krishnaprasad
-
తెలంగాణ కృష్ణప్రసాద్‌కు ఎంపీ సీటుపచ్చ నేతలు హాట్..హాట్
చీరాల: ఎంతో ఘన చరిత్ర కలిగిన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటిసారి టీడీపీ ఎంపీ అభ్యర్థి సీటును తెలంగాణకు చెందిన టి.కృష్ణప్రసాద్‌కు కేటాయించడంపై ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. కనీసం ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, అభ్యర్థులతో చర్చించకుండా టీడీపీ అధినేత సీటు ప్రకటించారని వాపోతున్నారు. తెలంగాణ బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వరంగల్ ఎంపీ సీటు ఆశించిన మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్‌కు ఇక్కడ కేటాయించడంపై విస్మయానికి గురయ్యారు. ఉండవల్లి శ్రీదేవికి ఝలక్.. తొలుత బాపట్ల ఎంపీ సీటును వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఖరారు చేసినట్లు ప్రచారం జోరుగా జరిగింది. మాజీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, టీడీపీ నేత ఎంఎస్ రాజు పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవ్వరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే కృష్ణప్రసాద్‌కు పచ్చ కండువా కప్పి బాపట్ల ఎంపీ టీడీపీ అభ్యర్థిగా ప్రకటిండంపై స్థానిక నేతలు షాకయ్యారు. పార్లమెంట్ పరిధిలోని బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాలకు చెందిన ఉమ్మడి పార్టీల నాయకులు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సామాన్యుడికి పట్టంకట్టిన ఓటర్లు బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం 1977లో ఏర్పడింది. అయితే 2009 పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్ స్థానంగా కేటాయించారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2019 ఎన్నికల్లో చీరాల, రేపల్లె, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం బాపట్ల, వేమూరు, ఎస్ఎస్పాడు నియోజకవర్గాలు వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. అయినప్పటికీ బాపట్ల ఎంపీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి సామాన్యుడైన నందిగం సురేష్ విజయం సాధించారు. ఇప్పటికీ ఆయన ప్రజల్లో ఒక కార్యకర్తలాగా తిరుగుతుండటంతో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం నుంచి దిగుమతి అయిన కృష్ణ ప్రసాద్‌పై వైఎస్సార్ సీపీ అభ్యర్థి నందిగం సురేష్ విజయం నల్లేరుపై నడకలా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ ఎంపీగా కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కృష్ణ ప్రసాద్ తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని ఆశించినప్పటికీ ఆ ఆశలు నెరవేరలేదు. ఉద్దండుల కోట బాపట్ల ఎంపీ సీటు అంటే ఒకప్పుడు రాజకీయ ఉద్దండులు, యోధానుయోధులు, అధిక జనాకర్షణ ఉన్న నేతలు పోటీ చేసే నియోజకవర్గం. ఇక్కడ పోటీ చేసిన పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలకు అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రులు, ఉప రాష్ట్రపతిగా పని చేసిన ఘనత ఉంది. ముఖ్యంగా గతంలో దేశానికి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ఎం.వెంకయ్యనాయుడు టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు బాపట్ల ఎంపీగా పోటీచేసి పార్లమెంట్ మెట్లెక్కారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం బాపట్ల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ నుంచి బాపట్ల ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఎస్సీ నియోజకవర్గం కానప్పటికీ గతంలోనే సలగల బెంజిమెన్ వెంకయ్యనాయుడుపై ఎంపీగా గెలిచారు. ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత పనబాక లక్ష్మి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రిగా పనిచేసిన జేడీ శీలం సైతం బాపట్ల పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత శీలం రాజ్యసభకు వెళ్లి కేంద్రమంత్రిగా పనిచేశారు. విశ్రాంత ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్లు సైతం బాపట్ల నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపేవారు. -
Muttiah Muralitharan: నా జీవితమే సినిమాలా ఉంటుంది
‘‘నా బయోపిక్‌గా ‘800’ అనుకున్నప్పుడు స్క్రిప్ట్ నాలుగైదుసార్లు చదివా. ఇందులో ఎటువంటి మసాలా ఉండకూడదనే విషయాన్ని దర్శక–నిర్మాతలకు ముందుగానే చెప్పాను. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్ కాదు. నా జీవితమే సినిమాలా ఉంటుంది. నా జీవితంలో ఎత్తుపల్లాలు ఎలా అయితే ఉన్నాయో.. ‘800’ విడుదల వెనక అలాగే ఎత్తుపల్లాలు ఉన్నాయి’’ అని శ్రీలంక ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అన్నారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. ముత్తయ్యగా మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మించింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► మీ బయోపిక్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? నా జీవితాన్ని సినిమాగా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీలంక ప్రజలకు సహాయం చేయడం కోసం 20 ఏళ్ల క్రితం ఓ ఫౌండేషన్ స్థాపించి, ఎంతో మందికి సాయం అందించాం. శ్రీలంకలోని తమిళ ప్రజలకు సాయం చేయడానికి దర్శకుడు వెంకట్ ప్రభు 2008లో వచ్చారు. ఆయనతో పాటు ‘800’ చిత్రదర్శకుడు శ్రీపతి, ఇంకో ఇద్దరు ఉన్నారు. నా వైఫ్ మదిమలర్, వెంకట్ ప్రభు చిన్ననాటి స్నేహితులు కావడంతో మమ్మల్ని కలిశారు. నా ట్రోఫీలు, సాధించిన ఘనతలు చూసి నా బయోపిక్ తీద్దామంటే ముందు వద్దన్నాను.. ఆ తర్వాత సరే అన్నాను. అప్పుడు శ్రీపతిని కథ రాయమని వెంకట్ ప్రభు చెప్పారు. ► బయోపిక్ అంటే ఫిక్షన్ జోడిస్తారు కదా.. నో ఫిక్షన్. ఈ సినిమాలో క్రికెట్ 20 శాతమే ఉంటుంది. మిగతా 80 శాతం నా జీవితం ఉంటుంది. నా జర్నీ, నేను ఇన్ని ఘనతలు సాధించిన క్రమంలో నా కుటుంబం, దేశం ఎదుర్కొన్న పరిస్థితులు ‘800’లో చూపించాం. నా బాల్యం, సెలెక్టర్లు నన్ను ఎందుకు ఎంపిక చేశారు వంటివి ఎవరికీ తెలియవు. ఆ విషయాలు సినిమాలో ఉంటాయి. ► ‘800’ సినిమా రషెస్ చూశారా? మీ పాత్రకు మధుర్ మిట్టల్ ఎంత వరకు న్యాయం చేశారు? రషెస్ కంటే మూవీ చూడాలనుకున్నాను. అందుకే చూడలేదు. నేను పెద్ద సినిమా అభిమానిని. ఇండియన్ సినిమాలను మిస్ కాను. మధుర్ మిట్టల్‌ని రెండుసార్లు కలిశా. ‘800’ టీజర్, ట్రైలర్ చూశాను. నాలాగా, లుక్స్ పరంగా 70 శాతం మ్యాచ్ అయ్యాడు. ► ‘800’ షూటింగ్‌కి వెళ్లలేదా? ఒక్కసారి మాత్రమే వెళ్లాను. సినిమా నిర్మాణం గురించి నాకేమీ తెలియదు. అది కష్టమైన కళ. కొన్నిసార్లు నిర్మాతలను చూస్తే బాధగా ఉంటుంది. నటీనటులతో పాటు అందరికీ డబ్బులు ఇస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే నిర్మాతల డబ్బులే పోతాయి కదా. ► సినిమా హిట్ కావచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. అందుకే చాలామంది క్రికెటర్లు తమ బయోపిక్ తీయాలని కోరుకోరు.. సినిమా విజయంలో చాలా అంశాలు ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయితే నా లెగసీ ఏమీ పడిపోదు. నా లెగసీ క్రికెట్. నిజంగా జరిగిన కథను ప్రజలకు చెప్పాలని మేం చేసిన ప్రయత్నం ‘800’. అది కొందరికి నచ్చవచ్చు.. మరికొందరికి నచ్చకపోవచ్చు. ఇదొక మంచి సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ► శ్రీలంకలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. శ్రీలంకన్ సింహళ భాషలోనూ రిలీజ్ చేస్తున్నాం. ► తెలుగు సినిమాలు చూస్తారా? శ్రీలంకలో తమిళ, హిందీ చిత్రాలు రిలీజవుతాయి. ఆ భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తా. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప’ సినిమాలను హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడంతో చూశా. శ్రీలంకలో బాలీవుడ్ మూవీస్ ఫేమస్. ఇప్పుడు తెలుగు సినిమా టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ► మీకు ఇష్టమైన తెలుగు నటుడు ఎవరు? ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోస్, స్టార్ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు. నేను నాని సినిమాలు ఎక్కువ చూశా. ‘ఈగ’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలు బాగున్నాయి. ► మీ బయోపిక్ విడుదలవుతోంది. టెన్షన్ ఏమైనా? ఎందుకు టెన్షన్ పడాలి? నేను వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే టెన్షన్ పడాలి (నవ్వుతూ). ► త్వరలో వరల్డ్ కప్ మొదలవుతోంది. మీ ఫేవరేట్ టీమ్? శ్రీలంక మాత్రమే నా ఫేవరెట్. అయితే ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం. -
మైలవరం సిఐ టీడీపీ ఏజెంట్
-
‘కల్లు తాగిన కోతిలా ప్రేలాపనలు’
సాక్షి, విజయవాడ : తెలుగు దేశం పార్టీ నాయకుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సభ్యతా సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని, కల్లు తాగిన కోతిలా ప్రేలాపనలు పేలుతున్నారని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. మైలవరంలో ప్రజలకు సాగు నీరు, తాగునీరు ఇవ్వలేని సాగునీటి మంత్రి ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని, వాటికి నేడు కోట్లాది రూపాయల టెండర్లు పిలుస్తున్నారని తెలిపారు. దానిపై తాము అధికారులకు ఫిర్యాదు చేస్తే ‘కృష్ణ ప్రసాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు’ అంటూ దేవినేని ఉమా ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. మంత్రి ఉమా ఇరిగేషన్ శాఖను అవినీతి శాఖగా మార్చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్లో జరుగుతున్న అవినీతిపై మంత్రి ఉమా ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ, దేవాలయ భూముల్ని బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను తన అనుచరులతో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ పరిధిలో అనుమతులు లేకుండా 60 కోట్ల రూపాయలుతో రోడ్లు వేస్తున్నారని, వాటికి 150 కోట్ల రూపాయలకు బిల్లులు చేసుకోబోతున్నారని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డిని విమర్శించే స్థాయి దేవినేని ఉమాకు లేదన్నారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతో.. డ్రామా అంటూ దుస్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేవినేని ఉమా త్వరలో విచారణను ఎదుర్కోడానికి సిద్దంగా ఉండు’ అంటూ హెచ్చరించారు. మంత్రి దేవినేని ఉమా అవినీతి నిరూపణ కావటం ఖాయమన్నారు. -
జెంటిల్... సస్పెన్స్ థ్రిల్లర్
సహజంగా అభినయించే నటుడు, సాహిత్యం - సినిమా రెంటినీ శ్రద్ధగా చదువుకొని మరీ పద్ధతిగా సినిమాలు తీస్తున్న దర్శకుడు, సినిమా నిర్మాణాన్ని కేవలం వ్యాపారంగా భావించని నిర్మాత - ఇలాంటి ‘జెంటిల్ మన్’లు కలిసినప్పుడు ఎలాంటి సినిమా వస్తుంది? నాని, ఇంద్ర గంటి మోహనకృష్ణ, సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (‘ఆదిత్య 369’ ఫేమ్)ల కాంబినే షన్లో వచ్చిన ‘నాని... జెంటిల్ మన్’ అలాంటిదే! కాంబినేషన్‌తో పాటు ‘హీరో? ఆర్ విలన్?’ అని ప్రశ్నించిన ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఒక విధమైన ఆసక్తిని ఈ సినిమా రేకెత్తించింది. నిజానికి, ఈ చిత్ర కథ కూడా అలాంటి ఆసక్తికరమైన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లరే! విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అంతర్జాతీయ విమానంలో సహ ప్రయాణికులైన ఐశ్వర్య (సురభి), కేథరిన్ (నివేదా థామస్) పరిచయ మవుతారు. కాలక్షేపానికి ఒకరి ప్రేమకథ మరొకరికి చెప్పుకుంటారు. గ్రాఫిక్స్ నిపుణురాలైన కేథరిన్‌ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు గౌతమ్ (నాని). కానీ, ఆమె మీద మోజున్న మేనమామ డేవిడ్ వారి ప్రేమకు విలన్ అవుతాడు. నాలుగు నెలల ప్రేమ పెళ్ళిగా మారాల్సిన టైమ్‌లో కేథరిన్ తన ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళి, ఇప్పుడా ఫ్లైట్‌లో వెనక్కి తిరిగి వస్తోందన్న మాట! ఇక, ఐశ్వర్య కొన్ని వేల కోట్ల కన్స్ట్రక్షన్ కంపెనీకి ఏకైక వారసురాలు. యువ పారి శ్రామికవేత్త జైరామ్ ముళ్ళపూడి అలియాస్ జై (నాని ద్విపాత్రాభినయం)తో ఆమె పెళ్ళి చేయాలనుకుంటారు పెద్దలు. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసు కోవడానికి జై, ఐశ్వర్యలు రెండు రోజుల పాటు డబ్బు, ఫోన్ లేని కొడెకైనాల్ సాహసయాత్రకు వెళతారు. ప్రేమ బంధం బలపడుతుంది. విదేశానికి వెళ్ళా ల్సొచ్చిన ఐశ్వర్య ఇప్పుడు కేథరిన్ ఉన్న ఫ్లైట్‌లోనే ఇండియాకు తిరిగొస్తోంది. ఐశ్వర్య, కేథరిన్లిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. కేథరిన్ అచ్చం తన ప్రేమికుడిలా ఉన్న రెండో హీరోని చూసి అవాక్కవుతుంది. మనిషిని పోలిన మనిషి అని సరిపెట్టుకొని తన లవర్ గౌతమ్ ఇంటికెళుతుంది. అక్కడ పెద్ద షాక్. గౌతమ్‌కు ఏమైంది? జై కథ ఏంటన్నది మిస్టరీతో సాగే మిగతా కథ. సరదాగా ఉండే గౌతమ్‌గా, సీరియస్‌గా - కాస్తంత నెగటివ్ షేడ్స్ నిండిన జైగా రెండు విభిన్న తరహా పాత్రల్లో నాని మెప్పి స్తారు. సహజంగా ప్రవర్తిస్తూ, కొన్ని మామూలు డైలాగ్స్, సన్నివేశాలు, సందర్భాల్ని కూడా ఓ మెట్టు పైకి తీసుకెళ్ళారు. ఇక, కేథరిన్ పాత్రతో తెలుగు తెరకు తొలి పరిచయమైన మలయాళ నటి నివేదా థామస్ తన అభినయ ప్రతిభతో ఆ పాత్రకూ, ఈ కథకూ పెద్ద ఎస్సెట్ అయ్యారు. సెకండాఫ్‌లో హీరో, ఆమె కలసి బావురుమనే దృశ్యంలో నటన బాగుం టుంది. నిత్యా మీనన్ ఫక్కీలో నటన తెలిసిన హీరోయిన్ మరొకరు తెలుగు తెరకు దొరికినట్లయింది. మరో హీరోయిన్ సురభి ఓ.కె. ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపించే అవసరాల శ్రీని వాస్ అవసరాన్ని బట్టి నాణేనికి మరో వైపు చూపించగలనని నిరూపించుకున్నారు. ఆఫీసులో అనుమాన పక్షి అయిన మేనేజర్ సుదర్శనం అలియాస్ దర్శనంగా ‘వెన్నెల’ కిశోర్ వినోదంతో మెప్పించారు. జనం గుర్తుపెట్టుకొనేదిగా చాలా రోజులకు దక్కిన ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కలిసొస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే హీరో - నివేదా థామస్‌ల ‘‘సినిమాటిక్ ప్రేమకథ’’, హీరో - మరో హీరోయిన్ సురభి మధ్య సాగే ‘అంతకు ముందు - ఆ తరువాత’ సినిమా తరహా డేటింగ్ ప్రేమ ప్రయాణం లవ్స్టోరీల్ని మెచ్చే యువతరాన్ని ఆకట్టు కుంటాయి. ఇంటర్వెల్‌కు కాసేపటి ముందు నుంచి వేగం, ఉత్కంఠ పెరుగుతాయి. ఆసక్తికరమైన మలుపు దగ్గర ఇంట ర్వెల్ కార్డ్ పడుతుంది. అనూహ్యమైన షాక్ నుంచి తేరుకున్న హీరోయిన్ నివేదా థామస్ మిస్టరీని ఛేదించే క్రమం అంతా ఇక సెకండాఫ్. మిస్టరీ కేసును డీల్ చేసిన జర్నలిస్ట్ నిత్య (టీవీ యాంకర్ శ్రీముఖి) పాత్ర, హీరో తల్లి, రెండో హీరో తండ్రి లాంటి పాత్రలేవీ చివరలో కనిపించక పోయినా, సినిమా ముగిసే హడావిడిలో అవేవీ గుర్తుపట్టలేం. అలాగే, హీరో పనిచేస్తున్నది తన సంస్థలోనా, హీరోయిన్ కంపెనీలోనా అన్నదీపట్టించుకోం. సెకండాఫ్‌లో అవసరాల దగ్గరకు హీరో వెళ్ళే సీన్ లాంటివి బిగువుగా సాగా ల్సిన కథలో గుట్టుగా ఉండాల్సిన సస్పెన్స్ ముడి విప్పేందుకు ఉప్పందించే స్తాయి. చివరలో జరిగిందంతా హీరో డైలాగ్స్‌లో కన్నా విజువల్‌గా చూపించ గలిగి ఉంటే, మరింత పట్టుగా ఉండేదనిపిస్తుంది. సస్పెన్స్ గుట్టు విప్పే క్రమంలో వేగం, ఉత్కంఠ దీన్ని చిరకాలం చెప్పుకొనే సినిమాగా మార్చేవి. మొత్తం మీద చిన్నాచితకా లోటుపాటుల్ని మరిచిపోనిచ్చే నాని నేచురల్ యాక్టింగ్, ఉన్నంతలో ఆయన - ఇతర కమెడియన్లు చేసే వినోదం, మంచి డైలాగ్స్, కట్టి పడేసే నివేద నటన, మణిశర్మ రీరికార్డింగ్, ముఖ్యంగా సినిమా థీమ్ మ్యూజిక్, పి.జి. విందా కెమేరా పనితనం, ‘చలిగాలి..’ పాట, చిత్ర నిర్మాణ విలువలు - ఈ సినిమాను ‘జెంటిల్’ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌ని చేశాయి. దర్శకుడు ఇంద్రగంటి , హీరో నాని - ఇద్దరూ తమకు అలవాటైన పనికి పూర్తి భిన్నమైన వర్క్‌తో ముందుకు రావడం నిజంగానే థ్రిల్లింగ్ అనుభవం! అసభ్యత, హింస, రక్తపాతాలేవీ లేక పోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అనుభూతి! చిత్రం: ‘నాని... జెంటిల్మన్’, కథ - సినేరియో: డేవిడ్‌నాథన్, కెమేరా: పి.జి. విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, సంగీతం: మణిశర్మ, నిర్మాత: కృష్ణప్రసాద్, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, రిలీజ్: జూన్ 17 -
డిప్యూటీ తహశీల్దార్‌పై ఇసుక మాఫియా దాడి
ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఇసుక వాహనాలను అడ్డుకున్న ఘటనలో డిప్యూటీ తహశీల్దార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం మరికమ్మ దిన్నె గ్రామ సమీపంలో గురువారం ఓవర్ లోడుతో వెళ్తున్న ఇసుక టిప్పర్లను గుర్తించిన డిప్యూటీ తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ వాహనాలను అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు. సమాచారం అందుకున్న ఇసుక మఫియాకు చెందిన రామ్మోహన్ తన అనుచరులతో అక్కడికి చేరుకొని డిప్యూటీ తహశీల్దార్‌పై దాడి చేసి వాహనాలను తీసుకెళ్లాడు. కడప జిల్లా వెంపల్లెలో ఏర్పాటు చేస్తున్న సోలార్ హబ్ కోసం ఇసుక తరలిస్తున్నామని.. తమని అడ్డుకునేంతా దమ్ము నీకు లేదని రామ్మోహన్ ప్రగల్భాలు పలికినట్లు స్థానికులు తెలిపారు. -
ఇక యాదాద్రికి మరింత భద్రత
యాదగిరికొండ (నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి (యాదాద్రి) మరింత భద్రత కల్పించనున్నట్టు అడిషనల్ డీజీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన నరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో... కొండపై పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు చెప్పారు. కొండపై నిఘా కెమెరాల సంఖ్యను పెంచుతామని, రాత్రిపూట గస్తీ విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఐజీ గంగాధర్ ఉన్నారు. -
విజేతలు సిరిల్‌వర్మ, రితూపర్ణదాస్
జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ పాట్నా: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మరోసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సత్తా చాటారు. బుధవారం ఈ పోటీలు ముగిశాయి. అండర్-17 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన ఏఎస్ఎస్ సిరిల్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 21-14, 15-21, 23-21 స్కోరుతో చిరాగ్ సేన్‌పై విజయం సాధించాడు. బాలికల అండర్-19 విభాగంలో రితూపర్ణ దాస్ టైటిల్ చేజిక్కించుకుంది. ఫైనల్లో రితూ, సహచర తెలంగాణ షట్లర్ రుత్విక శివానిపై 21-19, 21-19 తేడాతో గెలుపొందింది. బాలుర అండర్-17 డబుల్స్‌లో ఏపీ క్రీడాకారులు కృష్ణప్రసాద్-సాత్విక్ సాయి రాజ్ 21-16, 21-13 స్కోరుతో అరిన్తప్దాస్ గుప్తా-కౌస్తభ్ రావత్‌పై విజయం సాధించి టైటిల్ నెగ్గారు. బాలికల అండర్-19 డబుల్స్‌లో రితూపర్ణదాస్- రుత్విక శివాని జోడి 21-11, 21-17తో రేష్మ కార్తీక్-సంజన సంతోష్‌ను ఓడించింది. బాలికల అండర్-17 విభాగంలో తెలంగాణకు చెందిన జి. వృషాలి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో వృషాలి 16-21, 15-21 తేడాతో శ్రీయాన్షి పరదేశి చేతిలో పరాజయం పాలైంది. అండర్-19 మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీని ఏపీకి చెందిన డి. పూజ, సౌరభ్ శర్మ (హర్యానా)తో కలిసి గెలుచుకుంది. -
సాయంత్రం 5గం.కు కేసీఆర్ మీడియా సమావేశం
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాయంత్రం అయిదు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు సీఐడీ డీజీ కృష్ణప్రసాద్ గురువారం కేసీఆర్‌ను కలిశారు. కాగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.