
(ఫైల్ ఫొటో)
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీపై మాజీ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే దారుణంగా చూస్తారని చెప్పిన ఆమె.. అన్యాయాన్ని వివరించినందుకు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
టీడీపీ తీరుపై ఆ పార్టీ మాజీ నేత దివ్యవాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకి నష్టం కలిగించేలా టీడీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోందని ఆమె అన్నారు. టీడీపీలో మహిళలకు జరిగే అన్యాయాన్ని వివరించా. నా ఆవేదనను వివరిస్తే.. నాకు నష్టం కలిగించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.
బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే టీడీపీలో దారుణంగా చూస్తారు. టీడీపీలో కింది వాళ్ల వ్యవహారాలన్నీ బయటపెడతా. గ్రీష్మ(టీడీపీ నేత కావలి గ్రీష్మ) ఎవరు నాపై మాట్లాడటానికి, గ్రీష్మలా నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయినా చంద్రబాబు కోసం కష్టపడి పని చేశాను. అయినా ఇవాళ నాపై కుట్రలు చేస్తున్నారు అంటూ దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment