విజేతలు సిరిల్‌వర్మ, రితూపర్ణదాస్ | National junnior badminton | Sakshi
Sakshi News home page

విజేతలు సిరిల్‌వర్మ, రితూపర్ణదాస్

Published Thu, Dec 25 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

విజేతలు సిరిల్‌వర్మ, రితూపర్ణదాస్

విజేతలు సిరిల్‌వర్మ, రితూపర్ణదాస్

జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్
 పాట్నా: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మరోసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  క్రీడాకారులు సత్తా చాటారు. బుధవారం ఈ పోటీలు ముగిశాయి. అండర్-17 బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన ఏఎస్‌ఎస్ సిరిల్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 21-14, 15-21, 23-21 స్కోరుతో చిరాగ్ సేన్‌పై విజయం సాధించాడు. బాలికల అండర్-19 విభాగంలో రితూపర్ణ దాస్ టైటిల్ చేజిక్కించుకుంది. ఫైనల్లో రితూ, సహచర తెలంగాణ షట్లర్ రుత్విక శివానిపై 21-19, 21-19 తేడాతో గెలుపొందింది. బాలుర అండర్-17 డబుల్స్‌లో ఏపీ క్రీడాకారులు కృష్ణప్రసాద్-సాత్విక్ సాయి రాజ్ 21-16, 21-13 స్కోరుతో అరిన్తప్‌దాస్ గుప్తా-కౌస్తభ్ రావత్‌పై విజయం సాధించి టైటిల్ నెగ్గారు.
 
  బాలికల అండర్-19 డబుల్స్‌లో రితూపర్ణదాస్- రుత్విక శివాని జోడి 21-11, 21-17తో రేష్మ కార్తీక్-సంజన సంతోష్‌ను ఓడించింది. బాలికల అండర్-17 విభాగంలో తెలంగాణకు చెందిన జి. వృషాలి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో వృషాలి 16-21, 15-21 తేడాతో శ్రీయాన్షి పరదేశి చేతిలో పరాజయం పాలైంది. అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీని ఏపీకి చెందిన డి. పూజ, సౌరభ్ శర్మ (హర్యానా)తో కలిసి గెలుచుకుంది.        

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement