డిప్యూటీ తహశీల్దార్‌పై ఇసుక మాఫియా దాడి | Sand mafia attack on the deputy Tehasildar | Sakshi
Sakshi News home page

డిప్యూటీ తహశీల్దార్‌పై ఇసుక మాఫియా దాడి

Published Thu, Jan 28 2016 6:32 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Sand mafia attack on the deputy Tehasildar

ఓవర్‌ లోడ్‌తో వెళ్తున్న ఇసుక వాహనాలను  అడ్డుకున్న ఘటనలో డిప్యూటీ తహశీల్దార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం మరికమ్మ దిన్నె గ్రామ సమీపంలో గురువారం ఓవర్ లోడుతో వెళ్తున్న ఇసుక టిప్పర్‌లను గుర్తించిన డిప్యూటీ తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ వాహనాలను అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు.


 సమాచారం అందుకున్న ఇసుక మఫియాకు చెందిన రామ్మోహన్ తన అనుచరులతో అక్కడికి చేరుకొని డిప్యూటీ తహశీల్దార్‌పై దాడి చేసి వాహనాలను తీసుకెళ్లాడు. కడప జిల్లా వెంపల్లెలో ఏర్పాటు చేస్తున్న సోలార్ హబ్ కోసం ఇసుక తరలిస్తున్నామని.. తమని అడ్డుకునేంతా దమ్ము నీకు లేదని రామ్మోహన్ ప్రగల్భాలు పలికినట్లు స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement