బీకేఎస్‌ విద్యుత్‌ శాఖ ఏఈ సస్పెండ్‌ | transco ae suspend | Sakshi
Sakshi News home page

బీకేఎస్‌ విద్యుత్‌ శాఖ ఏఈ సస్పెండ్‌

Published Sat, Apr 29 2017 11:50 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

బుక్కరాయసముద్రం మండలం విద్యుత్‌శాఖ ఏఈ గోపాలరెడ్డికి సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇచ్చినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్‌ ప్రసాదరెడ్డి శనివారం ‘సాక్షి’కి తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : బుక్కరాయసముద్రం మండలం విద్యుత్‌శాఖ ఏఈ గోపాలరెడ్డికి సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఇచ్చినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్‌ ప్రసాదరెడ్డి శనివారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర నుంచి వచ్చిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను శుక్రవారం ఏఈ గోపాలరెడ్డికి అందజేశామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు కోసం బీకేఎస్‌ మండలం నీలారెడ్డిపల్లికి చెందిన రైతు సాయినాథరెడ్డి నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా ఈనెల 24న అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్న నేపథ్యంలో సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement