సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రభుత్వ వైద్యులు నేటి నుంచి విధుల్లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి వైద్య బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో రోగులకు తీరని నష్టం జరుగుతుందని, వైద్యపరంగా చాలా కోల్పోవాల్సి వస్తుందని వారు వివరించారు.
అయితే తమ ఆవేదనను సీఎం సరిగా అర్థం చేసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద రోగులకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా తాము విధుల్లో చేరుతున్నామని ప్రకటించారు. సోమవారం నుంచి అన్ని ఆస్పత్రుల్లోనూ ఔట్‌పేషంట్ సేవలు, ఆపరేషన్ థియేటర్ సేవలు జరుగుతాయన్నారు. ఇది తాత్కాలిక విరమణే అని, అవసరమైతే మెరుపు సమ్మె చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. తమకు సహకరించిన అందిరికీ అభినందనలు తెలుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.రామ్మోహన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.