సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధం విధిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నేరుగా నియమితులైన క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలకు చెందిన స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు వైద్యులు గానీ, బోధనేతర విభాగం నుంచి బదిలీపై వచ్చిన వైద్యనిపుణులు గానీ ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రజారోగ్య విభాగంలో ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో చేరే వైద్యులకు, తెలం గాణ వైద్య విధాన పరిషత్ విభాగాల పరిధిలో స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా నియమితు లయ్యే వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే డాక్టర్లంద రికీ ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం నిబంధన వర్తిస్తుంది.
కొత్తగా నియమితులయ్యే డాక్టర్లంతా తమ అర్హత ధ్రువపత్రాలను రాష్ట్ర వైద్య మండలిలో తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 12,755 వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయ నుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టు లను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుం డగా..ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. డీఎంఈ పరిధిలోని కాలేజీల్లో నియమితులయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది.
ఏడాది సీనియర్ రెసిడెంట్ అనుభవం
క్లినికల్ విభాగంలో మొత్తం 18 రకాల స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. వాటికి అర్హత వివరాలను మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, రెస్పి రేటరీ మెడిసిన్, సైకియాట్రీ, డెర్మటాలజీ, వెనిరీయోలజీ లెప్రసీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, రేడియో డయాగ్నసిస్, రేడియేషన్ ఆంకాలజీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, హాస్పిటల్ అడ్మిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్ క్లినికల్ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎండీ/డీఎన్‌బీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే ఎండీ పూర్తి చేసిన తర్వాత ఏడాదిపాటు సీనియర్ రెసిడెంట్లుగా పనిచేసిన అనుభవం ఉండాలి. 500కు పైగా పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. ఒక ఏడాది సీనియర్ రెసిడెంట్‌గా పని చేయాలి. ఒకవేళ 500లోపు పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. రెండేళ్లపాటు సీనియర్ రెసిడెంట్‌గా సేవలందించిన వారే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులవుతారని స్పష్టం చేశారు.
నాన్ క్లినికల్ విభాగంలో...
నాన్ క్లినికల్ విభాగంలో అసిస్టెంట్ పోస్టులుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకా లజీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ ఉన్నాయి. వీటికి ఎండీ/ డీఎన్‌బీ/ఎంఎస్ చదివి ఉండాలి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీలకు సబ్జెక్టుల్లో ఎండీ తత్సమాన కోర్సు చేసినవారు లేకుంటే ఆ కోర్సుల్లో ఎంఎస్సీ (పీహెచ్‌డీ) చేసిన వారిని 15% వరకు తీసుకోవచ్చు. ఈ పోస్టుల్లో చేరేవారు ఏడాదిపాటు ట్యూటర్‌గా పనిచేసిన అను భవం ఉండాలి.
సూపర్ స్పెషాలిటీలో..
సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగం లో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, థోరాసిక్ సర్జరీ/కార్డియాక్ సర్జరీ (సీటీ సర్జరీ), యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ పోస్టులున్నాయి. వీటికి ఆయా కోర్సులను బట్టి డీఎం/డీఎన్‌బీ లేదా ఎంసీ హెచ్/డీఎన్‌బీ చదివి ఉండాలి. కాగా, విదేశాల్లో 18 రకాల పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తారా లేదా అన్న విషయంపై ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు.
వైద్యుల వ్యతిరేకత..
ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయ కుండా నిషేధం విధించడంపై పలువురు వైద్యులు వ్యతిరే కత వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం తక్కువ వేతనాలు ఇస్తూ, ఇలా నిషేధం విధించడం తగదన్నారు. కనీ సం ప్రోత్సాహకాలు ఇవ్వడమో లేదా నిమ్స్ మాదిరిగా సాయంత్రం వేళల్లో పనిచేస్తే ఆదా యం వచ్చే మార్గమైనా వెతికే పనిచేస్తే బాగుంటుందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment