ఇక యాదాద్రికి మరింత భద్రత | Need more security for yadagirigutta, says krishnaprasad | Sakshi
Sakshi News home page

ఇక యాదాద్రికి మరింత భద్రత

Published Wed, Jun 3 2015 6:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

ఇక యాదాద్రికి మరింత భద్రత

ఇక యాదాద్రికి మరింత భద్రత

యాదగిరికొండ (నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి (యాదాద్రి) మరింత భద్రత కల్పించనున్నట్టు అడిషనల్ డీజీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన నరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.

రానున్న రోజుల్లో యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో... కొండపై పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు చెప్పారు. కొండపై నిఘా కెమెరాల సంఖ్యను పెంచుతామని, రాత్రిపూట గస్తీ విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఐజీ గంగాధర్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement