనుండగా, మరో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: రవీందర్. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంట్
నంద్యాల, న్యూస్‌లైన్: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ వేమూరి రాధాకృష్ణకు శుక్రవారం నంద్యాల జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ నాన్-బెయిలబుల్ వారెంటును జారీ చేశారు. 2011లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ప్రకటన తన పరువుకు నష్టం కలిగించిందని నంద్యాల పట్టణానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించి రాధాకృష్ణ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని గతంలో ఆదేశించింది. అయితే రాధాకృష్ణ హాజరు కాకపోవడంతో మెజిస్ట్రేట్ నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. -
నా దారి నాదే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పోలింగ్ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో టీడీపీ శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ అసలు సిసలు వర్గ రాజకీయానికి తెరతీశారు. ఓట్ల వేటలో తన దారి తాను చూసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజల్లో పట్టులేదని గ్రహించారో.. వారితో వెళితే తాను మునిగిపోతానని భయపడ్డారో గానీ వారికి హ్యాండిస్తున్నారు. ఈ మేరకు రెండ్రోజులుగా ప్రచార వ్యూహాన్ని మార్చారు. ద్వితీయశ్రేణి నేతలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ఆంతరంగికంగా మంతనాలు సాగిస్తూ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ‘ఎంపీగా నాకు ఓటేయండి. ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టం. ఆ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను’ అని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల చెవిన పడింది. దాంతో వారు రామ్మోహన్ తీరుపై భగ్గుమంటున్నారు. వారిపై అపనమ్మకం ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న రామ్మోహన్‌కు వాస్తవ విషయాలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదని గుర్తించారు. దాంతో తన రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న ఆయన ప్రత్యమ్నాయ వ్యూహానికి తెరతీశారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సీనియర్లు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుండగా.. జూనియర్లకు నియోజకవర్గంపై ఏమాత్రం పట్టులేదని గుర్తించిన ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ గౌతు శివాజీ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పలాసలో శివాజీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని కచ్చితంగా చెబుతున్నారు. ‘నేను పలాస నియోజకవర్గంలో మద్దిల చిన్నయ్య తదితర నేతలను ఎంతగానో బుజ్జగించేందుకు ప్రయత్నించాను. కానీ వారందరూ శివాజీ మీద కోపంతో నా మాట కూడా వినలేదు. పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అలాంటి శివాజీతో కలిసి పనిచేస్తే నా పరిస్థితి ఏమిటి? ఎవరు ఓట్లేస్తారు’ అని రామ్మోహన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందుకే పలాస నియోజకవర్గానికి సంబంధించి పలువురు నేతలు, ఇతర వర్గాల పేర్లతో ఆయన ఓ జాబితా రూపొందించారు. వారందరికీ ఫోన్లు చేస్తూ తన మనుషుల ద్వారా మంతనాలు సాగిస్తున్నారు. ‘శివాజీని పట్టించుకోవద్దు... ఎమ్మెల్యే ఓటు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఎంపీ ఓటు మాత్రం నాకు వేయండి’ అని కోరుతున్నారు. అదే విధంగా పాతపట్నం నియోజకవర్గంలో శత్రుచర్లపై కూడా వ్యతిరేకత ఉందని రామ్మోహన్ గుర్తించారు. దాంతో రెండు ప్రధాన సామాజికవర్గాల నేతలతో మంతనాలు సాగిస్తూ ‘ఎమ్మెల్యే ఓటు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి... ఎంపీ ఓటు మాత్రం నాకు వేయండి’ అని చెబుతున్నారు. సీనియర్లతో పరిస్థితి ఇలా ఉంటే జూనియర్లతో మరో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కూన రవికుమార్ ఇప్పటికీ ఆమదాలవలస నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించలేదు. బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఆయనకు కనీసస్థాయిలో క్యాడర్ లేనే లేదు. అదే విధంగా ఇచ్ఛాపురంలో పట్టుపట్టి టిక్కెట్టు ఇప్పిస్తే బెందాళం అశోక్ ఆశించినస్థాయిలో పని చేయడం లేదని రామ్మోహన్ ఆగ్రహంగా ఉన్నారు. నరసన్నసపేటలో బగ్గు రమణమూర్తిని తాను భుజాన మోయాల్సి వస్తోందని కూడా వాపోతున్నారు. ఇలాంటి అభ్యర్థులతో ఎన్నికల బండిని నడిపించలేనని రామ్మోహన్ తేల్చి చెప్పేస్తున్నారు. అందుకే ఎంపీగా తనకు ఓటేయాలని ఆమదాలవలస, ఇచ్ఛాపురం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, ఇతర వర్గాల ప్రతినిధులను కోరుతున్నారు. ఎమ్మెల్యే ఓటు ఎవరికి వేసినా పర్వాలేదని చెబుతున్నారు. తద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత తనపై పడకుండా చూసుకోవాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. అదే విధానాన్ని శ్రీకాకుళంలో కూడా ఆయన అమలు చేస్తున్నారు. గుండ అప్పలసూర్యనారాయణ కుటుంబంపై పార్టీ కార్యకర్తలకు ఏమాత్రం విశ్వాసం లేదు. ఆ కుటుంబం తమకు అండగా ఉండదన్నది వారి ప్రధాన అభియోగం. అందుకే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నేతలతో మాట్లాడుతూ తన కోసం పనిచేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే ఓటు మీ ఇష్టమని తేల్చేస్తున్నారు. భగ్గుమంటున్న ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ తాజా రాజకీయ తంత్రంపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భగ్గుమంటున్నారు. అసలు రామ్మోహన్‌కు ఉన్నదెంత?’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకుని తమపై పెత్తనం చెలాయించడాన్ని వారు సహించలేకపోతున్నారు. పలాస నియోజకవర్గంలో బూత్ ఏజెంట్ల కోసం కూడా రామ్మోహన్ తనపైనే ఆధారపడాలని శివాజీ వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటిది ఆయన మద్దిల చిన్నయ్య తదితరులను సాకుగా చూపి ఎంపీ ఓటు అడుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. శత్రుచర్ల కూడా అదే రీతిలో రామ్మోహన్‌పై విరుచుకుపడుతున్నారు. ఇక గుండ కుటుంబం ఆగ్రహానికి అంతే లేదు. ప్రస్తుతానికి బయటపడకున్నా కూన రవి, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి కూడా రామ్మోహన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలు పోలింగ్ నాటికి చినికి చినికి గాలివానగా మారి టీడీపీని అతలాకుతలం చేయడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో! -
కింజరాపు కోటలో వసూల్ రాజా!.
ఇంటి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం.. పాత నానుడి. ఇంటి పేరు వాడుకుని కోట్లు దండుకోవడం టీడీపీవారి తాజా ఒరవడి. ఆ మంత్రాంగంతోనే అతగాడు కోట్లు వసూలు చేశాడు. ‘మావాడు ఎంపీగా గెలుస్తాడు. కేంద్రంలో చక్రం తిప్పుతాడు. ఇప్పటికే మా వాడికి ఢిల్లీలో పెద్ద లాబీ ఉంది. ఇప్పుడే కొందరికి రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వేయిస్తాను. మావాడు ఎంపీ అయిన తర్వాత ఉద్యోగాలే.. ఉద్యోగాలు. ఇప్పుడు మాత్రం సైకిల్ యాత్రకు నిధులు కావాలి. ఇప్పుడు మీరు పెట్టుబడి పెడితే ఆనక మీకే ఉద్యోగాలు’ అని ఆశ చూపాడు. టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ ఇంటి పేరు అతగాడి ఇంటి పేరు ఒక్కటే. పైగా అత్యంత సన్నిహితులు కూడా. ఇంకేముంది!.. అందరూ నమ్మేశారు. జిల్లాలో చాలామంది యువకులు భారీగా ముట్టజెప్పారు. అలా వసూలు చేసిన దాంతో అతగాడు కొంతవరకు రామ్మోహన్నాయుడి సైకిల్ యాత్రలో హల్చల్ చేశాడు. తీరా ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు. దాంతో ఉద్యోగాల ఆశతో భారీగా సమర్పించుకన్నవారంతా లబోదిబోమంటూ కింజరాపు కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇంటి పేరు కలసివచ్చింది. కింజరాపు కుటుంబంతో సాన్నిహిత్యం అదనపు అర్హతగా మారింది. రామ్మోహన్నాయుడు సైకిల్ యాత్ర అయాచిత వరంగా పరిణమించింది. బురిడీ కొట్టించే తెలివితేటలున్న వారికి ఇంతకంటే ఇంకేం కావాలి?.. సరిగ్గా అదే చేశాడు ఆ ప్రబుద్ధుడు. కింజరాపు కుటుంబానికి సన్నిహితుడైన అతగాడు శ్రీకాకుళంలోని తన అత్తగారి ఇంట్లో ఉంటాడు. గతంలో దివంగత ఎర్రన్నాయుడి సహకారంతో రియల్ ఎస్టేట్ దందా సాగించాడు. టెక్కలి టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడికి బాగా సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రామ్మోహన్నాయుడు సైకిల్ యాత్ర నిర్వహించారు. సందట్లో సడేమియా అన్నట్లు ఆ యాత్ర పేరుతో ఇతగాడు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం చక్కబెట్టాడు. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలువురు యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపించాడు. సైకిల్ యాత్రకు సహకరిస్తే ప్రతిఫలంగా రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎర వేశాడు. ‘మా వాడు ఎంపీగా గెలుస్తాడు. ఇప్పటికే ఢిల్లీలో లాబీ ఉంది. ఎంపీ అయిన తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పుతాడు. కాబట్టి అందరికీ ఉద్యోగాలు వేయిస్తాను. ఇప్పుడే కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఆ తర్వాత ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు. కానీ ఇప్పుడు మీరు మాత్రం ఒకటి చేయాలి. సైకిల్‌యాత్రకు ఆర్థికంగా సహకరించాలి. బాగా హడావుడి చేయాలి. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వాలి. సైకిల్ యాత్ర వెళ్లిన ప్రతి చోటా పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చి హడావుడి చేయాలి. రామ్మోహన్‌కు మంచి ఇమేజ్ సృష్టించాలి’ అని నూరిపోశాడు. వీటి కోసం ఇప్పుడు పెట్టుబడి పెడితే మిగతా కథంతా తాను నడిపిస్తానని చెప్పుకొచ్చాడు. రామ్మోహన్ ఎంపీ అయిన తరువాత అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. రూ.కోట్లు వసూలు! అతగాడి మాయ మాటలు బాగానే ప్రభావం చూపించాయి. ఇంటి పేరు ఒక్కటే కావడం.. ఆ కుటంబానికి సన్నిహితుడు కావడంతో ఆతని మాటలకు చాలామంది బోల్తా పడ్డారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు సమర్పించుకున్నారని సమాచారం. ప్రధానంగా టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో యువకులు, వారి తల్లిదండ్రులు అతగాడికి భారీగా ముట్టజెప్పారు. అలా అతడు వసూలు చేసిన మొత్తం కొన్ని కోట్లు ఉంటుందని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇంతకీ ఏం చేశాడంటే... ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వసూలు చేసిన మొత్తంలో కొంతవరకు రామ్మోహన్ సైకిల్ యాత్ర సందర్భంగా ఖర్చు పెట్టాడు. పత్రికల్లో పెద్దపెద్ద యాడ్స్ వేయించాడు. తెలివిగా ఎక్కడా తన పేరు రాకుండా నియోజకవర్గ ప్రజలు అని యాడ్స్ వేయించి హడావుడి చేశాడు. ఇక సైకిల్‌యాత్ర సాగుతున్న మార్గమంతా కొంతమందిని వెంటబెట్టుకుని హడావుడి చేశాడు. సైకిల్ యాత్ర కంటే ముందే గ్రామాలకు చేరుకుని ముందస్తు ప్రచారం నిర్వహించాడు. యాత్ర చేరుకోగానే పెద్ద ఎత్తున బాణ సంచా పేల్చి హడావుడి చేశాడు. ఇలా కొంత మొత్తాన్ని ఖర్చు చేశాడు. ఆ తరువాత...పత్తా లేకుండా పోయాడు సైకిల్ యాత్రలో ఇంత హడావుడి చేసిన అతగాడు కొన్ని రోజులుగా కని పించడం లేదు. ఉద్యోగాల కోసం డబ్బులిచ్చిన వారు అతడి కోసం వాక బు చేస్తే ఎక్కడున్నాడో తెలీడం లేదనే సమాధానం వస్తోంది. తమకు ఎప్పు డు ఉద్యోగాలు వస్తాయి అని అడుగుదామంటే అతడు కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాడు. ‘ఇంటికి వెళి తే ఎక్కడికో వెళ్లాడు.. ఎప్పుడు వస్తాడో తెలీదు’ అనే సమాధానం వస్తోంది. కొందరు ధైర్యం చేసి కింజరాపు కుటుంబ సభ్యులను అడిగితే తమకేం తెలుసని గుర్రుమంటున్నారు. దాంతో డబ్బులు సమర్పించుకున్న వారంతా ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. ‘కింజరాపు కుటుంబానికి సన్నిహితుడు. రామ్మోహన్ పేరు చెప్పాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఆశ పడ్డాం. సైకిల్ యాత్రకు ఖర్చు చేస్తానంటే డబ్బులు ముందుగానే ఇచ్చేశాం. ఇప్పుడు పత్తా లేకుండాపోయాడు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కింజరాపు కుటుంబం మాత్రం స్పందించడం లేదు. తమ వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నవారితో కూడా చాలా దురుసుగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కోట్లు వసూలు చేసి పరారైన అతగాడు మాత్రం కొన్ని రోజులు కేరళలో గడిపి ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం. కింజరాపు కుటుంబంలోని ఓ కీలక వ్యక్తితో ఇప్పటికీ టచ్‌లో ఉన్నాడని కూడా తెలుస్తోంది. తన కొత్త సెల్ నంబర్‌ను ఆ కీలక నేతకు మాత్రమే ఇచ్చారని సమాచారం. కాగా అతగాడు అక్కడి నుంచి టీడీపీ తరపున వ్యవహారాలు చక్కబెడుతున్నాడని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు. కింజరాపు కోట అండగా ఉంటే ఇంకెవరూ ఏం చేయలేరన్నదే అతగాడి ధీమా. -
అచ్చమైన స్వచ్ఛమైన సినిమా ఇది
‘‘పల్లెటూరి స్వచ్ఛత, బావామరదళ్ల సరసం, గోదావరి వెటకారం, చక్కని హాస్యం, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు... వీటన్నిటి కలగలుపే ‘ఉయ్యాలా జంపాలా’. అచ్చమైన స్వచ్చమైన సినిమా ఇది’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్ పి. తో కలిసి నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’. రాజ్‌తరుణ్, ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ఫేమ్ అవిక జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. సన్నీ ఎం.ఆర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. డి.సురేష్‌బాబు, నాగచైతన్య ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని శరత్‌మరార్, జెమినీ కిరణ్‌లకు అందించారు. ఈ సందర్భంగా వీడియో విజువల్స్ ద్వారా నాగార్జున మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం యువతరానికి బాగా నచ్చే సినిమా ఇది. సినిమా నచ్చి మాతో సురేష్‌బాబు కూడా కలిశారు. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది’’అని నమ్మకం వ్యక్తం చేశారు. కథ కల్పితమైనప్పటికీ పల్లెటూళ్లలో తాను చూసిన కొన్ని పాత్రలను ప్రేరణగా తీసుకొని ఈ కథను అల్లానని, సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ ఊరిని ఒకసారి చూడాలనుకుంటారని దర్శకుడు చెప్పారు. ముచ్చటైన సినిమా ఇదని అక్కినేని అమల తెలిపారు. ప్రేమతో సినిమా చేస్తేనే ఇలాంటి సినిమాలొస్తాయని నాగచైతన్య చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు నాని, సుమంత్, గుణ్ణం గంగరాజు, ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీరెడ్డి తదితరులు మాట్లాడారు. -
నేటినుంచి విధుల్లోకి వైద్యులు
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రభుత్వ వైద్యులు నేటి నుంచి విధుల్లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి వైద్య బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో రోగులకు తీరని నష్టం జరుగుతుందని, వైద్యపరంగా చాలా కోల్పోవాల్సి వస్తుందని వారు వివరించారు. అయితే తమ ఆవేదనను సీఎం సరిగా అర్థం చేసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద రోగులకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా తాము విధుల్లో చేరుతున్నామని ప్రకటించారు. సోమవారం నుంచి అన్ని ఆస్పత్రుల్లోనూ ఔట్‌పేషంట్ సేవలు, ఆపరేషన్ థియేటర్ సేవలు జరుగుతాయన్నారు. ఇది తాత్కాలిక విరమణే అని, అవసరమైతే మెరుపు సమ్మె చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. తమకు సహకరించిన అందిరికీ అభినందనలు తెలుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.రామ్మోహన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.