Transco AE Cheated Young Woman In The Name Of Marriage In Mancherial, Details Inside - Sakshi

ట్రాన్స్‌కో ఏఈ  పాడుపని.. నీతోనే పెళ్లంటూ యువతికి మత్తు మందు ఇచ్చి..

Nov 7 2022 6:11 PM | Updated on Nov 7 2022 7:44 PM

Transco AE Cheated Young Woman In The Name Of Marriage - Sakshi

నిందితుడు దయాకర్‌ (ఫైల్‌)

బాధితురాలు తెలిపిన మేరకు.. మంచిర్యాల జిల్లా  జన్నారం మండలం  శ్రీలంక కాలనీకి దయాకర్‌ జాదవ్‌  “టీఎస్‌ట్రాన్స్‌కో’ లో అసిస్టెంట్‌ ఇంజినీరు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

నాంపల్లి(హైదరాబాద్‌): నీతోనే నా పెళ్లంటూ ఓ యువతిని ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) దయాకర్‌ జాదవ్‌ మోసగించాడు. వివాహం చేసుకుంటానంటూ కరీంనగర్‌లోని తన గదికి తీసుకెళ్లి  మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గర్భధారణ పరీక్షల నిమిత్తం సోమాజిగూడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గైనకాలజిస్ట్‌ దగ్గర పరీక్షలు చేయించి టాబ్లెట్స్‌ ఇప్పించాడు. తన కోరిక తీర్చుకున్నాక “ఇకపై నీతో నా పెళ్లి జరగదంటూ ప్లేటు ఫిరాయించాడు.  బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.
చదవండి: శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన.. బతికున్న తల్లి కూతుళ్లను మట్టితో పూడ్చి..

బాధితురాలు తెలిపిన మేరకు.. మంచిర్యాల జిల్లా  జన్నారం మండలం  శ్రీలంక కాలనీకి దయాకర్‌ జాదవ్‌  “టీఎస్‌ట్రాన్స్‌కో’ లో అసిస్టెంట్‌ ఇంజినీరు. ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన బీటెక్‌ చదివిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భార్యాభర్తలమేనంటూ దయాకర్‌ సదరు యువతితో నమ్మబలికి శారీరకంగా లొంగతీసుకున్నాడు. ఈ క్రమంలోనే రూ.2 కోట్లు కట్నం ఇచ్చే మరో సంబంధం తనకు వచ్చిందంటూ బుకాయించి ఆమెను దూరం పెట్టాడు.

దీంతో అమ్మాయి బంధువులు ఇందుకు కారణమేమిటో తెలుసుకునేందుకు అతడితో ఫోన్‌ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయంగా అన్ని దారులను బ్లాక్‌ చేసిపెట్టాడని బాధితురాలు వాపోయింది. నిందితుడు దయాకర్‌ జాదవ్‌తో పాటు అతడి తల్లి లక్ష్మి, సోదరి లత, సోదరుడు విలాకర్, స్నేహితుడు బీర ప్రకాష్‌లను బాధ్యులుగా ఫిర్యాదులో చేర్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను డిసెంబరు 19వ తేదీలోగా అందజేయాలంటూ జిల్లా పోలీసు శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement