transco ae
-
ట్రాన్స్‌కో ఏఈ పాడుపని.. నీతోనే పెళ్లంటూ యువతికి మత్తు మందు ఇచ్చి..
నాంపల్లి(హైదరాబాద్): నీతోనే నా పెళ్లంటూ ఓ యువతిని ట్రాన్స్‌కో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) దయాకర్ జాదవ్ మోసగించాడు. వివాహం చేసుకుంటానంటూ కరీంనగర్‌లోని తన గదికి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం గర్భధారణ పరీక్షల నిమిత్తం సోమాజిగూడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గైనకాలజిస్ట్ దగ్గర పరీక్షలు చేయించి టాబ్లెట్స్ ఇప్పించాడు. తన కోరిక తీర్చుకున్నాక “ఇకపై నీతో నా పెళ్లి జరగదంటూ ప్లేటు ఫిరాయించాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన.. బతికున్న తల్లి కూతుళ్లను మట్టితో పూడ్చి.. బాధితురాలు తెలిపిన మేరకు.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం శ్రీలంక కాలనీకి దయాకర్ జాదవ్ “టీఎస్‌ట్రాన్స్‌కో’ లో అసిస్టెంట్ ఇంజినీరు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీటెక్ చదివిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భార్యాభర్తలమేనంటూ దయాకర్ సదరు యువతితో నమ్మబలికి శారీరకంగా లొంగతీసుకున్నాడు. ఈ క్రమంలోనే రూ.2 కోట్లు కట్నం ఇచ్చే మరో సంబంధం తనకు వచ్చిందంటూ బుకాయించి ఆమెను దూరం పెట్టాడు. దీంతో అమ్మాయి బంధువులు ఇందుకు కారణమేమిటో తెలుసుకునేందుకు అతడితో ఫోన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయంగా అన్ని దారులను బ్లాక్ చేసిపెట్టాడని బాధితురాలు వాపోయింది. నిందితుడు దయాకర్ జాదవ్‌తో పాటు అతడి తల్లి లక్ష్మి, సోదరి లత, సోదరుడు విలాకర్, స్నేహితుడు బీర ప్రకాష్‌లను బాధ్యులుగా ఫిర్యాదులో చేర్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సమగ్రమైన నివేదికను డిసెంబరు 19వ తేదీలోగా అందజేయాలంటూ జిల్లా పోలీసు శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
బాగా చదువుకో.. ఇదే నా చివరి కాల్
ఎమ్మిగనూరు రూరల్(కర్నూలు జిల్లా): క్షణికావేశానికి లోనైన ఓ వివాహిత ఎమ్మిగనూరులో శనివారం అర్ధరాత్రి సోడియం హైపోక్లోరైడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లో నివాసముంటున్న మోనే తిమ్మప్ప, లక్ష్మీదేవిలకు కుమార్తె మోనే సుష్మ(25), కుమారుడు మోహన్‌లు సంతానం. తిమ్మప్ప పెద్దకడుబూరు మండలంలో విద్యుత్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. కుమార్తె సుష్మకు ట్రాన్స్‌కో ఏఈగా సంవత్సరంన్నర క్రితం ఉద్యోగం వచ్చింది. కుమారుడు మోహన్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. సుష్మ సిరాలదొడ్డి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే నెలలో కర్నూలుకు చెందిన బడేసాబ్, శారదల కుమారుడు కిశోర్‌కుమార్‌తో ఆమెకు వివాహం చేశారు. కిశోర్‌కుమార్ కోడుమూరు మండలం పులకుర్తి కెనరా బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత దంపతుల మధ్య కాపురం ఉండే విషయంలో మనస్పర్థలు వచ్చాయి. కర్నూలులో ఉండాలని భర్త, కాదు ఎమ్మిగనూరులో ఉండాలని భార్య వాదించుకునే వారని తెలిసింది. ఇదే విషయంపై దసరా రోజు ఇంటికి వచ్చిన భర్తతో సుష్మ గొడవ పడినట్లు తెలిసింది. శనివారం విధులకు వెళ్లి రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చింది. బంధువులు, అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు, అలాగే హైదరాబాద్‌లో ఉండే తమ్ముడు మోహన్‌కు కాల్ చేసి బాగా చదువుకో ఇదే నా చివరి కాల్ అని చెప్పినట్లు తెలిసింది. ఇంట్లో భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకుంది. ముందే తెచ్చుకున్న సోడియం హైడ్రోక్లోరైడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందింది. కుమార్తె ఆత్మహత్య చేసుకోవటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ మస్తాన్‌వలి ప్రభుత్వాసుపత్రికి చేరుకొని తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తమ అల్లుడిపై అనుమానం లేదని, కాపురం పెట్టే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవతో ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఎస్ఐకు తెలిపారు. తహసీల్దార్ జయన్న, టౌన్ ఎస్ఐ మస్తాన్‌వలి పోస్టుమార్టం గదిలో మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎ‹స్ఐ మస్తాన్‌వలి పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రికి పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు తరలివచ్చారు. చదవండి: ఆ టీడీపీ నాయకుడి దారి.. అడ్డదారి -
ట్రాన్స్ఫార్మర్ల మాఫియా!
అయ్యా... చేను చేసుకుందామనుకుంటున్నా.. నీళ్లకు ఇబ్బంది అయ్యింది.. బోరులో బాగానే నీళ్లు పడ్డాయి కానీ ట్రాన్స్ఫార్మర్ లేదయ్యా... అదేదో డీడీలు కట్టాలంట కదా కడుదునా... ఆ ఏం డీడీలు రా... ఇప్పుడు కడితే ఎప్పుడు వస్తుందో ఏమో... అప్పట్లోగా నీ పంట ఎండిపోతది.. మరెట్ల అయ్యా... ఏమి లేదు ఎట్లోలాగా నేను తెప్పిస్తాను, కొంత ఖర్చు అయితది... తెచ్చిన తర్వాత ఎట్లయినా సరే కరెంటోళ్లకు చెప్పి అధికారికంగా చేయిద్దాం.. – ఇది ఐదేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ల మాఫియా ఆడుతున్న ఆట. ఒక్కోటి రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వెచ్చించి తెచ్చిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అనేది మాఫియాకు సంబంధం లేదు. దీంతో రైతుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా తయారైంది. సాక్షి, గద్వాల/ గద్వాల అర్బన్: రైతుల అవసరం.. ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో అధికారుల నిర్లక్ష్యం వెరసి ట్రాన్స్ఫార్మర్ల మాఫియాకు అదనుగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లు తెప్పించి రైతులకు కట్టబెడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు మాత్రం కనెక్షన్‌కు, చెడిపోతే మరమ్మతు చేయించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొం ది. అధికారులకు తెలియకుండా విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం అసాధ్యం. ఒకవేళ ఏదైనా రిపేరు వస్తే అంతే సంగతులు.. కాస్తా కూస్తో అవగాహన ఉన్న మరికొందరు రైతులు గత్యంతరం లేక కర్నూలులోని ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతు చేయించుకుంటున్నారు. జిల్లాలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులతోపాటు ఏడు రిజర్వాయర్లు చేపట్టారు. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో ఐదేళ్లుగా పంటల విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు మండలాల్లో వేలాది ఎకరాలు వరి, వేరుశనగ, పత్తి, మిరప, పండ్లతోటల సాగు చేస్తున్నారు. కాల్వలు, బోర్ల కింద పంటలు సాగు చేసుకునేందుకు విద్యుత్ అవసరం ఉంటుంది. ఇదే అదనుగా రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకుని మాఫియా తెరపైకి వచ్చింది. ఇతర జిల్లాల నుంచి తక్కువ ధర, నాణ్యత లేని ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి మూడు రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నారు. అయితే డబ్బులు పోయినా పంట కాపాడుకుందామనే సంతోషం రైతుల్లో లేకుండాపోయింది. వేల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్ ఇచ్చేందుకు అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావడం, ఒకవేళ ఎలాగో ఇప్పించినా అవి పనిచేయకపోవడం, మరమ్మతుకు మళ్లీ వేల రూపాయలు ధారపోయడం రైతులకు పరిపాటిగా మారింది. అంతేకాదు తనతో కాకుండా ఇతరుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు అంశాలు వెలుగు చూశాయి. నలుగురు వ్యక్తులతో కూడిన ఈ మాఫియా ఇప్పటికే కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం. గట్టు మండలం రాయపురంలో రైతులకు ప్రైవేట్ వ్యక్తులు అంటగట్టిన పనిచేయని ట్రాన్స్ఫార్మర్..., మల్దకల్ మండలం దాసరిపల్లిలో అధికారులు గుర్తించిన అనధికారిక ట్రాన్స్ఫార్మర్ ఇదే.. 25కేవీ ట్రాన్స్ఫార్మర్ తప్పనిసరి వ్యవసాయ రంగంలో ప్రతి 20ఎకరాలకు ఒక 25కేవీట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంటుంది. సాధారణంగా డీడీ రూ.ఐదు వేలు ఉండగా ముగ్గురు, నలుగురు రైతులు కలసి దీనికోసం ఆన్లైన్లో నమోదు చేసుకుని ట్రాన్స్‌కో అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలి. సీనియారిటీ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ మంజూరవుతుంది. అనంతరం నాలుగు డీడీలు రూ.20వేల కలిపి 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు విద్యుత్ వైర్లు ఏబీ స్విచ్, ఏజ్ ఫ్యూజ్ సెట్, ఎల్టీ ప్యూజ్ సెట్, హెచ్‌టీ లైన్, ఎల్టీ లైన్‌తోపాటు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె కోసం సుమారు రూ.30వేల వరకు వెచ్చించాల్సిందే. అయితే డీడీ తీసిన తర్వాతా ఏళ్లతరబడి దానికోసం రైతులు ఎదురుచూడాల్సిందే. తప్పని పరిస్థితుల్లో చేనును కాపాడుకునేందుకు రైతులు ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా మాఫియా 25కేవీ ట్రాన్స్ఫార్మర్ను రూ.50వేల నుంచి రూ.70వేల వరకు విక్రయిస్తున్నారు. వైర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఖర్చులు సరేసరి. నిబంధనల ప్రకారం దీనిని రూ.20వేలకే ఇవ్వాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి.. సుమారు ఐదేళ్ల క్రితం బిజ్వారానికి చెందిన ఒకరు, ఇద్దరు సీడ్ ఆర్గనైజర్లు, ధరూరు మండలంలోని మరో వ్యక్తి కలసి ట్రాన్స్ఫార్మర్ల మాఫియాగా ఏర్పడ్డారు. వీరి వద్ద మరికొందరు పని చేస్తుంటారు. వీరు ఇతర జిల్లాల్లో నాణ్యత లేనివి, తక్కువ ధరకు లభించేవి, సక్రమంగా పనిచేయని ట్రాన్స్ఫార్మర్లను జిల్లాలోకి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు సమాచారం. మల్దకల్ మండలంలోని దాసరపల్లి, బిజ్వారం, మల్లెందొడ్డి, ధరూరు మండలంలోని మార్లబీడులో సుమారు 80అనధికారిక ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇలాంటి 200 వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఇక తమ వద్దే, చెప్పిన ధరకే కొనుగోలు చేయాలి, ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే అనుచరులతో అధికారులకు వారే సమాచారం ఇప్పిస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంతోపాటు తెలంగాణలోని సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫార్మర్ల తెప్పిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మంజూరు చేస్తే ట్రాన్స్ఫార్మర్కు దాని సామర్థ్యం, కంపెనీ పేరు, ఉత్పత్తి చేసిన సంవత్సరం తదితర వివరాలు ఉంటాయి. కానీ మాఫియా సరఫరా చేసే దానిని అవేవి ఉండవు. బయట చెబితే అంతే సంగతులు అనధికారిక ట్రాన్స్ఫార్మర్లతో పడుతున్న ఇబ్బందులు రైతులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు భయపడుతున్నారు. ‘సార్... మా వద్దకు వచ్చినట్లు తెలిస్తే కూడా ఇబ్బందే.. మేమేమీ చెప్పలేం..’ అంటూ ముఖం చాటేసి వెళ్తున్నారు. దీనిని బట్టే చూస్తే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మల్దకల్ మండలం దాసరిపల్లిలో నలుగురు రైతులు కలసి ఓ వ్యక్తితో ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేయగా ఇటీవల అధికారులు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిని ఎవరి వద్ద కొనుగోలు చేశారో అతనికే మళ్లీ తిరిగి ఇవ్వాలని బాధిత రైతులు అతడిని ఆశ్రయిస్తే నెల రోజుల వ్యవధిలోనే రూ.పది వేలు తగ్గించి తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అసలు ఎలాంటి కనెక్షన్ ఇవ్వక ముందే తిరిగి తీసుకోవడానికి ఇలా డిమాండ్ చేస్తున్నారంటే వారు రైతులను ముంచి ఎంత సంపాదిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే గట్టు మండలంలోని రాయపురానికి చెందిన కొందరు రైతులు ఇటీవలే ఓ వ్యక్తి నుంచి రూ.45వేలకు ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు చేశారు. తీరా తెచ్చుకున్న తర్వాతా పనిచేయకపోవడంతో తిరిగి అతనికే ఇచ్చేందుకు యత్నించగా తీసుకోవడానికి ఇష్టపడనట్టు తెలిసింది. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్ల సమస్య ఏదైనా ఉత్పన్నమైతే రైతులు, వినియోగదారులు సంబంధిత లైన్‌మన్, ఏఈలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురైతే జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్ మరమ్మతు కేంద్రాలకు తరలిస్తే ఉచితంగా చేస్తారు. అలాగే విద్యుత్ సమస్య ఏర్పడితే లైన్‌మన్, సంబంధిత అధికారులు వచ్చి సరిచేస్తారు. అయితే అనధికారిక ట్రాన్స్ఫార్మర్లు కావడంతో రైతులు మరమ్మతుకు కర్నూలుకు తీసుకెళుతున్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడితే సొంతంగా చేసుకుంటున్నారు. దీంతో కొంత అవగాహన లేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో జరిగే ప్రమాదాల్లో సుమారు 50శాతం అనధికార ట్రాన్స్ఫార్మర్ల వద్దే చోటు చేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీçసుకుంటాం 24గంటల విద్యుత్ సరఫరా నిమిత్తం ఆటోస్టార్టర్ల తొలగింపునకు గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా పర్యటిస్తుంటే ఈ అనధికారిక ట్రాన్స్ఫార్మర్ల బాగోతం బయట పడింది. ఇవి మల్దకల్, ధరూరు, గద్వాల మండలాల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. అయితే రైతులు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్య తీసుకుంటాం. రైతులు డీడీలు కడితే త్వరలోనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తాం. ట్రాన్స్ఫార్మర్లు ప్రైవేట్‌గా కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. – సీహెచ్ చక్రపాణి, ట్రాన్స్‌కో ఎస్ఈ, గద్వాల వరి చేను ఎండుతుందని.. నలుగురు రైతులం కలసి మూడు బోర్ల కింద వరినాటు వేశాం. ప్రస్తుతం కాల్వ నీళ్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని రూ.40వేలు వెచ్చించి మార్లబీడులోని ఓ వ్యక్తితో ట్రాన్స్ఫార్మర్ కొన్నాం. అయితే కొన్న తర్వాత తెలిసింది ఇది అనధికారిక ట్రాన్స్ఫార్మర్ అని. గ్రామంలో గిట్టని వారు కొందరు ట్రాన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి పరిశీలించారు. వారి సూచన మేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు తీసి ఇవ్వగా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. అది రాకపోతే పంట ఎండిపోతది. రెంటికీ చెడ్డ రేవడిలా మా పరిస్థితి తయారైంది. – నర్సింహులు, దాసరిపల్లి, మల్దకల్ మండలం తప్పని పరిస్థితుల్లోనే.. ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు కట్టి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. ఆలస్యమవుతుందని పం టను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రైవేటు వ్యక్తులతో చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను రూ.25వేలకు కొనుగోలు చేశాను. రిపేరు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఖర్చులకు మరో రూ.50వేల దాకా వెచ్చించాను. మరమ్మతు చేయించుకోవాలంటే కర్నూలుకు తీసుకుపోవాల్సి వస్తుంది. దీనినే రెగ్యులరైజ్ చేస్తామనడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా. – చింత కిష్టన్న, అమరవాయి, మల్దకల్ మండలం -
బీకేఎస్ విద్యుత్ శాఖ ఏఈ సస్పెండ్
అనంతపురం అగ్రికల్చర్ : బుక్కరాయసముద్రం మండలం విద్యుత్‌శాఖ ఏఈ గోపాలరెడ్డికి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి శనివారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర నుంచి వచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులను శుక్రవారం ఏఈ గోపాలరెడ్డికి అందజేశామన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం బీకేఎస్ మండలం నీలారెడ్డిపల్లికి చెందిన రైతు సాయినాథరెడ్డి నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా ఈనెల 24న అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్న నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. -
ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ
- రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బుక్కరాయసముద్రం ఏఈ గోపాల్‌రెడ్డి - రైతు నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలంలో విద్యుత్‌శాఖ ఏఈగా పనిచేస్తున్న గోపాల్‌రెడ్డి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌రెడ్డి ధర్మవరం నుంచి బదిలీపై నాలుగేళ్ల క్రితం బుక్కరాయసముద్రం వచ్చాడు. మండల పరిధిలోని నీలారెడ్డిపల్లికి చెందిన సాయినాథ్‌రెడ్డి అనే రైతు తన పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం 2014లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం రూ.52 వేల డీడీ కూడా చెల్లించాడు. 2015 జూన్ 15న ఇతనికి ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసింది. అప్పటి నుంచి దాన్ని పొలంలో ఏర్పాటు చేయాలని ఏఈని సాయినాథ్‌రెడ్డి వేడుకుంటున్నాడు. తనకు లంచం ఇవ్వాలని, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ వేరొకరికి ఇస్తానని గోపాల్‌రెడ్డి బెదిరించాడు. ఆయనడిగిన రూ.7 వేల లంచం ఇవ్వలేక సాయినాథ్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకే ఏఈకి సోమవారం ఆయన కార్యాలయంలోనే లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ జయరాంరాజు, సీఐ ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఏఈ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి.. ఏఈని కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
► కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన ఏఈ ► పెండింగ్‌బిల్లు చెల్లించేందుకు రూ. 20వేలు లంచం డిమాండ్ ► వలపన్ని పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలాభాను, సిబ్బంది. కురుపాం: కాంట్రాక్టర్ బిల్లు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యుత్‌శాఖ ఏఈని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్న సంఘటన కురుపాంలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలా భాను స్థానిక విలేకరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి. కొమరాడ మండలం మాదలింగికి చెందిన లైసెన్స్డ్ కాంట్రాక్టర్ ఎస్.సురేష్ కొన్ని నెలలుగా కురుపాం మండలంలో విద్యుత్‌శాఖకు చెందిన నిర్మాణ పనులు చేస్తున్నాడు. వాటికి సంబంధించిన బిల్లులు బకాయి ఉన్నాయి. ఆ బిల్లులు చల్లించేందుకు ట్రాన్స్‌కో ఏఈ టి.వేణు రూ. 20,000లు లంచం డిమాండ్ చేయగా ఆ కాంట్రాక్టర్ మొదటి విడతగా రూ. 10,000లు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీకి సమాచారం అందివ్వగా శుక్రవారం సాయంత్రం ట్రాన్స్‌కో ఏఈకి రూ. 10,000లు లంచం ఇస్తుండగా ముందస్తు సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలాబాను, సీఐలు ఎస్.లక్ష్మోజీ, డి.రమేష్ వలపన్ని పట్టుకున్నారు. విసిగెత్తిపోయా... కొన్నాళ్లుగా విద్యుత్ శాఖకు చెందిన పనులు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చేసిన పనులకు నాకు లక్ష రూపాయల వరకు విద్యుత్‌శాఖ ద్వారా రావాల్సి ఉంది. బిల్లు కోసం ఎన్నిమార్లు ప్రస్తావించినా పట్టించుకోలేదు. చివరకు ఏఈ లంచం అడగటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – ఎస్.సురేష్, కాంట్రాక్టర్, మాదలింగి గ్రామం -
ఏసీబీ చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ
రాయదుర్గం: కొత్తగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ వలకు చిక్కాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఏఈగా పని చేస్తున్న మహబూబ్బీపీరా ఓ రైతుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న ఏఈతో పాటు అతని అసిస్టెంట్ బాబాను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
మర్రిపాడు:మండలంలో ట్రాన్స్‌కో ఇన్చార్జి ఏఈగా పనిచేస్తున్న శ్రీకాంత్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శుక్రవారం పట్టుబడ్డాడు. బాధిత రైతు కథనం మేరకు మండలంలోని బూదవాడ గ్రామానికి చెందిన సిరిగిరి మహేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, రమణయ్య 2015 నవంబర్‌లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం అప్పట్లో ప్రభుత్వానికి రూ.37 వేలను చెల్లించారు. అప్పట్లో ఏఈగా ఉన్న ఖుద్దూస్‌కు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.5 వేలు లంచం కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఖుద్దూస్ సస్పెండ్ అయి ఉండడంతో దుత్తలూరులో విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌ను మర్రిపాడు ఇన్చార్జి ఏఈగా నియమించారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులు ఏఈ శ్రీకాంత్‌ను కలిసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. రూ.10 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తామని ఏఈ సమాధానమిచ్చారు. దీంతో ఈ నెల 10వ తేదీన బాధిత రైతు వెంకటేశ్వర్లు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు ఏఈ శ్రీకాంత్‌కు రైతు వెంకటేశ్వర్లు రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ సిబ్బందితో కలసి శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ ఇంట్లో ఏసీబీ సోదాలు కావలిఅర్బన్: ట్రాన్స్‌కో ఏఈ శ్రీకాంత్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక రామ్మూర్తిపేట కేతిరెడ్డివారి వీధిలోని అతని ఇంటిలో ఏసీబీ సీఐ ప్రతాప్, ఏఎస్ఐ కరీ ముల్లా, సిబ్బంది సోదాలు చేశారు. రూ.28వేల నగదు, మూడు జతల కమ్మలు, ఇతర ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డా క్యుమెంట్ల విలువ సుమారు రూ.కోటిలు ఉంటుందని అంచనా వేస్తున్నా రు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఏసీబీ డీఎస్పీకి అందజేస్తామని అధికారులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట విద్యుత్ శాఖ ఏఈ నంగు వేణుగోపాల్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం చిక్కాడు. మోమిన్‌పేట మండలానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని పూర్తి చేయటానికి రూ.25 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అధికారుల సూచనల మేరకు రైతు నగదును ఏఈకి తార్నాకలో అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. -
ట్రాన్స్‌కో ఏఈ ఇంటిపై ఏసీబీ దాడులు
విజయవాడ: నగరంలోని మాచవరంలో ట్రాన్స్‌కో ఏఈ ఇంటిపై బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆయనపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ట్రాన్స్‌కో ఏఈ వెంకటేశ్వరరావు ఇళ్లలో సోదాలు చేస్తున్నట్టు పేర్కొంది. కాగా, ఏఈ ఇళ్లలో సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
చిల్లకూరు: ఓ వినియోగదారుడి నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ సురేశ్ కుమార్ కు పారిచర్లవారిపాలేనికి చెందిన నాగముని అనే వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోరుతూ వినతి పత్రం అందజేశారు. అయితే, రోజులు గడుస్తున్నా ఆయన విన్నపాన్ని ఏఈ పట్టించుకోలేదు. తనకు రూ.1.20 లక్షలు ఇస్తేనే పని అవుతుందని స్పష్టం చేశాడు. దీంతో నాగముని ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు నాగముని గురువారం మధ్యాహ్నం చిల్లకూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న సురేశ్ కుమార్ కు రూ.1.20 లక్షల లంచం అందిస్తుండగా మాటువేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏఈను విచారిస్తున్నారు. -
బెదిరించాడు... బెయిల్ రద్దయింది
కర్నూలు : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ విద్యుత్ అధికారి బెయిలును...ఫిర్యాదుదారుడిని బెదిరిస్తున్నందుకు న్యాయస్థానం రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే... గత మార్చిలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ ట్రాన్స్‌కో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ చంద్రశేఖర్‌కు అదే నెల చివరిలో బెయిల్ మంజూరైంది. అయితే ఆయన ఫిర్యాదుదారు వెంకటేశప్పను బెదిరింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు ఏసీబీ కోర్టు పీపీ వెంకటేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన బెయిల్ రద్దు చేయాలని విన్నవించటంతో అందుకు కోర్టు శనివారం సమ్మతించింది. -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
హుజూర్నగర్: నల్లగొండ జిల్లా మట్టపల్లి ట్రాన్స్‌కో ఏఈ కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. శనివారం హుజూర్‌నగర్‌లోని ఏడీఈ కార్యాలయంలో ఓ రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రేమ్‌కుమార్ బిచ్కుంద : బిచ్కుంద ట్రాన్స్‌కో ఏఈ ప్రేమ్‌కుమార్ ఓ రైతు వద్ద నుంచి రూ.ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్ శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిచ్కుంద మండలం తక్కడ్‌పల్లి గ్రామానికి చెందిన గంగారాం అనే రైతుకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడానికి ఏఈ 8 నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడు. రూ.30 వేలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పా డు. రైతు ఎంత బతిమాలినా ఏఈ వినకపోవడంతో చివరకు రూ.10 వేలు ఇచ్చేలా రైతు ఒ ప్పందం చేసుకున్నాడు. అనంతరం గంగా రాం ఏసీబీని ఆశ్రయించడంతో డబ్బు నోట్ల కు కెమికల్ అంటించి, ఆ నోట్లను రైతుకు ఇ చ్చామని డీఎస్పీ చెప్పారు. దీంతో రైతు ఆ డబ్బును బస్టాండ్ సమీపంలోని ఓ టీస్టాల్ వద్ద ఏఈకి ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వివరించారు. వెంటనే ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేశామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. ఈ దాడిలో ఏసీబీ సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, చంద్రశేఖర్, ఖుర్షిద్ అలీ పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
నల్గొండ : నల్గొండ జిల్లాలో విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ ట్రాన్స్ కో ఏఈ ఏసీబీకి చిక్కాడు. వివరాలు... జిల్లాలోని నల్లచెలమాలకు చెందిన రైతు హనుమంతు గౌడ్ విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం చందంపేట ట్రాన్స్ కో ఏఈ సంతోష్ ని సంప్రదించాడు. కనెక్షన్ కోసం ఏఈ రైతును రూ.25 వేలు లంచం అడిగాడు. ముందుస్తుగా రైతు రూ.10 వేలు అందజేశాడు. అనంతరం ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏఈ పై నిఘా వేసిన అధికారులు గురువారం రైతు నుంచి మిగిలిన రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చందంపేట) -
'లక్ష' తీసుకుంటూ దొరికిపోయాడు..
కర్నూలు : కర్నూలు జిల్లాలో ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. లక్ష రూపాయిల లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ బుధవారం ఉదయం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే ఎమ్మిగనూరు ట్రాన్స్‌కోలో ఏఈగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్...ఓ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గత కొన్నిరోజులుగా తన పని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ వెంకటస్వామి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పెడచెవిన పెట్టిన ఏఈ లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ రోజు ఉదయం ఏడీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏఈని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
జీలుగుమిల్లి :రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ జీలుగుమిల్లి ట్రాన్స్‌కో ఏఈ అడపా వెంకటేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంకు చెందిన అలవాల గంగాధర్‌రెడ్డి అనే రైతు తన పొలంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు కాగా, దానిని ఏర్పాటు చేయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని ట్రాన్స్‌కో ఏఈ అడపా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రైతు చెప్పడంతో, రూ.8 వేలు ఇవ్వాలని అడిగారు. దీంతో రైతు గంగాధరరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయిం చారు. వలపన్నిన ఏసీబీ అధికారులు రైతుకు రూ.8 వేలు ఇచ్చి దర్భగూడెంలోని ట్రాన్స్‌కో కార్యాలయానికి పంపించారు. రైతు గంగాధరరావు ఆ మొత్తాన్ని ఏఈ వెంకటేశ్వరరావుకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేశామని, ఏఈని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ విల్సన్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఏసీబీకి పట్టుబడిన ఏఈ వెంకటేశ్వరరావు తాడేపల్లిగూడెంలో పనిచేస్తూ నాలుగు నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చారు. -
కర్షకున్ని వేధించి..ఏసీబీకి చిక్కి..
నిజామాబాద్క్రైం/ఆర్మూర్, న్యూస్‌లైన్: ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన ముస్కు చిన్న రాజారెడ్డి పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లారు. నాలుగేళ్లపాటు అక్కడ కష్టపడ్డా లాభం లేకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. తనకున్న ఆరు ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. ప్రస్తుతం ఈయన పొలంలో రెండు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. 16 కేవీ ట్రాన్స్ ఫార్మర్పై ఓవర్‌లోడ్ కారణంగా మోటార్లు చెడిపోతుండడంతో అదనపు ట్రాన్స్ఫార్మర్కోసం ఇరవై రోజుల క్రితం దేగాం ఏఈ గోవర్ధన్‌ను కలిశారు. అయితే రూ. 20 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేస్తానని సదరు ఏఈ తెగేసి చెప్పాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని చిన్న రాజారెడ్డి పేర్కొన్నా వినలేదు. పైసా తగ్గినా కుదరదన్నాడు. దీంతో చేసేదేమీ లేక ఆయన స్వగ్రామానికి వెళ్లిపోయారు. తోటి రైతులతో విషయం చెప్పారు. వారు ఏసీబీని ఆశ్రయించాలని సూచించారు. దీంతో ఆయన ఏసీబీకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే గురువారం గ్రామానికి వచ్చిన ఏఈని రైతు చిన్న రాజారెడ్డి కలిశారు. రూ. 17 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఫలానా చోట.. ‘తాను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా పవర్‌హౌస్ కార్యాలయంకు వెళ్తున్నానని, అక్కడికి డబ్బులు తీసుకుని రావాలని’ ఏఈ చెప్పాడు. చిన్నరాజారెడ్డి శుక్రవారం పవర్‌హౌస్‌కు వెళ్లి ఏఈను కలిశాడు. అయితే చౌరస్తాలోని సలీం హోటల్‌కు వెళ్లమని, అక్కడికి వచ్చి డబ్బులు తీసుకుంటానని ఏఈ చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడికి వెళ్లి రైతు వద్దనుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, రఘనాథ్‌రెడ్డిలు పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏఈని శనివారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. అవినీతి అధికారిని పట్టించిన రైతు రాజారెడ్డిని మిగతా రైతులు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయకుండా, డబ్బుల కోసం పీడించే అధికారుల సమాచారం తమకు అందించాలని సూచించారు.