అగర్తలాలో సంబరాల్లో పాల్గొన్న రామ్‌మాధవ్, విప్లవ్
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, మార్పునకు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. ‘ప్రధాని త్రిపురలో 4 ర్యాలీల్లో ప్రసంగించారు. మా ప్రచారాన్ని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు పార్టీ విజయం కోసం కృషిచేశారు. ఈ విజయం క్రెడిట్ ఆయనకే దక్కుతుంది’ అని అన్నారు. త్రిపుర సీఎం అభ్యర్థిపై బీజేపీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్టీ పార్లమెంటరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఎం మంచి పోరాటపటిమను ప్రదర్శించిందనీ.. ఏదేమైనా త్రిపుర ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకున్నారని పేర్కొన్నారు.
ధనబలంతోనే బీజేపీ విజయం: సీపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ధనబలం సహా అన్ని శక్తులను వాడి బీజేపీ రాజకీయాలను ఏమార్చి ఈశాన్య రాష్ట్రాల్లో గెలిచిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. త్రిపురలో ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్‌టీ)తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఎన్నో సందేహాలు రేకిత్తిస్తోందని అన్నారు. త్రిపుర ఎన్నికల్లో వామపక్ష వ్యతిరేక ఓట్లను బీజేపీ కూడగట్టిందని, ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోగలిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment