gopalreddy
-
బీకేఎస్ విద్యుత్ శాఖ ఏఈ సస్పెండ్
అనంతపురం అగ్రికల్చర్ : బుక్కరాయసముద్రం మండలం విద్యుత్‌శాఖ ఏఈ గోపాలరెడ్డికి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి శనివారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర నుంచి వచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వులను శుక్రవారం ఏఈ గోపాలరెడ్డికి అందజేశామన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం బీకేఎస్ మండలం నీలారెడ్డిపల్లికి చెందిన రైతు సాయినాథరెడ్డి నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా ఈనెల 24న అవినీతి నిరోధకశాఖ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్న నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. -
బాబు మోసాలకు ఓటుతో బుద్ధి చెప్పండి
– వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి నంద్యాలవిద్య/నంద్యాలవ్యవసాయం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన మోసాలను ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కోర్టులు, తహసీల్దార్, రిజిస్ట్రార్, ట్రెజరీ, బీఎస్ఎన్ఎల్, ఏపీట్రాన్స్కో కార్యాలయాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్యోగులను, నిరుద్యోగులను దగా చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని రెండున్నరేళ్లు మభ్యపెట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో మళ్లీ ఈ హామీని వెలుగులోకి తెచ్చారన్నారు. అయితే పట్టభద్రులు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. తాను విజయం సాధిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, యువకుల ఉపాధి కోసం పోరాడుతానని చెప్పారు. కోర్టు ఆవరణంలో ప్రచారం... కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్‌లో వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హైకోర్టు బెంచి కర్నూలులో ఏర్పాటు చేస్తామని, లాయర్లకు డెప్త్ బెనిఫిట్స్ కోసం రూ.5లక్షలు ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానన్నారు. ఈనెల 9వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ మొదటి ఓటు ప్రాధాన్యత తనకే వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, న్యాయవాదులు మాధవరెడ్డి, ఎస్ఎం ఖాద్రి, వివేకానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హోలీక్రాస్ చర్చిలో ప్రార్థనలు.. స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చిలో గోపాల్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన ఆర్‌ఎస్‌రోడ్డు, విశ్వాసపురం, మిషన్ కాంపౌండ్, ఎల్ఐసీ ప్రాంతాల్లో పర్యటించి, పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఆయన వెంట పెన్షనర్ల అసోసియేషన్ కార్యదర్శి ఎల్ఈఈ అమృతం, బ్రహ్మానందరెడ్డి, పుల్లారెడ్డి, సాయిరాంరెడ్డి పాల్గొన్నారు. -
ప్రచారంలో దూసుకుపోతున్న గోపాల్‌రెడ్డి
– ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం – సీమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్న వైనం – కలిసివస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల ఐక్యత కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో 8 రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎన్జీఓ, జేఏసీ చైర్మన్ వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారంలో దూసుకు పోతున్నారు. తెలుగుదేశం హయాంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టభద్రుల ముందు ఉంచుతుండడంతో మంచి స్పందన లభిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల అమలుపై నిర్లక్ష్యం వహించడంతో యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. అది వైఎస్ఆర్సీపీకి కలిసివచ్చే అంశమని పరిశీలకులు భావిస్తున్నారు. పశ్చిమ బరిలో ప్రథమ స్థానం... పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 25 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో వైఎస్ఆర్సీపీ నుంచి వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డి, టీడీపీ నుంచి కేజేరెడ్డి, పీడీఎఫ్ నుంచి గేయానంద్ ప్రధానంగా ఉన్నారు. వీరి ముగ్గురి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల వైఎస్ఆర్సీపీ నాయకులు గోపాల్‌రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన ప్రచారంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రచారం... ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం.. రాయలసీమలోని పెండింగ్‌లో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. అంతేకాక పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధిని కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం సీమలో హైకోర్టు సహా కొన్ని ముఖ్యమైన సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రజల అభ్యర్థనలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి.. రాజధాని, హైకోర్టుతో సహా అన్ని కోస్తాకు తరలించడంతో యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. నిరుద్యోగ భృతి ఎన్నికల స్టంట్.... ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వ ప్రకటించడం ఎన్నికల స్టంట్ అన్ని పట్టభద్రులు పేర్కొంటున్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏనాడో అమలు చేసేదని పేర్కొంటున్నారు. ఇది కేవలం ఎన్నికల కోసమేనని తాము పూర్తిగా నమ్ముతున్నామని పేర్కొంటున్నారు. మరోసారి టీడీపీ నమ్మి మోసపోయే స్థితిలో లేమని నిరుద్యోగులు సమాధానం ఇస్తున్నారు. తప్పుడు సర్వే.. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి, కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి కేజేరెడ్డి ఓడిపోతారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాక అయనకు సహకరించేది లేదని బహిరంగంగానే మూడు జిల్లాలోని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. అయినా పట్టభద్రులను మోసం చేయడానికి ఓ తప్పుడు సర్వేతో తాను గెలుపొందుతానని ప్రచారం చేయించారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులే బయటపెట్టారు. -
రాష్ట్రంలో దుష్ట పాలనను తరి మేద్దాం
- వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి పత్తికొండ : రాష్ట్రంలో టీడీపీ దుష్టపాలనను తరిమేద్దామని వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి పట్టభద్రులకు పిలుపునిచ్చారు. గురువారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు విదేశాలు తిరుగుతూ రూ.కోట్లు దుర్వినియోగం చేయడంతో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ఎన్నికల్లో విద్యార్థులు, రైతులు, పొదుపు మహిళలు, పట్టభద్రులకు అబద్ధపు హామీల ఇచ్చి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సీఎం చేస్తున్న అవినీతి, అక్రమాలను అడ్డుకుంటున్నాడే తప్ప రాష్ట్ర అభివృద్ధిని కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు, యువకులపై పీడీ యాక్టు, రౌడీషీట్ నమోదు చేస్తామని ప్రభుత్వం బెదిరించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో 1.40 లక్షలు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రం అధోగతి పాలు.. టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని నియోజకవర్గ ఇన్చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి విమర్శించారు. వెన్నపూస గోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. నాయకులు జూటూరు బజారప్ప, జిట్టా నాగేష్, మురళిధర్‌రెడ్డి, రాజశేఖర్‌రావు, కారం నాగరాజు, నరసింహయ్య ఆచారి మల్లికార్జునయాదవ్, స్టీవెన్, విష్ణువర్ధన్, ప్రహ్లాదరెడ్డి, ఎర్రగుడి రామచంద్రరెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, మధుసూదన్‌నాయుడు, భద్రయ్య, టీఎం రమేష్, ఇమ్రాన్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
డిమాండ్ల సాధనకు అవిశ్రాంత పోరాటం
∙పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి చెన్నేకొత్తపల్లి : ఉపాధ్యాయులు, పట్టభద్రుల డిమాండ్ల సాధనకు అవిశ్రాంతంగా పోరాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మండల కేంద్రంతోపాటు న్యామద్దెల తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే గ్రామంలోని పలువురు పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేయడం ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయులకు, ఇతర ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. మోడల్, గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, సర్వీసు రూల్సు, రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచడం వంటి వాటి అమలుకు పోరాడతామన్నారు. టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం, లేదా రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లించేవరకు పోరాడతామన్నారు. రెండున్నరేళ్లుగా నిరుద్యోగులకు చెల్లించని భృతిని బకాయిల కింద చెల్లించేలా ఉద్యమిస్తామన్నారు. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆయా గ్రామాల్లోని నాయకులు, యువకులు ఉన్నారు. -
బాబు మోసాలే గోపాల్‌రెడ్డి విజయసోపానాలు
నూనెపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసాలే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయానికి సోపానాలని వైస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా పరిశీలకుడు విజయ రాఘవరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున బరిలోకి దిగిన వెన్నపూస గోపాల్ రెడ్డిని గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రచారం ముమ్మరం చేయాలన్నారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారని, అబద్ధాల బాబుకు ఎమ్మెల్సీ ఎన్నికలే గుణపాఠం కావాలని అన్నారు. మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచారన్నారు. రాజధాని పేరుతో కమిషన్లు పాల్పడుతూ పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు సీట్లు ఇస్తున్నారని, అలాంటి వారికి అవకాశం ఇవ్వరాదన్నారు. ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్యోగులు, కార్మిక సమస్యలపై పోరాటాలు చేసిన ఘనత గోపాల్‌రెడ్డికి ఉందన్నారు. ఇలా పోరాడే నాయకుడికే పట్టం కట్టాలన్నారు. ఎన్నికల ప్రచారకులు కుమార్, వైఎస్ యువసేన రాష్ట్ర కార్యదర్శి సునీల్‌రెడ్డి, పార్టీ నంద్యాల, గోస్పాడు మండలాల కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నాయకులు ద్వారం వీరారెడ్డి, ద్వారాం మాధవరెడ్డి, వివేకానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి – పార్టీ శ్రేణులకు అనంతవెంకట్రామిరెడ్డి పిలుపు కర్నూలు(ఓల్డ్‌సిటీ): పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించుకుని వైఎస్ఆర్సీపీ సత్తా ఏమిటో చాటుదామని పార్టీ శ్రేణులకు జిల్లా పరిశీలకుడు అనంతవెంకట్రామిరెడ్డి, అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిషా్టత్మకంగా తీసుకొని పార్టీ అభ్యర్థుల గెలుపునకు గట్టి కృషి చేయాలని కోరారు. జిల్లాలో 82 వేలు, కర్నూలు నగరంలో 36 వేల పట్టభద్ర ఓటర్లు ఉన్నారన్నారు. గత ఎన్నికల హామీలు అమలు చేయనందుకు ప్రభుత్వంపై వారికి వ్యతిరేకత ఉందని చెపా్పరు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన వెన్నపూస గోపాల్‌రెడ్డికి కార్మిక, కర్షక, ఉద్యోగుల సమస్యలపై మంచి అవగాహన ఉందని పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకు వేసేలా చూడాలనానరు. ఓటును ఎలా ఉపయోగించుకోవాలో వారికి అవగాహన కల్పించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గాల ఇన్చార్జీల జాబితా విడుదల చేశారు. గేట్‌వే ఆఫ్ ది ఎలక్షన్స్ టు వైఎస్ఆర్సీపీ.. వైఎస్ఆర్సీపీకి ఇవి గేట్‌వే ఆఫ్ ది ఎలక్షన్స్ అని, మేధావులంతా తమకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కోరారు. నిత్యం అబద్ధాలతో కాలం గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం జిమ్మిక్కులు చేసేందుకు ప్రయత్నిస్తారని, దాన్ని పసిగట్టి తిప్పికొట్టాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులు సైతం విదేశాలకు వెళ్లి చదువుకోగలుగుతున్నారన్నారు. అలాంటి పాలన రావాలంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయం పట్టభద్రులకు తెలియజేయాలన్నారు. బుధవారం అనంతపురంలో జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. -
గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందాం
– వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బలపరచిన అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకుందామని పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు విద్యార్థులను కోరారు. శనివారం సాయంత్రం రాయలసీమ యూనివర్సిటీలో ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఓటర్ల నమోదు పత్రాలు అందించి పూరింపజేశారు. సీఎం చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నారని, ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది వైఎస్‌ఆర్‌సీపీయేనని సలాంబాబు అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్, వైఎస్ఆర్ ఎస్‌యూ రాయలసీమ యూనివర్సిటీ విభాగం అధ్యక్షుడు దేవాతో పాటు సంజు, సాహి తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
► ఎపీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి గుంతకల్లు టౌన్: ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఎన్జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంతకల్లు, గుత్తి పట్టణాల్లో గురువారం ఆయన పర్యటించారు. కళాశాలలు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపక, ఉపాధ్యాయులు, ఉద్యోగ, కార్మిక సిబ్బందిని కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఏ బకాయిలను చెల్లించాలని, పీఆర్సీ అనుబంధ జీఓలను అమలు చేయాలన్నారు. హెల్త్‌కార్డు సౌకర్యం ఉన్న ఉద్యోగ, కార్మికులందరికీ క్యాస్‌లెస్ కార్పొరేట్ వైద్యం అందజేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ అశోక్‌కుమార్ రెడ్డి, జిల్లా కన్వీనర్ ఓబులరావు, రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు ఆయన వెంట ఉన్నారు.